విద్యార్థి దుర్మరణం
డోన్ టౌన్: పట్టణంలోని శ్రీరాముల దేవాయలం సమీపంలోని కర్నూలు రైల్వే గేటు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. స్థానిక సీపర్స్ కాలనీకి చెందిన హమాలీ శ్రీనివాసులు, లక్ష్మీదేవి కుమారుడు విష్ణువర్ధన్ (13) పాతపేటలోని జెడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం సైకిల్‌పై బయటకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో విష్ణువర్ధన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మతి చెందాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులోని కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. డోన్ ఎస్‌ఐ సుబ్రమణ్యంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రై వర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.