సాక్షి, డోన్(కర్నూల్) : పట్టణంలోని స్థానిక త్రివర్ణ కాలనీకి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు రాందాస్ శుక్రవారం ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి యత్నించాడు. పట్టణ ఎస్‌ఐ సునీల్‌కుమార్ తెలిపిన వివరాలు.. త్రివర్ణ కాలనీకి చెందిన ఏడు, ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ఉండగా, అదే కాలనీకి చెందిన రైల్వే రిటైర్డ్ ఎంప్లాయ్ రాందాస్ తినుబండారాలు ఇచ్చి మచ్చిక చేసుకున్నాడు. కాసేపటికి మాయమాటలు చెప్పి పక్కనే నూతనంగా నిర్మిస్తున్న రైల్వే క్వార్టర్స్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించగా చిన్నారులు కేకలు వేయడంతో స్థానికుడు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకునేలోపే నిందితుడు పరారయ్యాడు. చిన్నారుల తల్లిదడ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు రాందాస్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment