కర్నూలు ఆస్పత్రిలో పాము కలకలం | snake hulchal in kurnool hospital | Sakshi
Sakshi News home page

కర్నూలు ఆస్పత్రిలో పాము కలకలం

Published Thu, Sep 3 2015 10:18 PM | Last Updated on Mon, Aug 20 2018 7:28 PM

snake hulchal in kurnool hospital

కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గురువారం ఓ పాము కలకలం సృష్ట్టించింది. ఆసుపత్రి వెనుకవైపు నుంచి వచ్చిన ఓ కట్ల పాము ఎంఎం-3 వార్డులోకి చేరుకుంది. ఓ రోగి దానిని చూసి భయంతో గట్టిగా కేకలు వేశాడు. దీంతో వార్డులోని మిగతా రోగులు భయంతో ఒక్క ఉదుటున బయటకు పరుగులు తీశారు. రోగుల సహాయకులు కర్రతో ఆ పామును చంపేసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కొరకడంతో ఓ శిశువు మృతి చెందిన విషయం మరువక ముందే కర్నూలు ఆసుపత్రిలో పాము కనిపించడం రోగుల్లో భయాందోళన నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement