పంటలు సాగు చేసేందుకు ఆ రైతు దంపతులు అప్పులు చేశారు. అప్పులు తీర్చే మార్గం లేక సతమతమయ్యారు. దిక్కుతోచని స్థితిలో ఒకరి తర్వాత మరొకరు ప్రాణం తీసుకున్నారు. బిడ్డలు మాత్రం అనాథలయ్యారు.‘ నాన్నా.. అప్పులు మీ ఉసురు తీశాయా’ అన్నట్లు ఆ బిడ్డ నాన్న మృతదేహం వైపు అమాయకంగా చూస్తుంటే అక్కడున్నవారు చలించిపోయారు.
ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో సోమవారం రాత్రి ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అమృతానగర్‌కు చెందిన ఆకుల వెంకటసుబ్బయ్య(12) మరణించాడు. తండ్రి సుధాకర్‌తో కలసి ఆటోలో ప్రయాణిస్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సుబ్బయ్య ఆరోగ్య పరిస్థితి విషమించండతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోని బేతంచెర్ల వద్దకు వెళ్లగానే వెంకటసుబ్బయ్య తుదిశ్వాస వదిలాడు. మంగళవారం తెల్లవారుజామున బాలుడి మృతదేహాన్ని ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
పిల్లలంటే ప్రాణం..
అమృతానగర్‌కు చెందిన సుధాకర్, లక్ష్మిదేవి దంపతులకు వెంకటసుబ్బయ్య, శివలక్ష్మి అనే ఇద్దరు పిల్లలున్నారు. వెంకటసుబ్బయ్య అనిబిసెంట్ మునిసిపల్ హైస్కూల్‌లో ఆరో తరగతి చదువుతుండగా, కుమార్తె శివలక్ష్మి మూడో తరగతి చదువుకుంటోంది. బేల్దారి పని చేసుకునే సుధాకర్ పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాడు. వారికి పిల్లలంటే ప్రాణం. మధ్య తరగతి కుటుంబం అయినా పిల్లలు అడిగింది కాదనకుండా ఇప్పించే వాళ్లు. సోమవారం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వెంకటసుబ్బయ్య సంక్రాంతి పండుగకు బట్టలు కావాలంటూ తల్లి లక్ష్మీదేవిని అడిగాడు.
ఇంకా పండుగ వారం ఉంది కదరా.. రెండు రోజులు ఉండి తెచ్చుకుందువులే అని ఆమె కుమారునితో చెప్పింది. అయినా అతను వినిపించుకోకుండా ఇప్పుడే ఇప్పించాలంటూ ఏడ్వడం మొదలు పెట్టాడు. అంతలోనే బేల్దారి పనికి వెళ్లొచ్చిన తండ్రి సుధాకర్ ను అడిగాడు. ఎంత చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేకపోవడంతో సాయంత్రం కుమారుడ్ని వెంటబెట్టుకుని ప్రొద్దుటూరుకు వెళ్లాడు. కుమారుని కోరిక మేరకు అతనికి నచ్చిన రెండు జతల బట్టలు ఇప్పించాడు.
అప్పటికే రాత్రి ఎనిమిది గంటలైంది. పాత బస్టాండ్‌కు రాగానే అమృతానగర్‌కు వెళ్లేందుకు ఆటో సిద్ధంగా ఉండటంతో తండ్రీకొడుకులు ఆటో ఎక్కారు. వారు ప్రయాణిస్తున్న ఆటో కొద్ది దూరం వెళ్లగానే ట్రాక్టర్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో కుడివైపున కూర్చున్న వెంకటసుబ్బయ్యకు ట్రాక్టర్ నేరుగా తగలడంతో తలకు బలమైన గాయం అయింది. కుమారుడు రక్తపు మడుగులో ఉండటాన్ని చూసిన తండ్రి సుధాకర్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా ఆంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు, అమృతానగర్ వాసులు మంగళవారం ఉదయం జిల్లా ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బాలుడిని చూసి వారంతా చలించిపోయారు. కుమార్తె శివలక్ష్మిని దగ్గరకు తీసుకొన్న లక్ష్మీదేవి బోరున విలపించసాగింది. పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పులే ఉసురు తీశాయా నాన్నా!
Published Wed, Jan 8 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement
Advertisement