ఆటో బోల్తా- ఒకరు మృతి
– ముగ్గురికి తీవ్రగాయాలు
బేతంచెర్ల: ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా, మరో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బేతంచెర్ల సమీపంలో గురువారం చోటు చేసుకుంది.ఽ సీతారామపురం గ్రామం నుంచి ఆరుగురు ప్రయాణికులతో బయలుదేరిన ఆటో బేతంచెర్ల సమీపంలోని అయ్యల చెరువు వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సీతారామాపురం గ్రామానికి చెందిన తిమ్మయ్యతో పాటు, బాల నాగమ్మ, బేతంచెర్ల జంగాల పేటకు చెందిన బాలమ్మ, సుంకమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బేతంచెర్ల ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే తిమ్మయ్య(50) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాల నాగమ్మ, సుంకమ్మ, బాలమ్మను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ తిరుపాలు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించారు.