బేతంచెర్ల(కర్నూలు జిల్లా): పట్టణంలోని కోటపేట కాలనీలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా నివాసముంటున్న మాబాషా, షాకీరాబీ (26) దంపతులు అరటి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నారు. ఆదివారం ఉదయం షాకీరాబీ దోశ పిండి గ్రైండ్ పట్టించుకొని వచ్చింది. ‘దోశ పిండి నీ లాగే’ ఉందని తోడి కోడలు షబానా అనడంతో మనస్తాపానికి గురైంది.
అనంతరం టిఫిన్ చేసే విషయంలో భర్తతో వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికి ఇంట్లో ఎవరూ లేని సమయంలో షాకీరాబీ ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను కుటుంబీకులు ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
(చదవండి: కార్పొరేటర్ హత్య కేసు: కృష్ణా జిల్లాలో చిన్నా?)
నెత్తురోడిన రహదారి
Comments
Please login to add a commentAdd a comment