బేతంచెర్ల (కర్నూలు జిల్లా): బేతంచెర్ల మండలపరిధిలోని యం పేండేకల్లు గ్రామ సమీపాన ఉన్న దుర్గమ్మ చెర్వు దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహం ముందు భాగన గుప్త నిధుల కోసం ఈనెల 26 వతేదిన తవ్వకాలు చేపట్టిన నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ సుబ్రమణ్యం మంగళవారం వెల్లడించారు. వివరాల మేరకు మండలపరిధిలోని యం పేండేకల్లు గ్రామ సమీపాన ఉన్న దుర్గమ్మ చెర్వు విగ్రహం ముందు భాగాన గుప్త నిధులు ఉన్నాయన్న సమాచారం మేరకు బేతంచెర్లకు చెందిన పాపసాని తిరుమలేశ్వర్‌రెడ్డి, ఈడిగ వేంకటేశ్వరగౌడు, సూరిబాబు,అయ్యల చెర్వుకు చెందిన శాలు, కర్నూలు గణేష్ నగర్‌కు చెందిన పింజరి నబిసాహేబ్, పొలా వెంకటస్వామి తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఈనెల 26 వ తేదిన ద్విచక్రవాహనాలపై సంఘటన స్థలానికి చేరుకొని క్షుద్ర పూజలు నిర్వహించి తవ్వకాలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి వెల్లగా గుప్త నిధుల తవ్వకాలు చేపట్టిన దొంగలు ద్విచక్రవాహనాలు వదిలివేసి పారిపోయారు.
గ్రామ వీఆర్వో మద్ది లేటిస్వామి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం కొలుములపల్లె రహదారిలోని నీల్ల ట్యాంకు వద్దపాపసాని తిరుమలేశ్వర్‌రెడ్డి, ఈడిగ వేంకటేశ్వరగౌడు, సూరిబాబు,అయ్యల చెర్వుకు చెందిన శాలు, కర్నూలు పింజరి నబిసాహేబ్, పొలా వెంకటస్వామి లు అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారిలో ఉన్నట్లు తెలిపారు. వీరంతా అక్షయగోల్డ్ స్కీములో నష్ట పోయి గుప్త నిధుల ద్వార నష్టాలను పూడ్చుకోవచ్చని అయ్యలచెర్వు కు చెందిన శాలు సలహా మేరకు తవ్వకాలకు పాల్పడ్డారని సీఐ సుబ్రమణ్యం తెలిపారు.కార్యక్రమంలో ఎస్‌ఐ హనుమంత్‌రెడ్డి, కానిస్టేబుల్ జనార్థన్,రమణ తదితరులు పాల్గొన్నారు.
గుప్త నిధుల దొంగలు అరెస్టు
Published Tue, Oct 27 2015 10:58 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement