కర్నూలు : కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి సమీపంలో అటవీశాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 100కుపైగా ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయాన్ని గమనించిన అక్కడే పొదల చాటున దాగి ఉన్న ఎర్రచందనం కూలీలు... అటవీశాఖ అధికారులపై రాళ్లతో దాడి చేశారు.
అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారు. వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ఎర్రచందనం కూలీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.