తిరుపతి : తిరుమలలోని అన్నదమ్ముల బండ సమీపంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేపీ డ్యామ్ సమీపంలో 24 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం కూడా టాస్క్ఫోర్స్ పోలీసులు సదరు ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా దాదాపు 40 మంది ఎర్రచందనం కూలీలు పోలీసులకు ఎదురుపడ్డారు.దీంతో కూలీలు అక్కడి నుంచి పరారైయ్యారు. పోలీసులు వారి కోసం రెండో రోజు ఆదివారం కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Published Sun, May 1 2016 9:43 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM
Advertisement
Advertisement