పాక్‌లో హిందూ ఆలయాలను కూల్చనివ్వం | JuD will not allow Hindu temples in Pakistan to be destroyed, says Hafiz saeed | Sakshi
Sakshi News home page

పాక్‌లో హిందూ ఆలయాలను కూల్చనివ్వం

Published Tue, May 3 2016 6:09 PM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM

పాక్‌లో హిందూ ఆలయాలను కూల్చనివ్వం

పాక్‌లో హిందూ ఆలయాలను కూల్చనివ్వం

అతడు కరడుగట్టిన ఉగ్రవాది. పాకిస్థాన్‌లోనే నిషేధించిన జమాత్ ఉద్ దవా అనే ఉగ్రవాద సంస్థకు అధినేత. పేరు హఫీజ్ సయీద్. అలాంటి వ్యక్తి తాజాగా చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోంది. పాకిస్థాన్‌లోని హిందూ ఆలయాలతో పాటు ముస్లిమేతరులకు సంబంధించిన పవిత్ర స్థలాలు వేటినీ కూల్చడానికి తాము ఒప్పుకొనేది లేదని చెప్పాడు.

హిందూ సోదరుల పవిత్రస్థలాలను కాపాడాల్సిన బాధ్యత ముస్లింలపై ఉంటుందని సింధ్ రాష్ట్రంలోని మత్లీ పట్టణంలో జరిగిన ఓ సమావేశంలో సయీద్ అన్నాడు. సింధ్‌లోని థార్ ప్రాంతంలో తమ సంస్థ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలను సయీద్ ఖండించాడు. కశ్మీరీ ముస్లింలకు కూడా అతడు మద్దతు పలికినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement