తైపీ: చైనా మరోసారి ప్రతీకార చర్యలకు దిగింది. గురువారం అమెరికా నేవీకి చెందిన పి–8ఏ పొసెడాన్ యాంటీ సబ్‌మెరీన్ గస్తీ విమానం చైనా– తైవాన్‌లను విడదీసే తైవాన్ జలసంధి మీదుగా చక్కర్లు కొట్టడం ఆ దేశానికి మింగుడుపడటం లేదు. దీంతో, శుక్రవారం యుద్ధ విమానాలను, నేవీ షిప్‌లను పెద్ద సంఖ్యలో తైవాన్ సమీపంలోకి పంపించి, బెదిరింపు చర్యలకు దిగింది.
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)కి చెందిన 38 ఫైటర్ జెట్లు, ఇతర యుద్ధ విమానాలు తమ భూభాగానికి అత్యంత సమీపంలోకి వచ్చినట్లు తైవాన్ రక్షణ మంత్రి శుక్రవారం తెలిపారు. ఈ నెలారంభంలో భారీగా సైనిక విన్యాసాలు చేపట్టిన తర్వాత పెద్ద సంఖ్యలో విమానాలు, నౌకలను తైవాన్ సమీపంలోకి తరలించడం ఇదే మొదటిసారి.
Comments
Please login to add a commentAdd a comment