Navy ships
-
తైవాన్ సమీపంలో భారీగా చైనా విమానాలు, నౌకలు
తైపీ: చైనా మరోసారి ప్రతీకార చర్యలకు దిగింది. గురువారం అమెరికా నేవీకి చెందిన పి–8ఏ పొసెడాన్ యాంటీ సబ్మెరీన్ గస్తీ విమానం చైనా– తైవాన్లను విడదీసే తైవాన్ జలసంధి మీదుగా చక్కర్లు కొట్టడం ఆ దేశానికి మింగుడుపడటం లేదు. దీంతో, శుక్రవారం యుద్ధ విమానాలను, నేవీ షిప్‌లను పెద్ద సంఖ్యలో తైవాన్ సమీపంలోకి పంపించి, బెదిరింపు చర్యలకు దిగింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కి చెందిన 38 ఫైటర్ జెట్లు, ఇతర యుద్ధ విమానాలు తమ భూభాగానికి అత్యంత సమీపంలోకి వచ్చినట్లు తైవాన్ రక్షణ మంత్రి శుక్రవారం తెలిపారు. ఈ నెలారంభంలో భారీగా సైనిక విన్యాసాలు చేపట్టిన తర్వాత పెద్ద సంఖ్యలో విమానాలు, నౌకలను తైవాన్ సమీపంలోకి తరలించడం ఇదే మొదటిసారి. -
జైహింద్ స్పెషల్: ఐ.ఎన్.ఎస్. విక్రాంత్
ఇండియన్ నేవీ షిప్ విక్రాంత్ భారత నౌకాదళానికి చెందిన మెజెస్టిక్–క్లాస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్. సంస్కృతంలో విక్రాంత్ అంటే ‘ధైర్యవంతుడు‘ అని అర్థం. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ రాయల్ నేవీ కోసం హెచ్.ఎం.ఎస్. హెర్క్యులస్గా దీని నిర్మాణం ప్రారంభించారు. ఆలోపు యుద్ధం ముగియడంతో ఆ యుద్ధనౌక నిర్మాణం పనులు ఆగిపోయాయి. భారతదేశం 1957లో ఆ అసంపూర్ణ విమాన వాహక నౌకను కొనుగోలు చేసింది, 1961లో నిర్మాణం పూర్తయింది. విక్రాంత్ భారత నావికాదళం మొదటి విమాన వాహక నౌకగా ఆ ఏడాదే రంగంలోకి దిగింది. 1971 ఇండో–పాకిస్తాన్ యుద్ధంలో తూర్పు పాకిస్థాన్‌పై నౌకాదళ దిగ్బంధనాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించింది. తరువాతి సంవత్సరాలలో 1997 జనవరిలో విక్రాంత్ ఆపరేషన్లను నిలిపివేయడానికి ముందు విక్రాంత్‌ను ఆధునిక విమానాల పార్కింగ్ కోసం భారీ స్థాయిలో పునర్నిర్మించారు. విక్రాంత్ 2012 వరకు ముంబైలోని కఫ్ పరేడ్‌లో మ్యూజియం షిప్‌గా భద్రపరిచారు. సుప్రీంకోర్టు తుది అనుమతి అనంతరం 2014 జనవరిలో ఆన్లైన్ వేలం ద్వారా ప్రభుత్వం విక్రాంత్‌ను విక్రయించింది. -
కొనసాగుతున్న మలబార్ విన్యాసాలు
దొండపర్తి(విశాఖ దక్షిణ): అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి భారత నౌకాదళం బంగాళాఖాతంలో నిర్వహిస్తున్న మలబార్ రెండో దశ విన్యాసాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం జరిగిన ప్రదర్శనలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రన్విజయ్(డీ55), ఐఎన్ఎస్ సత్పుర (ఎఫ్ 48) నౌకలు పాల్గొన్నాయి. వీటితో పాటు యూఎస్ ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ యూఎస్ఎస్ కారల్ విన్సన్, జపనీస్ హెలికాఫ్టర్ కారియర్ జేఎస్.. ఇలా తొమ్మిది యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో భాగస్వామ్యమయ్యాయి. యూఎస్ నేవీ ఆపరేషన్స్ చీఫ్ అడ్మిరల్ మైఖిల్ గిల్డే సతీసమేతంగా బుధవారం తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన తూర్పునావికాదళపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్‌తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. -
మరో సారి మా బాంబులు గురి తప్పవు : బ్రిటన్‌కు రష్యా వార్నింగ్
మాస్కో: శతాబ్దాల కాలం నుంచి సముద్రాల మీద అధిపత్యం కోసం సంపన్న దేశాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో పలు దేశాలు కొన్ని ప్రాంతాలలోని జలాలు తమకు చెందినవిగా ప్రకటించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరహాలోనే.. తమ జలాల్లోకి ప్రవేశించిన బ్రిటన్‌కు రష్యా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ రాయల్ నేవికి చెందిన డెస్ట్రాయర్ హెచ్ఎంఎస్ డిఫెండర్ నౌక ఉక్రెయిన్ నుంచి జార్జియాకు వెళ్లే క్రమంలో క్రిమియా జలాల్లోకి ప్రవేశించింది. దీనిని గుర్తించిన రష్యా నౌకాదళ సిబ్బంది హెచ్చరికగా కాల్పులు జరిపింది. మళ్లీ ఈ ఘటన పునరావృతమైతే మా బాంబులు లక్ష్యాన్ని తాకుతాయని హెచ్చరించింది. ఇప్పటికే రష్యా.. బ్రిటన్ యుద్ధ నౌక తమ జలాల్లోకి వచ్చిందని, మాస్కోలోని బ్రిటన్ అంబాసిడర్ కార్యాలయానికి సమన్లు కూడా జారీ చేసింది. అయితే ఈ జలాలు ఉక్రెయిన్‌కు చెందినవిగా బ్రిటన్ సహా పలు దేశాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. తమ యుద్ధనౌక మార్గంలో రష్యా బాంబులేసిందని బ్రిటన్ ఆరోపిస్తోంది. కాగా ఈ ఘటనపై వీరివురి వాదనలు వేరువేరుగా ఉన్నాయి. ఈ ఘటనపై రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రిని బ్రిటన్ యుద్ధనౌక మార్గంలో బాంబులేశారట కదా అని ప్రశ్నిస్తే.. భవిష్యత్తులో మార్గంలో కాదు, టార్గెట్పైనే వేస్తామని అనడం గమనార్హం. There are conflicting reports over an incident involving Russian and British naval vessels in the Black Sea. Russia's defense ministry says warning shots were fired at a British ship — But Britain says any shots fired were pre-announced training exercises https://t.co/TKJpAnikuU pic.twitter.com/xZfUWwrsZU — Reuters (@Reuters) June 23, 2021 చదవండి: ఇదో వింత కేసు, ఇతనికి పది నెలలుగా పాజిటివ్..చివరికి -
విశాఖలో ముగిసిన ‘విరాట్’ పర్వం!
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విమాన వాహక నౌకగా గుర్తింపు పొందిన ఐఎన్ఎస్ విరాట్ నేవీ సేవల నుంచి 2016 అక్టోబర్‌లో నిష్క్రమించింది. అప్పట్లో దీన్ని మ్యూజియం, స్టార్ హోటల్‌గా మార్చాలని భావించారు. కేంద్ర ప్రభుత్వం విరాట్‌ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ఏపీకి అందించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా భీమిలి మండలం మూలకుద్దులో విరాట్‌ను మ్యూజియం, స్టార్ హోటల్‌గా మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు నివేదికను రూపొందించాలని చెన్నైకి చెందిన నాటెక్స్ మేరీటైమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు గత టీడీపీ ప్రభుత్వం రూ.1.50 లక్షలు కేటాయించింది. అయితే సుమారు రూ.700 కోట్ల ఈ ప్రాజెక్టు వ్యయ భారాన్ని భరించలేమంటూ టీడీపీ సర్కార్ చివరకు చేతులెత్తేసింది. దీంతో మహారాష్ట్ర తెరపైకి వచ్చి మ్యూజియంని తాము ఏర్పాటు చేసుకుంటామంటూ విరాట్‌ని ముంబై నావల్ డాక్ యార్డుకి తరలించింది. చివరికి ఈ నౌకని గుజరాత్‌కు చెందిన శ్రీరామ్ గ్రూప్ రూ.38.54 కోట్లకు వేలంలో దక్కించుకుంది. విరాట్ ప్రాజెక్టు వివరాలివీ.. ► యుద్ధ నౌకలోని 1,500 గదులను ఫైవ్ స్టార్ హంగులతో పర్యాటక హోటల్‌గా మార్చాలని నిర్ణయించారు. ► 500 మందికిపైగా కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంతోపాటు మిగిలిన భాగాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ► వీటితోపాటు స్పోర్ట్స్, యాకింగ్, సెయిలింగ్, గ్లైడింగ్, క్రూయిజింగ్ వంటి సౌకర్యాల్ని కల్పించాలని భావించారు. ఐఎన్ఎస్ విరాట్ విశేషాలివీ... ► 1959లో బ్రిటిష్ నౌకాదళంలో సేవలందించింది. ► 1987లో రూ.604.50 కోట్లకు భారత్ కొనుగోలు చేసి ఐఎన్ఎస్ విరాట్‌గా పేరు మార్చింది. ► ఐఎన్ఎస్ విరాట్ భారత జలాల్లో ప్రవేశించాక 22 మంది కెప్టెన్లు విధులు నిర్వర్తించారు. ఇందులో ఐదుగురు భారత నౌకాదళానికి చీఫ్ స్థానాన్ని అధిష్టించారు. ► ప్రపంచంలో సుదీర్ఘ కాలం (2,250 రోజులు (విధుల్లో ఉన్న కాలం)) సేవలందించిన యుద్ధ విమాన వాహక నౌకగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకుంది. అందుకే ఈ నౌకని ది గ్రాండ్ ఓల్డ్ లేడీ అని అంటారు. ► మొత్తం 10,94,215 కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. ఈ దూరం 27సార్లు భూమిని చుట్టి రావడంతో సమానం. ► యుద్ధ సమయంలో ఒకేసారి 26 యుద్ధ విమానాల్ని తీసుకెళ్లగలిగే సామర్థ్యం సొంతం. ► ఈ నౌక బరువు 28,700 టన్నులు, పొడవు 226.5 మీటర్లు, వెడల్పు 48.78 మీటర్లు. చివరిసారిగా విశాఖలోనే... భారత నౌకాదళానికి సుదీర్ఘ సేవలందించిన విరాట్.. అనేక చారిత్రక విజయాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. చివరిసారిగా విశాఖ సముద్ర జలాల్లోనే విహరించింది. 2016 ఫిబ్రవరిలో నిర్వహించిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)లో ఐఎన్ఎస్ విరాట్ తళుక్కున మెరిసింది. ఐఎఫ్ఆర్ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆఖరి అవకాశమూ చేజారింది...!! విరాట్‌ని వేలంలో దక్కించుకున్న శ్రీరామ్ గ్రూప్.. మ్యూజియంగా మార్చేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. రూ.100 కోట్లకి నౌకని ఇస్తామని, అక్టోబర్ 15లోగా ముందుకు రావాలంటూ ప్రకటించింది. దీనికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ.. నో అబ్జక్షన్ సర్టిఫికేట్ జారీ చేస్తే అమ్మేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే.. గడువు ముగిసే నాటికి ఎన్వోసీ రాకపోవడంతో తమ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. గుజరాత్ మారిటైమ్ బోర్డు అనుమతి రాగానే.. త్వరలోనే నౌకను విచ్ఛిన్నం చేసి తుక్కుగా మార్చే ప్రక్రియ మొదలు పెడతామని తెలిపింది. అయితే.. ఇండియా, బ్రిటన్ జాతీయ గౌరవంగా భావించాల్సిన ఐఎన్ఎస్ విరాట్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని డిసెంబర్ 4న ది హెర్మస్ విరాట్ హెరిటేజ్ ట్రస్ట్.. ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఈ లేఖపై ఇంకా ప్రధాని కార్యాలయ వర్గాలు స్పందించలేదు. -
నావీ షిప్లో అగ్ని ప్రమాదం.. 17 మందికి గాయాలు
లాస్ ఏంజిల్స్ : కాలిఫోర్నియాలోని యునైటెడ్ స్టేట్స్ నావీ షిప్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. శాన్‌డియాగో ఓడరేవులో ఉన్న యూఎస్ బోన్హోమ్ రిచర్డ్, ఆన్ అంఫిబియస్ అసల్ట్ నౌకలో అనూహ్యంగా పొగలు కమ్ముకోవడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ దుర్ఘటనలో 21 మంది గాయపడినట్లు అధికారులు, స్థానిక మీడియా పేర్కొంది. దట్టమైన పొగ పీల్చడం ద్వారా 17 మంది నావికులు నలుగురు పౌరులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఘటన సమయంలో సుమారు 160 మంది నావికులు పోర్టులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. (ఐదురోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు) -
విమానం అదృశ్యం
తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చిసమీపంలో ముగ్గురు సిబ్బందితో వెళుతున్న కోస్ట్ గార్డు డోర్నియర్ విమానం ఒకటి అదృశ్యమైంది. చివరి సారిగా తిరుచ్చి సముద్రతీర ప్రాంతంలో సోమవారం రాత్రి గుర్తించగా ఆ తర్వాత కనిపించకుండా పోయింది. చెన్నైలో సాయంత్రం 5:30 కు బయలుదేరిన ఈ విమానం రాత్రి 10 గంటలనుంచి కనపడకుండా పోయిందని విమానయాన వర్గాలు తెలిపాయి. కోస్టు గార్డు సిబ్బంది నాలుగు నౌకాదళ ఓడలతో గాలింపు చర్యలని ముమ్మరం చేశారు.