దొండపర్తి(విశాఖ దక్షిణ): అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి భారత నౌకాదళం బంగాళాఖాతంలో నిర్వహిస్తున్న మలబార్ రెండో దశ విన్యాసాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం జరిగిన ప్రదర్శనలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ రన్‌విజయ్(డీ55), ఐఎన్‌ఎస్ సత్పుర (ఎఫ్ 48) నౌకలు పాల్గొన్నాయి. వీటితో పాటు యూఎస్ ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ యూఎస్‌ఎస్ కారల్ విన్సన్, జపనీస్ హెలికాఫ్టర్ కారియర్ జేఎస్.. ఇలా తొమ్మిది యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో భాగస్వామ్యమయ్యాయి.
యూఎస్ నేవీ ఆపరేషన్స్ చీఫ్ అడ్మిరల్ మైఖిల్ గిల్డే సతీసమేతంగా బుధవారం తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన తూర్పునావికాదళపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్‌తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment