
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో జరుగుతున్న 24వ మలబార్ విన్యాసాలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. భారత యుద్ధ నౌకలు మరోసారి తమ సత్తా చాటాయి. అండమాన్ సముద్ర జలాల్లో నిర్వహించిన విన్యాసాల్లో భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మేరిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్‌డీఎఫ్)తో పాటు తొలిసారిగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్‌ఏఎన్)కి చెందిన నౌకలు చేసిన విన్యాసాలు యుద్ధ వాతావరణాన్ని తలపించింది.
ముఖ్యంగా భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్ రణ్‌విజయ్, ఐఎన్‌ఎస్ శివాలిక్, ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ సుకన్యతో పాటు సింధురాజ్ సబ్‌మెరైన్లు సముద్ర జలాల్లో కలియ తిరుగుతూ అద్భుత ప్రదర్శన కనబర్చాయి.