నేటి నుంచి మలబార్‌–2020 ఎక్సర్‌సైజ్‌ | Malabar 2020 Exercise from November 3 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మలబార్‌–2020 ఎక్సర్‌సైజ్‌

Published Tue, Nov 3 2020 4:44 AM | Last Updated on Tue, Nov 3 2020 4:44 AM

Malabar 2020 Exercise from November 3 - Sakshi

2019లో జరిగిన మలబార్‌ ఎక్సర్‌సైజ్‌లు

దొండపర్తి (విశాఖ దక్షిణ): ఇండో–పసిఫిక్‌ సముద్ర ప్రాంతంలో సమన్వయాన్ని పెంపొందించడానికి భారత నావికాదళం తన సముద్ర మిత్ర దేశాలతో కలిసి మంగళవారం నుంచి జరిగే మలబార్‌–2020 ఉమ్మడి నావికాదళ వ్యాయామంలో పాల్గొననుంది. 2 దశల్లో జరగనున్న ఈ ఎక్సర్‌సైజ్‌లో యూఎస్‌ నేవీ (యూఎస్‌ఎన్‌), జపాన్‌ మారిటైమ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (జేఎంఎస్‌డీఎఫ్‌), రాయల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీ (ఆర్‌ఏఎన్‌)లతో కలిసి సంయుక్తంగా భారత నావికాదళం సముద్రంలో కసరత్తులు చేయనుంది. మలబార్‌–2020 మొదటి దశ ఈనెల 3 నుంచి 6 వరకు విశాఖ తీరంలో జరగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement