Wallstreet Journal
-
మస్క్‌పై మహిళా ఉద్యోగినుల సంచలన ఆరోపణలు
వాషింగ్టన్ డీసీ : స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ మరో వివాదంలో చిక్కుకున్నారు. స్పేక్స్ఎక్స్‌లో ఇద్దరు ఉద్యోగినులతో మస్క్ శృంగారంలో పాల్గొన్నారంటూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వారిలో ఒక ఉద్యోగిని స్పేస్ఎక్స్ ఇంటర్న్ అని తెలుస్తోంది. మరో ఉద్యోగిని పిల్లల్ని కనాలని బలవంతం చేసినట్లు సమాచారం.మస్క్‌పై ఈ తరహా ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. 2016లో శృంగరంలో పాల్గొనాలని, అందుకు బదులుగా గుర్రాన్ని కొనుగోలు చేయొచ్చని ఆఫర్ చేశారంటూ స్పేస్ఎక్స్ ఫ్లైట్ అటెండెంట్ ఆరోపించారు.2013లో స్పేస్ఎక్స్కు రాజీనామా చేసిన మరో మహిళను పిల్లల్ని కనాలని మస్క్ పలు సందర్భాల్లో కోరినట్లు సదరు మహిళ చెప్పారంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొన్నారు. స్పేస్ఎక్స్లో పని చేస్తున్న ఒక మహిళను మస్క్ రాత్రి పూట తన ఇంటికి రావాలని పదే పదే ఆహ్వానించినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఆ ఆరోపణలతో చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ఎలోన్ మస్క్ తన తీరుతో టెస్లా,స్పెస్ఎక్స్లో వాతావారణం పూర్తిగా దెబ్బతింటోందని ఉద్యోగులతో పాటు ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి తాజా, ఆరోపణలపై మస్క్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
చైనా విదేశాంగ మంత్రి అదృశ్యం.. హత్యా? ఆత్మహత్యా?
వాషింగ్టన్: ఒకప్పుడు అమెరికాలో చైనా రాయబారిగా పనిచేసి వెంటనే అత్యున్నత పదవి పొంది చైనా విదేశాంగ మంత్రిగా సేవలందించిన క్విన్ గాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయంపై అంతర్జాతీయ మీడియా కొత్త అంశాలను మోసుకొచి్చంది. చివరిసారిగా జూన్ నెలలో కనిపించిన ఆయన ప్రస్తుతం జీవించి లేరని మీడియాలో వార్తలొచ్చాయి. ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని పత్రికల్లో, చైనా ప్రభుత్వమే హింసించి చంపిందని మరి కొన్నింటిలో భిన్న కథనాలు వెలువడ్డాయి. ఈ ఏడాది జూన్‌లో చివరిసారిగా కనిపించి అప్పటి నుంచి కనిపించకుండా పోయిన క్విన్‌గాంగ్ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జూలై నెలలో బీజింగ్‌లోని మిలటరీ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారని చైనా ప్రభుత్వంలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు చెప్పినట్లు ‘పొలిటికో’ వార్తాసంస్థ ఒక కథనం వెలువరిచింది. క్విన్ అమెరికాలో చైనా రాయబారిగా కొనసాగిన కాలంలో ఆయన నెరిపిన ఒక వివాహేతర సంబంధమే ఈ అదృశ్యం ఘటనకు అసలు కారణమని గతంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఈ విషయంలో చైనా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తునకు ఆయన సహకరించారట. ‘‘అమెరికా పౌరసత్వమున్న చైనా అధికారిక ఫీనిక్స్ టీవీ మహిళా రిపోర్టర్ ఫ్యూ గ్జియోíÙయాన్‌తో వివాహేతర సంబంధం కారణంగా చైనా జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని జిన్‌పింగ్ సర్కార్ బలంగా నమ్మింది. ఆ మహిళ సరోగసీ పద్ధతిలో ఒక బిడ్డకు జన్మనిచి్చంది. ఇప్పుడా తల్లీబిడ్డల ఆచూకీ సైతం గల్లంతైంది. క్విన్‌గాంగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని జిన్‌పింగ్ వెంటనే ఆయనను జూన్‌లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మాజీ దౌత్యవేత్త వాంగ్ యీను పదవిలో కూర్చోబెట్టారు’’ అని ఆ కథనం పేర్కొంది. కేవలం ఆరునెలలు పదవిలో ఉన్న క్విన్‌గాంగ్ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. 2014–2018 కాలంలో దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌కు చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్‌గా పనిచేసి క్విన్ ఆయనకు అత్యంత ఆప్తుడయ్యాడు. అందుకే అత్యంత నమ్మకస్తులకు మాత్రమే దక్కే ‘అమెరికాలో చైనా రాయబారి’ పదవిని క్విన్‌కు జిన్‌పింగ్ కట్టబెట్టారు. వివాహేతర బంధమే క్విన్‌గాంగ్ మరణానికి కారణమన్న అంతర్జాతీయ మీడియా -
పాలకుల ‘ఫేస్’బుక్?
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎన్నికలు మాత్రం అంత ప్రజాస్వామ్య బద్ధంగా జరగడం లేదా? మన దేశ ఎన్నికల రాజకీయాలలో ఫేస్బుక్, ట్విట్టర్ల జోక్యం ఎక్కువగా ఉంటోందా? మీడియా ముసుగులో ఇలాంటి సోషల్ మీడియా దిగ్గజాలు మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయా? అవునంటున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన సాక్షాత్తూ పార్లమెంట్ వేదికగా బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆమె ప్రసంగం చిన్నదే కానీ, ఆరోపణలు తీవ్రమైనవి. ఆలోచించి తీరాల్సినవి. విద్వేష వ్యాఖ్యల వ్యవహారంలో అధికార పార్టీ నేతలకు మాత్రం అనుకూలించేలా ఫేస్బుక్ తన స్వీయ నియమాలను సైతం మార్చేస్తున్నట్టు ప్రసిద్ధ ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పరిశోధన గత ఏడాది బయటపెట్టింది. ఇక, రాజకీయ పార్టీల తరఫున పరోక్షంగా పనిచేస్తున్న వాణిజ్య ప్రకటనదారుల విషవ్యవస్థ ఫేస్బుక్లో ‘న్యూస్ మీడియా’గా చలామణీ అవుతున్న తీరును తాజాగా ‘అల్ జజీరా’, ‘రిపోర్టర్స్ కలెక్టివ్’లు బహిర్గతం చేశాయి. ఎన్నికల వేళ ఈ ‘ఫేక్’ బుక్ చర్యలు దేశ ఎన్నికల చట్టాలను అపహాస్యం చేస్తూ, ప్రభుత్వ వ్యతిరేక గళాలను పూర్తిగా తొక్కేస్తున్నాయి. తప్పుడు సమాచారంతో భావోద్వేగాలను రెచ్చగొట్టి, పిన్నపెద్దల మనసులను కలుషితం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే, బీజేపీకి తక్కువ ధరలకే ఫేస్బుక్ ఎన్నికల ప్రచార ప్రకటనల్ని అందించారనీ తెలుస్తోంది. అయితే, అధికార పక్షమే ప్రయోజనం పొందుతున్న వేళ, దీనికి అడ్డుకట్ట వేయాలని ఆ పార్టీ సారథ్య ప్రభుత్వాన్నే కోరాల్సి రావడం విరోధాభాస. సహజంగానే అధికార పక్షీయులు ఆ పాపంలో తమకు భాగం లేదంటున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్లు సమాచార ప్రచురణకర్తలా, లేక వట్టి వాహకాలేనా అన్నది ఇప్పటికీ తేలలేదన్న లా పాయింట్ లేవదీస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, ఈ ఆరోపణలను అడ్డం పెట్టుకొని, ఐటీ చట్టంలోని సెక్షన్ 66 (ఎ) ద్వారా భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని కాలరాయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోం దంటూ ప్రత్యారోపణలు చేస్తున్నారు. వాదోపవాదాలు పక్కనపెడితే – ఏ దేశంలోనైనా సరే పార్టీలు, నాయకులు, వారి నియుక్తులు ‘తాము చెప్పిందే వేదం, చూపిందే సత్యం’ అని భ్రమింపజేసేలా కథనాలను వండి వార్చడానికి సోషల్ మీడియాను వాడుతుండడం ఆందోళనకరం. ప్రజాపాలనకే ప్రమాదకరం. ప్రజాస్వామ్యాన్ని హ్యాక్ చేసి, తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి సోషల్ మీడియా వాడకం పెరుగుతోందనీ, దీనికి ప్రభుత్వం చరమగీతం పాడాలనీ సోనియా అన్నది అందుకే! సోనియా కన్నా తొమ్మిది నెలల ముందే – 2021 జూలైలోనే ఎన్నికలలో సోషల్ మీడియా దుర్వినియోగంపై సాక్షాత్తూ సుప్రీమ్ కోర్టు సైతం గళం విప్పడం గమనార్హం. సోషల్ మీడియాతో తిమ్మిని బమ్మిని చేస్తుండడంతో ఎన్నికలు, ఓటింగ్ ప్రక్రియలకే ముప్పు వచ్చి పడిందని సర్వోన్నత న్యాయస్థానం అప్పట్లోనే వ్యాఖ్యానించింది. ‘ఫేస్బుక్ వర్సెస్ ఢిల్లీ అసెంబ్లీ’ కేసులో తీర్పునిస్తూ, కోర్టు చేసిన ఆ వ్యాఖ్యకు ఒక రకంగా కొనసాగింపే ఇప్పుడు బయటపడ్డ సంగతులు, వినిపిస్తున్న ఆరోపణలు. నిజానికి, తమ వాదనను వినిపించలేని కోట్లాది మందికి ఫేస్బుక్ లాంటి వేదికలతో భావప్రకటనా స్వాతంత్య్రం వచ్చింది. ప్రధాన స్రవంతికి ప్రత్యామ్నాయ వేదికగా నాణేనికి రెండో కోణం చూపడానికి సోషల్ మీడియా ఉపయోగాన్నీ కొట్టిపారేయలేం. కానీ పదునైన ఈ కత్తిని దేనికి వాడుతున్నామన్నది కీలకం. జవాబుదారీతనం లేని అపరిమిత స్వేచ్ఛ పొంచి ఉన్న ప్రమాదం. ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో సైతం ఎన్నికల వేళ సోషల్ మీడియాలో వ్యవస్థీకృతంగా అనుచిత రాజకీయ జోక్యం సాగుతున్నట్టు తాజా అధ్యయనం. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫేస్బుక్లో మోదీ సారథ్యంలోని బీజేపీని ఆకాశానికి ఎత్తుతూ, ప్రతిపక్షాన్ని అవహేళన చేస్తూ అనేక ప్రకటనలొచ్చాయి. ఆ ప్రకటనలిచ్చిన ‘న్యూ ఎమర్జింగ్ వరల్డ్ ఆఫ్ జర్నలిజమ్ లిమిటెడ్’ సంస్థ సాక్షాత్తూ రిలయన్స్ వారి ‘జియో’ చెట్టు కొమ్మేనట. ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశోధించి ఆ సంగతి తేల్చింది. ఫేస్బుక్లో ఇలా రహస్య రాజకీయ వాణిజ్యప్రకటనలు కొత్త కాదు. 2019లో అధికార పార్టీతో బంధాన్ని నేరుగా ప్రకటించకుండా పలు ఫేస్బుక్ పేజీలు అధిక శాతం ప్రకటనలిచ్చినట్టు ‘ఆల్ట్ న్యూస్’ విశ్లేషణలోనూ వెల్లడైంది. గ్రామీణ ప్రజలే లక్ష్యంగా వార్తాకథనాల ముసుగులో ఇన్‌స్టా వీడియోలతో సాగుతున్న ముస్లిమ్ వ్యతిరేక ప్రచారం అపారమని ‘అల్‌జజీరా’ వెల్లడించింది. సానుకూలత కోసం పచ్చి అబద్ధాలను సైతం పవిత్రమైన నిజాలుగా, నిష్పూచీగా చలామణీలోకి తేవడంలో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, యూ ట్యూబ్, ఆఖరికి అందరం వాడుతున్న వాట్సప్లదీ ప్రధాన భూమిక. ‘వాట్సప్ యూనివర్సిటీ’ల్లో సమాచారం పేరిట ఫార్వర్డ్‌ల రూపంలో నిత్యం ప్రవహిస్తున్న అజ్ఞానానికి అంతం లేదు. డ్రైనేజీ స్కీము లేక డేంజర్‌గా మారి ప్రవహిస్తున్న ఈ అసత్యాల మురుగును అడ్డుకొనేదెలా అనేది ప్రశ్న. ఫేస్బుక్లో న్యూస్‌ఫీడ్ మాటున దాన్ని స్వలాభానికీ, ప్రత్యర్థులపై బురద జల్లడానికీ వాడుకోవడం రాజకీయ పార్టీల నైచ్యం. చివరకు ఈ ప్రపంచ సంస్థలు, వాటి ఆసరాతో పార్టీలు ఏ భావోద్వేగభరిత పోస్టులు, ఎవరికి, ఏ మోతాదులో చేరాలో నిర్ణయించే స్థాయికి రావడం ఏ దేశ ప్రజాస్వామ్యానికైనా ముప్పే! దీన్ని ఇకనైనా అడ్డు కోవాలి. ఎవరు అధికారంలో ఉన్నా, సామాజిక సామరస్యాన్ని కాపాడడం కీలకం. అది మర్చిపోతే అధికారం దక్కినా, సమాజం చీలిపోతుంది. పదునైన కత్తితో ఆటలాడితే, చేయి కోసుకుంటుంది! -
అమ్మాయిలతో ‘పులిహోర’.. బిల్‌గేట్స్‌కు గట్టి వార్నింగ్!
ఇదేం కొత్త ఆరోపణ కాదు. కాకపోతే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ‘చిలిపి చేష్టలు’ తమ దృష్టికి రావడంతో మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్ స్వయంగా ఆయన్ని మందలించారనే కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్ సోమవారం ఒక కథనం ప్రచురించింది. సదరు ఘటన 2008లో జరిగింది. ఓ మిడ్ లెవల్ ఉద్యోగితో పులిహోర కలుపుతూ ఆయన(బిల్ గేట్స్) పంపిన మెయిల్స్ వ్యవహారం మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్ దృష్టికి వచ్చింది. దీంతో జనరల్ కౌన్సెల్ బ్రాడ్ స్మిత్(మైక్రోసాఫ్ట్ ప్రస్తుత ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ ), మరికొందరు ఎగ్జిక్యూటివ్స్ కలిసి గేట్స్‌ను వ్యక్తిగతంగా సంప్రదించారు. అంతేకాదు ఇలాంటి వ్యవహారాలు ఆపితే మంచిదని ఆయన్ని సున్నితంగా మందలించారు కూడా!. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై బిల్‌గేట్స్ నీళ్లు నమలడం, ఉద్యోగిణికి కేవలం వెకిలి మెయిల్స్ మాత్రమే పంపడం, పైగా శారీరక సంబంధం దాకా యవ్వారం వెళ్లకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా మందలించి వదిలిపెట్టారని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆ కథనంలో పేర్కొంది. ఇక ఈ కథనంపై ఇటు మైక్రోసాఫ్ట్గానీ, అటు స్మిత్‌గానీ స్పందించేందుకు ఇష్టపడడం లేదు. గేట్స్ కార్యాలయం ఈ ఆరోపణలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పాత ఆరోపణలనే తిరగదోడుతున్నారని, దీనివెనుక వాళ్ల స్వలాభం ఉండొచ్చంటూ ఖండించింది. ఇదిలా ఉంటే 2019లో బిల్‌గేట్స్ తనతో చాలా ఏళ్లు శారీరక సంబంధం నడిపారంటూ ఓ ఇంజినీర్ రాసిన లేఖ కలకలం సృష్టించింది. ఈ లైంగిక ఆరోపణలపై న్యాయపరమైన విభాగంతో దర్యాప్తునకు ఆదేశించింది మైక్రోసాఫ్ట్. ఆ దర్యాప్తు గోప్యంగా కొనసాగుతుండగానే మైక్రోసాఫ్ట్ బోర్డ్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఎప్పుడైతే బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ విడాకులు ప్రకటించారో.. అప్పటి నుంచి వరుసబెట్టి ఆయనపై ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరకంగా బిల్‌గేట్స్ చిలకొట్టుడు వ్యవహారాలే మెలిండాతో 27 ఏళ్ల వైవాహిక బంధం ముగియడానికి కారణమనే వాదన సైతం తెర మీద వినిపిస్తుంటోంది. చదవండి: గేట్స్ దంపతులు విడిపోవడానికి కారణం ఎవరంటే.. క్లిక్ చేయండి: ‘బిల్‌గేట్స్ పచ్చి తాగుబోతు, యువతులతో నగ్నంగా స్విమ్మింగ్‌పూల్‌లో..’ -
యూజర్ల కోసం రూ. 95 వేల కోట్లను ఖర్చు చేసిన ఫేస్బుక్...!
ప్రముఖ టెక్ దిగ్గజం ఫేస్‌బుక్‌పై గత కొన్ని రోజుల క్రితం వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే..! వాల్ స్ట్రీట్జర్నల్ నివేదికను తప్పుబడుతూ ఫేస్బుక్ ఘాటుగా సమాధానమిస్తోంది. కొంత మంది వ్యక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఫేస్‌బుక్‌పై వాల్‌స్ట్రీట్ జర్నల్ చేసిన ఆరోపణలను కంపెనీ తిప్పికొట్టింది. ప్రతి యూజర్‌ను తమ దృష్టిలో ముఖ్యమైన వ్యక్తిగానే భావిస్తామని ఫేస్బుక్ పేర్కొంది. చదవండి: అదానీ, అవన్ని వదంతులేనా? ఆ టీవీని అమ్మడం లేదట! యూజర్ భద్రతను దృష్టిలో ఉంచుకొని 2016 నుంచి సుమారు 13 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 95, 830 కోట్లు) ఖర్చు చేసిందని ఫేస్బుక్ వెల్లడించింది. యూజర్ల సెక్యూరిటీ కోసం పని చేస్తోన్న ఉద్యోగుల సంఖ్య పదివేల నుంచి..40 వేల వరకు పెరిగిందని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి సుమారు 3 బిలియన్ల నకిలీ ఫేస్బుక్ ఖాతాలను తీసేసినట్లు తెలిపింది. కోవిడ్-19 సమయంలో ఫేక్ సమాచారాన్ని ఎక్కువగా సర్క్యూలేట్ అవ్వకుండా చూశామని ఫేస్బుక్ వెల్లడించింది. సుమారు 20 మిలియన్ల తప్పడు వార్తలను అరికట్టామని ఫేస్బుక్ తెలిపింది. ఇమేజ్-షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వేషపూరిత ప్రసంగాలను, ప్రమాణాలను ఉల్లంఘించిన కంటెంట్‌ను గతంలో కంటే15 రెట్లు ఎక్కువగా తొలగిస్తున్నామని పేర్కొంది. చదవండి: New York Times Report: వివాదాల నుంచి రిలాక్స్ అవ్వడానికే సర్ఫింగ్ చేస్తున్నారా!: -
ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారు: ఫేస్ బుక్
ప్రస్తుతం సోషల్ మీడియా నెట్టింట ఎంతలా ప్రభంజనం సృష్టిస్తోందో మనకు తెలియంది కాదు. అలాంటి సోషల్ మీడియాపై కొన్ని ఆరోపణలు, విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. వినియోగదారుల సమాచారం లీకవుతోందంటూ రకరకాలు విమర్శలు సర్వత్రా ఎదురైనప్పటికీ వాటిన్నంటిని అధిగమిస్తూ ఫేస్బుక్ తనదైన శైలిలో దూసుకుపోతుంది. కానీ, ఇప్పటికీ సంస్థపై రూమర్లు, తప్పుడు ప్రచారాలు ఆగడం లేదు. సరిగ్గా అలాంటి తప్పుడు ఆరోపణలతో ప్రముఖ ది వాల్‌స్ట్రీట్ జర్నల్ ఫేస్బుక్ పై కొన్ని కథనాలను ప్రచురించింది. ఫేస్బుక్ ఉద్యోగులు, యాజమాన్య సిబ్బంది వినయోగదారులకు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడంలో విఫలమైందని, ఒకవేళ గుర్తించినప్పటికీ దాన్ని అధిగమించిలే సరొకొత్త విధానాలు తీసుకురాలేకపోయిందంటూ... ఆరోపిస్తూ కథనాలను ప్రచురించింది. అలాగే ప్రముఖులకు ఫేస్బుక్ నుంచి మినహాయింపులు, ఇన్‌స్ట్రాగాం యాప్ వినియోగించే యువ వినియోగదారులపై ప్రతికూలభావాలను తగ్గించేలా అల్గారిథమ్ మార్పులు చేసిందని విమర్శించింది. అభివృద్ధి చెందిన దేశాలు మానవ అక్రమ రవాణకు ఫేస్బుక్ ఫ్లాట్ ఫాంని ఎలా వినయోగించుకుంటాయంటూ ఫేస్బుక్ ఉద్యోగులు ఎదురు ప్రశ్నిస్తున్నారంటూ.. రకరకాలుగా కథనాలు ప్రచురించింది. (చదవండి: ఆ విమానాలను పునరుద్ధరిస్తున్నాం: బైడెన్) ఈ క్రమంలో ఫేస్బుక్ గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లాగ్ మాట్లాడుతూ...."ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనాలు ఫేస్బుక్ లీడర్ షిప్, ఉద్యోగుల పట్ల తప్పుడు భావం కలిగేలా ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రచురించింది. అంతేకాదు ఉద్దేశపూర్వకంగానే ఈ ఆరోపణలు చేసిందంటూ తీవ్రంగా విరుచుకుపడింది. ఇవన్ని తప్పుడు ఆరోపణలు అంటూ కొట్టిపడేశారు. సంస్థకు ఇబ్బంది కలిగించే వాటిని విస్మరిస్తాం. కోవిడ్ వ్యాక్సిన్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా పోస్టులు చేస్తుందన్న విషయాన్ని గుర్తుచేశారు. పరిశోధన విభాగంలో సోషల్‌మీడియా కొత్త ఒరవడులు సృష్టిస్తున్నప్పటికీ అభివృద్ధి చెందుతున్న సమస్యలుగానే మిగిలుతున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: గిన్నిస్ బుక్‌లోకి వైట్ పెయింట్.. కరెంట్ సేవ్‌తో పాటు ఏసీలను మించే చల్లదనం!!) -
క్రిప్టో కరెన్సీ చరిత్రలో మరో సంచలనం
ప్రపంచ వ్యాప్తంగా దశాబ్ద కాలం నుంచి క్రిప్టోకరెన్సీకి సపోర్టర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. మొదట ఈ క్రిప్టోకరెన్సీపై చాలా అపోహలు ఉండటం వల్ల దీనిపై ఎక్కువ శాతం మొగ్గు చూపలేదు. అయితే తర్వాత దీనిపై ఉన్న అనుమానులు తొలిగిపోవడంతో క్రిప్టోకరెన్సీకి మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా బిట్ కాయిన్స్, డాగీ కాయిన్స్ లావాదేవీల కోసం వాడుతున్నారు. ఇంతకముందు బిట్ కాయిన్ సంచనాలను సృష్టిస్తే, ఇప్పుడు డాగీ కాయిన్ రికార్డు సృష్టిస్తుంది.(చదవండి: అమెరికా వెన్నులో వణుకు పుట్టించిన హ్యాకర్?) గత 2వారాల నుంచి డాగీ కాయిన్ విలువ రోజు రోజుకి పెరిగిపోతుంది. కొద్దీ గంటల్లోనే డాగీ కాయిన్ విలువ 5 రెట్లు పెరిగిందని పలు నివేదికలు నివేదిస్తున్నాయి. జనవరి 27 వరకు పైసా కంటే తక్కువ విలువ ఉన్న ఈ కాయిన్ ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయిందని తెలిపాయి. జనవరి 27 తర్వాత 500 శాతం పైగా దాని ధర పెరిగినట్లు కాయిన్‌బేస్ తెలిపింది. బిట్‌కాయిన్ మాదిరిగానే డాగ్కోయిన్ అనేది కూడా డిజిటల్ నాణెం. ఇది ప్రధానంగా ఇ-లావాదేవీల కోసం ఉపయోగించబడుతుంది.(చదవండి: మరోసారి మహిళను కాపాడిన యాపిల్ వాచ్!) It’s inevitable pic.twitter.com/eBKnQm6QyF — Elon Musk (@elonmusk) July 18, 2020 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బిల్లీ మార్కస్, జాక్సన్ పామర్ 2013లో దీనిని కనుగొన్నారు. క్రిప్టో కరెన్సీలో ఇది మరో రకం. బ్యాంకింగ్ ఫీజులు లేకుండా తక్షణ చెల్లింపులు చెల్లించేందుకు గాను ఓ వ్యవస్థను సృష్టించాలని ఈ టెక్కీలు అనుకున్నారు. అప్పటికి షిబా ఇను అనే శునకం ఎంతో పాపులర్ సంపాదించింది. అందుకే ఆ కుక్క లోగోను ఈ కాయిన్‌కు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా డాగీ కాయిన్ సృష్టించబడింది. మొదట్లో ఈ డాగీ కాయిన్ ను ఎవరు పట్టించుకోలేదు. అందరూ దీనిని ఒక జోక్ గా పరిగణించారు. అయితే కొద్దీ కాలంలోనే దీని విలువ పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ డాగీ కాయిన్ కు మంచి విలువ ఉంది. జనవరి 27 తర్వాత 24 గంటలలో భారీ లావాదేవీల కారణంగా డాగ్కోయిన్ 7 బిలియన్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్‌లో ఉంది. టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ గతంలో డాగ్కోయిన్ గురించి 2020 జులై 18న ట్వీట్ చేశాడు. -
ముదురుతున్న వివాదం : ఫేస్బుక్ కీలక అధికారిపై కేసు
రాయ్‌పూర్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ అధికార బీజేపీకీ వత్తాసు పలుకుతోందన్న వాల్‌స్ర్టీట్ జర్నల్ కథనంపై వివాదం మరింత ముదురుతోంది. తాజాగా ఫేస్బుక్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంకిదాస్, మరో ఇద్దరిపై ఛత్తీస్గడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆన్లైన్ ద్వారా తనకు హత్యా బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులకు అంకిదాస్ ఇచ్చిన ఫిర్యాదులో తివారీపై కేసు నమోదు చేసిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. (బీజేపీకి వత్తాసు : ఫేస్బుక్ క్లారిటీ) మతపరమైన మనోభావాలను దెబ్బతీసారని ఆరోపిస్తూ రాయ్‌పూర్‌కు చెందిన జర్నలిస్ట్ అవేష్ తివారీ ఫిర్యాదు మేరకు సోమవారం అర్థరాత్రి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫేస్బుక్ ఇండియా డైరెక్టర్, పబ్లిక్ పాలసీ హెడ్ అంకిదాస్తో పాటు, ముంగేలికి చెందిన రామ్ సాహు, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వివేక్ సిన్హా అనే ఫేస్బుక్ వినియోగదారులపై కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు తెలిపారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ఆధారంగా తాను పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ పై వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు, కాల్స్ వస్తున్నాయని తివారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మతపరమైన ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ద్వారా అంకిదాస్, సాహు, సిన్హా తనను పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, తన ప్రాణానికి ముప్పు ఉందని, తాను నిరంతరం భయంతో బతుకుతున్నానంటూ ఆరోపించారు. ఫేస్బుక్ ప్రతినిధి తనపై వేసిన ఆరోపణలను తివారీ ఖండించారు. ఫిర్యాదులో తన పేరుకు ఎందుకు పేరు పెట్టారో తనకు అర్థం కాలేదన్నారు. గతంలో ప్రభుత్వ విధానాలను విమర్శించిన తన పోస్టులను ఫేస్బుక్ ఏకపక్షంగా సెన్సార్ చేసిందని తివారీ ఆరోపించారు. 25 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్టుగా ప్రశ్నించడం తన కర్తవ్యమన్నారు. చదవండి : వాల్‌స్ర్టీట్ కథనం నేపథ్యంలో ఎఫ్బీ అధికారికి బెదిరింపులు -
భారత్ నుంచి అమెరికాకు పెరుగుతున్న వలసలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రజల వలసలే ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా అధ్యక్షపదవికి రిపబ్లికన్ల తరఫున పోటీచేస్తున్న డోనాల్డ్ ట్రంప్ ప్రచారమంతా ఈ సమస్య చుట్టే తిరుగుతోంది. పొరుగున్న మెక్సికో నుంచి పెరుగుతున్న వలసలను నియంత్రిస్తానని ఆయన చెబుతున్నారు. వాస్తవానికి మెక్సికో నుంచి వలసలు గతంతో పోలిస్తే బాగా తగ్గాయి. ఇప్పుడు అగ్రస్థానంలో భారత దేశమే ఉందని, మెక్సికో కనీసం రెండో స్థానంలో కూడా లేదని, చైనా తర్వాతనే మెక్సికో ఉందని 'వాల్‌స్ట్రీట్ జర్నల్' తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. 2012 నుంచి 2014 వరకు అందుబాటులో ఉన్న వలసల గణాంకాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఈ విశ్లేషణలు చేసింది. వలసల్లో అక్రమ వలసలు, చట్టబద్ధంగా వచ్చిన వలసలు ఉన్నాయి. ఇతర దేశాల సంతతికి చెందినవారిని కాకుండా ఇతర దేశాల్లో పుట్టి అమెరికాకు వచ్చి స్థిరపడిన వారినే వలసల గణాంకాల్లోకి తీసుకున్నారు. భారత్ నుంచి మెక్సికో కన్నా భారీగా వలసలు పెరిగాయంటే దానర్థం అమెరికాలో ప్రస్తుతం మెక్సికోలకన్నా భారతీయులు ఎక్కువగా ఉన్నారన్న అర్థం కాదు. మెక్సికోలో పుట్టి అమెరికాలో స్థిరపడినవారి సంఖ్య 1.10 కోట్లు కాగా, భారత్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడినవారి సంఖ్య 22 లక్షలు. ఇతర దేశాల్లో పుట్టి అమెరికాలో వచ్చి స్థిరపడిన మొత్తం వలస ప్రజల్లో మెక్సికన్ల సంఖ్య 27.9 శాతం కాగా, భారతీయుల సంఖ్య 5.2 శాతం. 2012 నుంచి అమెరికాకు వలసవచ్చే మెక్సికన్ల, చైనీయుల సంఖ్య బాగా పడిపోయినా, భారతీయుల సంఖ్య మాత్రం పెరగుతూనే వస్తోంది. మెక్సికోలో, చైనాలో ఉద్యోగావకాశాలు పెరగడమే అమెరికాకు ఆయా దేశాల నుంచి వలసలు తగ్గడానికి కారణమని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనర్లకు ఇప్పటికీ అమెరికాలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో భారతీయులు అమెరికాకు క్యూ కడుతున్నారు.