ప్రపంచ వ్యాప్తంగా దశాబ్ద కాలం నుంచి క్రిప్టోకరెన్సీకి సపోర్టర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. మొదట ఈ క్రిప్టోకరెన్సీపై చాలా అపోహలు ఉండటం వల్ల దీనిపై ఎక్కువ శాతం మొగ్గు చూపలేదు. అయితే తర్వాత దీనిపై ఉన్న అనుమానులు తొలిగిపోవడంతో క్రిప్టోకరెన్సీకి మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా బిట్ కాయిన్స్, డాగీ కాయిన్స్ లావాదేవీల కోసం వాడుతున్నారు. ఇంతకముందు బిట్ కాయిన్ సంచనాలను సృష్టిస్తే, ఇప్పుడు డాగీ కాయిన్ రికార్డు సృష్టిస్తుంది.(చదవండి: అమెరికా వెన్నులో వణుకు పుట్టించిన హ్యాకర్?)
గత 2వారాల నుంచి డాగీ కాయిన్ విలువ రోజు రోజుకి పెరిగిపోతుంది. కొద్దీ గంటల్లోనే డాగీ కాయిన్ విలువ 5 రెట్లు పెరిగిందని పలు నివేదికలు నివేదిస్తున్నాయి. జనవరి 27 వరకు పైసా కంటే తక్కువ విలువ ఉన్న ఈ కాయిన్ ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయిందని తెలిపాయి. జనవరి 27 తర్వాత 500 శాతం పైగా దాని ధర పెరిగినట్లు కాయిన్‌బేస్ తెలిపింది. బిట్‌కాయిన్ మాదిరిగానే డాగ్‌కోయిన్ అనేది కూడా డిజిటల్ నాణెం. ఇది ప్రధానంగా ఇ-లావాదేవీల కోసం ఉపయోగించబడుతుంది.(చదవండి: మరోసారి మహిళను కాపాడిన యాపిల్ వాచ్!)
It’s inevitable pic.twitter.com/eBKnQm6QyF
— Elon Musk (@elonmusk) July 18, 2020
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు బిల్లీ మార్కస్, జాక్సన్ పామర్ 2013లో దీనిని కనుగొన్నారు. క్రిప్టో కరెన్సీలో ఇది మరో రకం. బ్యాంకింగ్ ఫీజులు లేకుండా తక్షణ చెల్లింపులు చెల్లించేందుకు గాను ఓ వ్యవస్థను సృష్టించాలని ఈ టెక్కీలు అనుకున్నారు. అప్పటికి షిబా ఇను అనే శునకం ఎంతో పాపులర్ సంపాదించింది. అందుకే ఆ కుక్క లోగోను ఈ కాయిన్కు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా డాగీ కాయిన్ సృష్టించబడింది. మొదట్లో ఈ డాగీ కాయిన్ ను ఎవరు పట్టించుకోలేదు. అందరూ దీనిని ఒక జోక్ గా పరిగణించారు. అయితే కొద్దీ కాలంలోనే దీని విలువ పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ డాగీ కాయిన్ కు మంచి విలువ ఉంది. జనవరి 27 తర్వాత 24 గంటలలో భారీ లావాదేవీల కారణంగా డాగ్‌కోయిన్ 7 బిలియన్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్‌లో ఉంది. టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ గతంలో డాగ్‌కోయిన్ గురించి 2020 జులై 18న ట్వీట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment