సింగిల్‌గా ఉన్నవాళ్లను లింక్‌ చేసేస్తారు! | Rakul Preet Responds On Linkup Rumour With Rana? | Sakshi
Sakshi News home page

సింగిల్‌గా ఉన్నవాళ్లను లింక్‌ చేసేస్తారు!

Published Tue, Jan 30 2018 12:27 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

Rakul Preet Responds On Linkup Rumour With Rana? - Sakshi

రకుల్‌ ప్రీత్‌సింగ్‌

ప్లేస్‌ మారినా గాసిప్‌ మారేట్లు లేదు. ఒకచోట వేసిన రికార్డ్‌నే మరో చోట వేయాల్సి వస్తోంది. సినిమా రికార్డులతో ఆనందపడే సెలబ్రిటీలకు ఇలా.. గాసిప్పుల విషయంలో వేసిన రికార్డునే మళ్లీ మళ్లీ వేయడం చిరాకే. కానీ ఆ చిరాకుని బయటపెట్టకుండా చక్కగా సమాధానం చెప్పాలి. లేకపోతే ‘తెగ పోజు’ అని ట్యాగ్‌ వేసేస్తారు. ఇవన్నీ రకుల్‌ ప్రీత్‌సింగ్‌కి తెలియదా? ఏంటి. అందుకే హైదరాబాద్‌లో అడిగిన అదే ప్రశ్నను.. ముంబైలో అడిగితే.. ఇక్కడ చెప్పినట్లే నవ్వుతూ సమాధానం చెప్పారు. ‘రానాతో డేటింగ్‌ అట’ అన్నదే ఆ ప్రశ్న. ‘అలాంటిదేం లేదు’ అని ముంబై మీడియాతో అన్నారు రకుల్‌.

ఇంకా వివరంగా చెబుతూ –‘‘మా గ్రూప్‌లో మేం మొత్తం 15 నుంచి 20 మంది ఉంటాం. వాళ్లల్లో రానా కూడా ఉన్నారు. కానీ మా ఇద్దరి గురించి చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. రానా, నేను మంచి ఫ్రెండ్స్‌. నేను హైదరాబాద్‌లో ఉంటాను. అమ్మానాన్న ఢిల్లీలో ఉంటారు. ఇక్కడ నాకంతా ఫ్రెండ్సే. మేమంతా ఎప్పుడూ కలుస్తుంటాం. మా గ్రూప్‌లో ఇద్దరు ముగ్గురు మాత్రమే పెళ్లి కానివాళ్లు. దాంతో సింగిల్‌గా ఉన్న మాలాంటివాళ్లను లింక్‌ చేసి వార్తలు పుట్టిస్తారనుకుంటున్నా’’ అన్నారు రకుల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement