
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వివాదాన్ని సరైన రీతిలో పరిష్కరించలేని కేంద్ర ప్రభుత్వం తమపై కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. మనీల్యాండరింగ్ కేసులో తమ పార్టీ నేత అహ్మద్ పటేల్‌ను ప్రశ్నించిన ఘటన వేధింపు రాజకీయాలకు తాజా ఉదాహరణని ఆ పార్టీ పేర్కొంది. కేంద్రం చైనాను టార్గెట్ చేసేందుకు బదులు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని, తమ పార్టీ నేత అహ్మద్ పటేల్‌ను వేధింపులకు గురిచేయడం ఇందుకు తాజా ఉదంతమని ఆ పార్టీ నేత మనీష్ తివారీ ఆదివారం ట్వీట్ చేశారు. కాగా గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్‌పై మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అహ్మద్ పటేల్‌ను ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మనీష్ తివారీ మోదీ సర్కార్‌ను ఆక్షేపిస్తూ ట్వీట్ చేశారు.
ఈ కేసులో అహ్మద్ పటేల్‌తో పాటు ఆయన కుమారుడు ఫైజల్ పటేల్, అల్లుడు ఇర్ఫాన్ సిద్ధిఖిలను కూడా ఈడీ ప్రశ్నిస్తోంది. గల్వాన్ ఘటనపై ప్రజల దృష్టిని మరల్చేందుకే మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇక చైనా దళాల చేతిలో గల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్లు మరణించిన ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత భూభాగాన్ని చైనాకు దారాదత్తం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే విమర్శలు గుప్పించారు. చదవండి : ఇంధన ధరలతో కేంద్రం దగా
Comments
Please login to add a commentAdd a comment