న్యూఢిల్లీ: కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే అందులోని కీలకాంశాలు బయటకు పొక్కాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి మనీష్ తివారి తెలిపారు. ప్రభుత్వ వర్గాలే ఈ వివరాలను మీడియాకు లీక్ చేశాయని ఆయన ఆరోపించారు. వీటికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. ఇవే అంశాలు మధ్యంతర్ బడ్జెట్‌లో ఉన్నాయని వెల్లడించారు. బడ్జెట్‌ను ముందుగానే బయటకు లీక్ చేయడం చాలా సీరియస్ విషయమని, గోప్యత ఉల్లంఘనకు కిందకు వస్తుందని చెప్పారు.
మోసకారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దగా బడ్జెట్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ వర్ణించారు. గత నాలుగేళ్లలో వీటికి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లకు గాలం వేసేందుకే బడ్జెట్‌లో తాయిలాలు ప్రకటించారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని అన్నారు. (ఆ రెండు అంశాలు లేవు: చిదంబరం)
Comments
Please login to add a commentAdd a comment