న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఇతర బిల్లులను ఆమోదించడం సరైంది కాదని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ అభిప్రాయపడ్డారు. అవిశ్వాసంపై చర్చ, ఓటింగ్ జరిగి ఫలితం తేలిన తర్వాతే ఇతర బిల్లును ప్రవేశపెట్టడం లేదా ఆమోదించడం చేయాలని అన్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై లోక్‌సభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం దీనిపై 10 రోజుల్లోగా చర్చ, ఓటింగ్ నిర్వహించాల్సి ఉంది. బిల్లులను ఇష్టారాజ్యంగా ఆమోదింపజేసుకోవడానికి ఈ గడువును వాడుకోవద్దని మనీశ్ తివారీ హితవు పలికారు. అలా చేయడం పార్లమెంటరీ సంప్రదాయాలకు, నైతిక విలువలకు విరుద్ధమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment