భారత ప్రభుత్వ 2014 క్యాలెండర్ ఆవిష్కరణ | 2014 calender | Sakshi
Sakshi News home page

భారత ప్రభుత్వ 2014 క్యాలెండర్ ఆవిష్కరణ

Published Wed, Jan 1 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

2014 calender

న్యూఢిల్లీ: 2014 సంవత్సరానికి సంబంధించిన భారత ప్రభుత్వ క్యాలెండర్‌ను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి మనీష్ తివారీ మంగళవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఎన్నికల సంవత్సరం నేపథ్యంలో.. యూపీఏ ప్రభుత్వం అమలు చేసిన భారత్ నిర్మాణ్, ఇతర ప్రతిష్టాత్మక పథకాలను తెలియజేస్తూ ఈ క్యాలెండర్‌ను రూపొందించడం గమనార్హం. ‘భారత్ నిర్మాణ్-సబ్ కా హిత్, సబ్‌కా హక్’ అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని కేంద్ర సమాచార, ప్రసార శాఖకు చెందిన డెరైక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ) దీనిని రూపొందించింది. ఈ కార్యక్రమంలో సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి బిమల్ జుల్కా, ప్రధానమంత్రి కమ్యూనికేషన్ల సలహాదారు పంకజ్ పచౌరి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement