ముంబై: ఆదర్శ్ కుంభకోణంకు సంబంధించిన దర్యాప్తును వేగవంతం చేయాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఆదర్శ్ కేసులో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ విచారించిన సీబీఐ తర్వాత అసలు నిందితుల పేర్లను బయటకు వెల్లడించకపోవడాన్ని ఠాక్రే తప్పుబట్టారు. ఈ కేసు విచారణ సవ్యమైనదిశలో సాగడం లేదని ఆయన పేర్కొన్నారు. కొంతమంది పెద్దలు నేరాలకు పాల్పడిన అనంతరం వారికి వారే క్లీన్ చిట్ పొందడం పరిపాటిగా మారిందన్నారు.
ఆదర్శ్ స్కాం దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ ఘటనలో అభియోగాలు మోపడ్డ వారి పేర్లను దాచడాన్నిఠాక్రే ప్రశ్నించారు. కాగా, అశోక్ చవాన్ ఆదర్శ్ కుంభకోణానికి పాల్పడ్డారని తాను వ్యాఖ్యానించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.