'ఆ వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నా' | Prithviraj Chavan expresses regret over remarks on Adarsh | Sakshi
Sakshi News home page

'ఆ వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నా'

Published Thu, Oct 16 2014 8:43 PM | Last Updated on Fri, Jul 26 2019 5:53 PM

'ఆ వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నా' - Sakshi

'ఆ వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నా'

పుణే: తన కంటే ముందు పనిచేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఆదర్శ్‌ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై తాను చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర తాజా మాజీ సీఎం పృథ్విరాజ్ చవాన్ విచారం వ్యక్తం చేశారు. తాను కావాలని ఈ వ్యాఖ్యలు చేయలేదని, ఏమరుపాటుగా జరిగిన పొరబాటని ఆయన వివరణయిచ్చారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పతనమైతే... ఆదర్శ్ కేసులో మాజీ ముఖ్యమంత్రులు విలాస్ రావ్ దేశ్ముఖ్, సుశీల్ కుమార్ షిండే, అశోక్ చవాన్ లపై చర్యలు తీసుకుంటానని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ పేర్కొన్నారు. జరిగిన తప్పిదానికి చింతిస్తున్నానని ఆయన తెలిపారు. తన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని కూడా ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement