అందరూ చూస్తుండగా అమ్మాయిపై ఘోరం
అందరూ చూస్తుండగా అమ్మాయిపై ఘోరం
Published Thu, Feb 2 2017 8:08 AM | Last Updated on Fri, Jul 26 2019 5:53 PM
కేరళలోని కొట్టాయంలో ఘోరం జరిగింది. 20 ఏళ్ల వైద్య విద్యార్థినిపై క్లాసులో అందరూ చూస్తుండగానే ఓ అబ్బాయి పెట్రోలు పోసి తగలబెట్టేశాడు. ఆ తర్వాత తాను కూడా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అమ్మాయిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు విద్యార్థులకు కూడా కొద్దిగా కాలిన గాయాలై ఆస్పత్రిలో చేరారు. ఎస్ఎంఇ మెడికల్ కాలేజిలో సమ్మె జరుగుతున్నా కొంతమంది విద్యార్థులు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఆదర్శ్ అనే యువకుడు అదే కాలేజి మాజీ విద్యార్థి. బుధవారం మధ్యాహ్నం అతడు క్లాసులోకి నడుచుకుంటూ వచ్చి ఆ అమ్మాయిపై పెట్రోలు పోసి నిప్పంటించేశాడు. తర్వాత తాను కూడా నిప్పంటించుకున్నాడు. ఆ అమ్మాయి బయటకు పరుగులు తీస్తుండగా వెంటపడి పట్టుకుని మరీ తన వద్ద ఉన్న లైటర్‌తో ఆమె దుస్తులకు నిప్పంటించినట్లు విద్యార్థులు చెప్పారు. తర్వాత అతడు తన దుస్తులకు కూడా అదే లైటర్‌తో నిప్పంటించుకున్నాడన్నారు. కొట్టాయంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో భాగంగానే స్కూల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఎస్ఎంఇ) ఉంది.
Advertisement
Advertisement