ముంబై: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో నిందితుడైన మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్‌ను విచారించేందుకు గవర్నర్ విద్యాసాగర్‌రావు సీబీఐకి అనుమతిచ్చారు. విచారణ విషయమై రాష్ట్ర కేబినెట్ గవర్నర్‌కు తమ అభిప్రాయం తెలిపిన తర్వాత గురువారం గవర్నర్ నుంచి సీబీఐకి అనుమతి లభించింది.
కేసుకు సంబంధించి చవాన్‌కు వ్యతిరేకంగా ఆధారాలు లభించాయని, ఆయన్ను విచారించేందుకు అనుమతివ్వాలని కోరుతూ 2015, అక్టోబర్ 8న గవర్నర్‌కు సీబీఐ లేఖ రాసింది. ఈ విషయమై ప్రభుత్వ అభిప్రాయాన్ని గవర్నర్ కోరగా విచారణ కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్.. గవర్నర్‌కు తెలిపింది.