అశోక్ చవాన్ పేరు తొలగించవద్దన్న కోర్టు | CBI plea for dropping Chavan's name in Adarsh scam rejected | Sakshi
Sakshi News home page

అశోక్ చవాన్ పేరు తొలగించవద్దన్న కోర్టు

Published Sat, Jan 18 2014 3:48 PM | Last Updated on Fri, Jul 26 2019 5:53 PM

అశోక్ చవాన్ పేరు తొలగించవద్దన్న కోర్టు - Sakshi

అశోక్ చవాన్ పేరు తొలగించవద్దన్న కోర్టు

ముంబై: ఆదర్శ్‌ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో నిందితుల జాబితా నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ పేరును తొలగించాలన్న సీబీఐ అభ్యర్థనను సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన చార్జిషీట్లో పేర్కొన్న 13 మంది నిందితుల పేర్ల నుంచి అశోక్ చవాన్ పేరును తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 15న సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది.

అమర జవాన్ల కుటుంబాల కోసం ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ 31 అంతస్తుల భవన సముదాయం  నిర్మించింది. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈ భవనంలో తన బంధువులకు ఫ్లాట్లు ఇప్పించడంతో ఈ కేసులో ఇరుక్కున్నారు. 2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో సిబిఐ ఈ కుంభకోణంలో నిందితుడిగా చవాన్ను పేర్కొంది.   

ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన జ్యుడీషియల్ కమిటీ హౌసింగ్ సొసైటీ ఇళ్ల కేటాయింపుల్లో అశోక్ చవాన్, ఈ కేటాయింపుల ద్వారా లబ్ధి పొందిన ఆయన సమీప బంధువులు కుమ్మక్కుకు పాల్పడ్డారని తేల్చి చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement