ఆదర్శ్ సొసైటీని స్వాధీనం చేసుకోండి: సుప్రీం | Supreme Court asks Centre to take over Adarsh Society building in Mumbai | Sakshi
Sakshi News home page

ఆదర్శ్ సొసైటీని స్వాధీనం చేసుకోండి: సుప్రీం

Published Fri, Jul 22 2016 2:49 PM | Last Updated on Fri, Jul 26 2019 5:53 PM

Supreme Court asks Centre to take over Adarsh Society building in Mumbai

న్యూఢిల్లీ:   ఆదర్శ్ సొసైటీ పేరుతో మహారాష్ట్ర ప్రభుత్వం  నిర్మించిన  31 అంతస్తుల భవంతిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. బిల్డింగ్ ను కూల్చకుండా కాపాడుతామని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ కోర్టుకు తెలిపారు. ఈ ప్రక్రియను ముంబై హైకోర్టు రిజష్టర్  జనరల్ పర్యవేక్షిస్తారని కోర్టు పేర్కొంది. 

2016,ఏప్రిల్ 26 వ తేదీన ఆదర్శ్ హౌసింస్ సొసైటీ భవంతిని  కూల్చేయాల్సిందిగా బాంబే హైకోర్టు  సంచలన తీర్పు వెలువరించింది. కార్గిల్‌ యుద్ధంలో అమరులైన జవాన్ల కుటుంబాలకు కేటాయించిన స్థలంలో అక్రమంగా ఈ నిర్మాణం చేపట్టారని న్యాయస్థానం పేర్కొంది. ఈ భవనంలో అమరవీరుల కుటుంబాలకు కాకుండా రాజకీయ నేతలు, వారి బంధువులకు ప్లాట్లు కేటాయించారని స్పష్టం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement