రేగోడ్, న్యూస్‌లైన్: వీఆర్‌ఓ ఫలితా ల్లో జిల్లా టాపర్‌గా నిలిచిన ఆదర్శ్ లక్ష్యం చేరుకునే యువతకు ఆదర్శం గా నిలిచాడు. విద్యకు పేద, ధనిక తేడా లేదని చాటాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివినా పైకి రావచ్చని నిరూపించాడు. రేగోడ్‌తు బిజిలిపురం వీరప్పకు ముగ్గురు కుమారులు, వీరిలో మొదటి కుమారుడు ఆదర్శ్. ఇతను రేగోడ్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకు చదివాడు. పదిలో 548 మార్కులు సాధించి మం డలంలో రెండోస్థానంలో నిలిచాడు. మియాపూర్‌లోని ఎంఎన్‌ఆర్ విద్యాల యంలో ఇంటర్ చదివి 975 మార్కు లు సాధించాడు. ఆ తర్వాతఎంసెట్ రాసి పులివెందులలోని జేఎన్‌టీయూ లో ఇంజనీరింగ్(సీఎస్‌సీ) పూర్తి చేశా డు.
ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే వీఆర్‌ఓ పరీక్ష రాసి 100కు 98 మార్లు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాడు. ఆదర్శ్ తమ్ముడు శ్రీకాంత్ బీటెక్ చదువుతున్నాడు. మరో తమ్ముడు వంశీ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.