నాందేడ్, న్యూస్‌లైన్: నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం బరి నుంచి సిట్టింగ్ ఎంపి భాస్కరరావ్ ఖతగావ్కర్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన స్వయంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై ఎవరి ఒత్తిడీ లేదన్నారు. తానే స్వయంగా పోటీ నుంచి త ప్పుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంత బలహీనంగా ఉందన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ల నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.
కాగా మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్ నాందేడ్‌పై తన పట్టును నిలుపుకుని మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అశోక్ ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ తనకు టికెట్ రానట్టయితే కనీసం భార్య అనితకైనా దక్కేవిధంగా చేసేందుకు యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ కోసం రేసులో ప్రధాన పోటీదారుగా భావిస్తున్న భాస్కరరావ్ ఖతగావ్కర్ తప్పుకోవడం చవాన్‌కు కొంత ఊరట కలిగించే విషయం.
‘పోటీనుంచి నేనే తప్పుకున్నా’
Published Fri, Mar 21 2014 10:48 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement