ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో చేరితే బీజేపీ ఆయనకు రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ చవాన్‌కు రాజ్యసభ సీటిస్తే బీజేపీ సైనికులను అవమానపరిచినట్లేనన్నారు. గతంలో ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ కుంభకోణంలో చవాన్‌పై ఆరోపణలు వచ్చినపుడు ప్రధాని మోదీ, ప్రస్తుత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సైనికులను చవాన్ అవమానపరిచారని చేసిన విమర్శలను ఉద్ధవ్ థాక్రే గుర్తు చేశారు.
భారతరత్న అవార్డులపైనా థాక్రే స్పందించారు. బీజేపీ భారతరత్న దుకాణం పెట్టిందని, ఓట్ల కోసం పలు వర్గాలకు చెందిన వారికి ఆ పురస్కారం ఇస్తోందని విమర్శించారు. స్వామినాథన్కకు భారతరత్న ఇస్తే సరిపోదని వ్యవసాయ రంగంలో ఆయన చేసిన సిఫారసులను అమలు చేయాలని కేంద్రానికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment