బీజేపీలో చేరిన అశోక్‌ చవాన్‌ | Ashok Chavan Joins Bjp Fadnavis Welcomes | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన అశోక్‌ చవాన్‌.. స్వాగతించిన ఫడ్నవిస్‌

Published Tue, Feb 13 2024 1:35 PM | Last Updated on Tue, Feb 13 2024 2:24 PM

Ashok Chavan Joins Bjp Fadnavis Welcomes - Sakshi

ముంబై: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్‌ బీజేపీలో చేరారు. ముంబైలో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సమక్షంలో మంగళవారం ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చవాన్‌ను ఫడ్నవిస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. 

అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మరుసటి రోజే బీజేపీలో చేరిన చవాన్‌ను కాషాయ పార్టీ రాజ్యసభకు నామినేట్‌ చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు ఈ నెల 15 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.  

ఇదీ చదవండి.. ఎన్సీపీ నాదే.. సుప్రీంకోర్టుకు శరద్‌పవార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement