అశోక్ చవాన్ కు ఊరట | Delhi HC stays EC show cause notice to Ashok Chavan | Sakshi
Sakshi News home page

అశోక్ చవాన్ కు ఊరట

Published Mon, Jul 28 2014 12:38 PM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM

అశోక్ చవాన్ కు ఊరట

అశోక్ చవాన్ కు ఊరట

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు ఊరట లభించింది. ఎన్నికల సంఘం(ఈసీ) ఆయనకు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. బీజేపీ నాయకులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కిరిట్ సోమయ్యలతో పాటు మరో స్వతంత్ర సభ్యుడికి కోర్టు నోటీసులు జారీ చేసింది. చవాన్ వ్యతిరేకంగా ఎన్నికల సంఘానికి వీరు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
 

ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలకు అనుగుణంగా తన ఎన్నికల ప్రచార వ్యయం వివరాలను ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొంటూ ఎన్నికల సంఘం జూలై 13న చవాన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. జవాబిచ్చేందుకు 20 రోజుల గడువిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement