mukhtar abbas naqvi
-
ఈ ఎన్నికల యుద్ధంలో మోదీదే విజయం
సాక్షి, కోల్‌కతా : రాబోయే లోక్‌సభ ఎన్నికలకు, మహాభారతానికి మధ్య పోలికలు ఉన్నాయని బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఎన్నికలు మంచి - చెడు, ధర్మం - అన్యాయం మధ్య జరిగే యుద్ధం అంటూ పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాజీ కేంద్ర మంత్రి మాట్లాడారు. దేశ భద్రత, శ్రేయస్సు, అందరి సాధికారత కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ యుద్ధంలో విజయం సాధిస్తారని పునరుద్ఘాటించారు. మోదీ పాండవుల మాదిరిగానే న్యాయం, నైతికత, ధర్మం కోసం పాటుపడుతుంటే ..ప్రతిపక్ష పార్టీల నేతలను ఉద్దేశిస్తూ కౌరవులు దేశ ప్రపంచ కీర్తిని మసకబారడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రగతి పథంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి ప్రధాని మోదీ దేశ దైవత్వాన్ని, గౌరవాన్ని కాపాడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఎంసీలపై విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు ఎప్పటికీ ప్రజాస్వామ్య వైభవాన్ని హైజాక్ చేయలేవని తెలిపారు. మైనార్టీలు బీజేపీ వెంటే ఉన్నారని, అభివృద్ధి విషయంలో ప్రధాని మోడీ తమ పట్ల వివక్ష చూపనప్పుడు, బీజేపీకి ఎందుకు ఓటు వేయకూడదో ఒక్కసారి ఆలోచించాలని మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కోరారు. -
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎంపీగా గురువారం ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. ఈ నిర్ణయం వెనుక ఉపరాష్ట్రపతి రేసులో ఆయన నిల్చునే అవకాశాలు ఉన్నట్లు చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. చివరిసారిగా బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో నఖ్వీ పాల్గొనగా.. మంత్రిగా నఖ్వీ సేవలను ప్రశంసించారు ప్రధాని మోదీ. కేబినెట్ భేటీ అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంకు వెళ్లిన నఖ్వీ.. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. మైనార్టీ నేతగా నఖ్వీకి ప్రాధాన్యం ఇస్తూ.. ఆయన ఉపరాష్ట్రపతి రేసులో నిలపాలని బీజేపీ యోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. రాజ్యసభ వ్యవహారాలపై నఖ్వీకి మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరు తెర మీదకు వచ్చింది. అయితే బీజేపీ తరపున దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కేంద్ర మంత్రి, సీనియర్లకు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ
సీనియర్ నేతలు, కేంద్ర మంత్రి, మాజీ మంత్రులకు బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. తాజాగా బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడదల చేసిన విషయం తెలిసిందే. 18 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్‌కు అవకాశం కల్పించారు. ఇక, జూన్ 10న మొత్తం 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా.. బీజేపీ కొంత మంది సీనియర్లుకు షాక్ ఇచ్చింది. జార్ఖండ్ ప్రతినిధిగా రాజ్యసభలో ఉన్న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. వీరితో పాటు ఓపీ మాథుర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, వినయ్ సహస్త్రబుద్ధే వంటి సీనియర్లకు రాజ్యసభ సీటు ఇవ్వలేదు. ఇక, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోసం గోరఖ్‌పూర్ సీటును వదులుకున్న రాధా మోహన్ అగర్వాల్‌ను రాజ్యసభకు ఎంపికయ్యారు. బీజేపీ అభ్యర్థులు వీరే: నిర్మల సీతారామన్, జగ్గేశ్- కర్ణాటక పీయూష్, అనిల్ సుఖ్‌దేవ్-మహారాష్ట్ర సతీష్ చంద్ర, శంభు శరణ్-బిహార్ కృష్ణలాల్-హర్యానా కవితా పటిదార్-మధ్య ప్రదేశ్ గణశ్యామ్-రాజస్థాన్ లక్ష్మికాంత్ వాజ్‌పేయి, రాధామోహన్, సురేంద్రసింగ్, బాబురామ్, దర్శణ సింగ్, సింగీత యాదవ్, లక్ష్మణ్- ఉత్తరప్రదేశ్ కల్పన సైని- ఉత్తరాఖండ్. ఇది కూడా చదవండి: యూపీ నుంచి నామినేషన్ వేయనున్న బీజేపీ నేత -
రాజ్యసభ ఉపనాయకుడిగా ముఖ్తర్ అబ్బాస్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నఖ్వి (63)ని రాజ్యసభలో ఉపనాయకుడిగా నియమించాల్సిందిగా ప్రధాని మోదీ తనకు సూచించారంటూ సభా నాయకుడు పియూశ్ గోయల్ సోమవారం చెప్పారు. ప్రధాని సూచన మేరకు ఆయన్ను ఉపనాయకుడిగా నియమించినట్లు చెప్పారు. రాజ్యసభలో బీజేపీకి బలం లేని నేపథ్యంలో రాజకీయ సమస్యలను పరిష్కరించేందుకు పియూశ్ గోయల్‌ను నాయకుడిగా, నఖ్విని ఉపనాయకుడిగా బీజేపీ నియమించింది. బీజేపీ కేంద్ర మంత్రుల్లో సైతం నఖ్వి ఒక్కరే ముస్లిం వర్గానికి చెందిన ఒకే ఒక వ్యక్తి కావడం గమనార్హం. ఆయన మోదీ మొదటి దఫా ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా కూడా పని చేశారు. ఏబీ వాజ్‌పేయీ హయాంలో సైతం నఖ్వి మంత్రిగా పని చేశారు. -
‘50 ఏళ్ల పప్పును ప్లేస్కూల్‌కు పంపాలి’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అసలు పేరు ‘సరెండర్ మోదీ’ అని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖా మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం, రాజకీయ పరిజ్ఞానం లేని 50 ఏళ్ల పప్పును పొలిటికల్ ప్లేస్కూల్‌కు పంపాలని ఎద్దేవా చేశారు. అప్పుడైనా దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుస్తుందని విమర్శించారు. కాగా గల్వన్ లోయ ప్రాంతంలో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో..‘చైనాతో భారత్ బుజ్జగింపు విధానం బట్టబయలు’ అనే శీర్షికతో ఉన్న విదేశీ పత్రిక కథనాన్ని రాహుల్ గాంధీ ఆదివారం ట్విటర్లో షేర్ చేశారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని.. అందుకే మోదీ అసలు పేరు ‘సరెండర్ మోదీ’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. (‘చైనా దురాక్రమణకు అవే సాక్ష్యం’) ఈ విషయంపై స్పందించిన అబ్బాస్ నఖ్వీ సోమవారం ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘50 ఏళ్ల పప్పును వాళ్ల కుటుంబం ఇప్పటికైనా పొలిటికల్ ప్లేస్కూల్‌కు పంపించాలి. అప్పుడే ఆయన ఫ్వూడలిస్టు విధానాలు, అసంబద్ధమైన భాషకు కళ్లెం పడుతుంది. ఆయనకు అసలు దేశ సంస్కృతి, సంప్రదాయాలు అర్థంకావు. నిరాధారమైన కథనాలు, వదంతులను నమ్ముతూ రాజకీయం చేయాలని చూస్తున్నారు. దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ, నాయకత్వం గురించి విచిత్ర ప్రశ్నలు వేస్తారు. తద్వారా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటారు. రోజంతా ప్రధాన మంత్రిని నిందిస్తూనే ఉంటారు. ఆయన ఉపయోగించే యాస, భాష దేశ రాజకీయాల్లో ఎక్కడా కనిపించదు. ఇప్పటికైనా తన భాషను సరిచేసుకోవాలి’’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక సరిహద్దు వివాదం విషయంలో కాంగ్రెస్ పార్టీ అసంబద్ధ వ్యాఖ్యానాలు చేస్తోందని.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉందని పునరుద్ఘాటించారు. కాగా ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో ఇంగ్లిష్ పదం సరెండర్ స్పెల్లింగ్‌ను surrenderకు బదులు surender అని రాహుల్ గాంధీ పేర్కొనడం గమనార్హం.( ప్రధాని వ్యాఖ్యలకు వక్రభాష్యాలు.. పీఎంవో స్పష్టత!) -
ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేయాలి..
ఢిల్లీ : రంజాన్ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పేర్కొన్నారు. నఖ్వీ గురువారం అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. రంజాన్ మాస సమయంలో ముస్లిం సోదరులంతా ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేయాలని కోరారు. ఏడు లక్షల మసీదులు, ధార్మిక సంస్థల నేతలతో కలిసి పని చేయాలని వక్ఫ్ బోర్డులను ఆదేశించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా భారత్ సహా ప్రపంచమంతా కరోనా బారినుంచి విముక్తి పొందేలా ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. దయచేసి కరోనా బాధితుల కోసం పోరాటం చేస్తున్న హెల్త్ వర్కర్స్, డాక్టర్లు, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దన్నారు. నిజాయితీగా వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించేలా వక్ఫ్ బోర్డులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని నఖ్వీ తెలిపారు. (కరోనా నియంత్రణకు రెండు వ్యూహాలు) -
సీఏఏపై వెనక్కి తగ్గం
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పష్టంచేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన చట్టం దేశమంతటా వర్తిస్తుందని, భారత్‌లో అంతర్భాగమైన రాష్ట్రాలన్నీ ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ‘హునర్ హాట్’ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నక్వీ మీడియాతో మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరి పౌరసత్వం కోల్పోయే పరిస్థితి ఉండదని, అయినా ఈ చట్టంపై విపక్షాలు అనవసరంగా తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయన్నా రు. దేశంలోని ముస్లింలకు ఈ చట్టం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవని, అన్ని మతాల ప్రజలకు భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. వాళ్లు సుపారీ గ్యాంగ్స్టర్లు... సీఏఏపై ప్రజలను తప్పుదోవ పటిస్తున్న గ్యాంగ్స్టర్లలో పోటీ నెలకొందని, వాళ్లు సుపారీ తీసుకొని హారర్ షో.. హారర్ హంగామా సృష్టిస్తున్నారని నక్వీ దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టం కొత్తదేమీ కాదని, గతంలోనూ ఈ చట్టానికి సవరణలు జరిగాయని గుర్తుచేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై అన్ని పార్టీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక కూడా సమర్పించిందని, కానీ 2019లో 16వ లోక్‌సభ కాలపరిమితి ముగియడంతో సీఏఏ బిల్లు ఆమోదం పెండింగ్‌లో పడిందని గుర్తుచేశారు. పార్లమెంటులో సీఏఏకు మద్దతిచ్చిన పార్టీలు కూడా ఈరోజు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని నక్వీ విమర్శించారు. జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) కార్యక్రమాలు అస్సాంలో తప్ప మరెక్కడా అమలు కావడం లేదన్నారు. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) నమోదు ప్రతి పదేళ్లకు ఒకసారి జరుగుతుందని, ఈ విషయంలో రాజకీయ నేతల ఉచ్చులో పడొద్దని ప్రజలకు నక్వీ పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. -
'పాకిస్తాన్ వెళ్లమంటారా అంటూ కేంద్రమంత్రి సీరియస్'
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ముస్లింలను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ చేసిన వివాదాస్పద కామెంట్లను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఖండించారు. సంబంధిత పోలీసు అధికారి గనుక వీడియోలో కనిపించినట్లు నిజంగానే ముస్లింలను పాకిస్తాన్ వెళ్లిపోవాలన్న అనుచిత వ్యాఖ్యలు చేసుంటే కచ్చితంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పెద్ద దేశ వ్యాప్తంగా ఎత్తున ఉద్యమాలు జుగుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లోనైతే వేరే చెప్పనక్కర్లేదు. ఈ నిరసనలు హింసాత్మకమవుతూ పలువురు ప్రాణాలు కోల్పోయారు. చదవండి: వాళ్లను పాకిస్తాన్ వెళ్లిపొమ్మని చెప్పండి : మీరట్ ఎస్పీ కాగా.. మీరట్ ఎస్పీ గో బ్యాక్ టు పాకిస్తాన్ వీడియో వైరల్ కావడం, దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మైనార్టీల మంత్రిగా నఖ్వీ స్పందించారు. అల్లరిమూకలు కావొచ్చు లేదా పోలీసులే కావచ్చు.. తప్పుచేసిన వాళ్లెవరినీ వదిలిపెట్టొద్దు. మీరట్ ఎస్పీ కామెంట్లు ముమ్మాటికీ వివాదాస్పదమైనవే. సాక్ష్యాధారాలు పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకోవాలి'' అని మంత్రి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి స్థానం లేదని ఆయన పేర్కొన్నారు. కాగా గతంలో, పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ మీరట్‌లోని లిసారీ గేటు దగ్గర సీఏఏ నిరసనలు చేస్తున్న ముస్లింలను ఉద్దేశించి ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే పాకిస్తాన్ వెళ్లిపోండి ఇక్కడి తిండి తింటూ, పక్కదేశాన్ని పొగడటానికి సిగ్గులేదా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. Check this out SP city Meerut UP sending people to Pakistan trying to understand he is really a public servant @ReallySwara @RanaAyyub @anuragkashyap72 @anubhavsinha @navinjournalist @umashankarsingh #CAA_NRCProtests #CAAAgainstConstitution @farah17khan pic.twitter.com/QWvGIcf5n6 — jugnu khan (@thejugnukhan) December 26, 2019 -
‘ఒవైసీ వ్యాఖ్యలు పట్టించుకోవద్దు’
ఢిల్లీ: అయోధ్య–బాబ్రీ మసీదు భూవివాదంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నఖ్వి ఘాటుగా స్పందించారు. ఒవైసీ వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోవద్దని అన్నారు. కొంతమంది వ్యక్తులకు ఎలాంటి అంశం మీదైనా వ్యతిరేకరంగా మాట్లాడటం అలవాటుగా మారిందని విమర్శించారు. సుప్రీం తీర్పుపై ఒవైసీ మాటలను పరిగణలోకి తీసుకోకుడదని అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ని వర్గాల వారు ఈ తీర్పును స్వాగతించారని గుర్తుచేశారు. సుప్రీం తీర్పుపై దేశ ప్రజలు సహనంతో చూపిన శాంతి, సోదరభావాన్ని ఎవరు చెరపలేరని పేర్కొన్నారు. సున్నితమైన ఈ కేసు తీర్పును దేశప్రజలు స్వాగతించారని తెలిపారు. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయకూడదన్న సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని నఖ్వీ అభినందించారు. సుప్రీంకోర్టు అయోధ్య భూవివాదంపై ఇచ్చిన తీర్పుపై ఒవైసీ స్పందిస్తూ.. తీర్పు తనకు అసంతృప్తి కలిగించిందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని శనివారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు వెలువరించింది. రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించిండంతో పాటుగా... మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. దీంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వివాదానికి తెరపడింది. -
తీర్పు ఎలా ఉన్నా సంబరాలొద్దు
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీమసీదు కేసులో తీర్పు ఎవరి వైపు వచ్చినా, భారీ ఉత్సవాలకు దూరంగా ఉండాలని హిందూ–ముస్లిం ప్రతినిధులు నిర్ణయించారు. మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నఖ్వి నివాసం వద్ద మంగళవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో హిందువుల తరఫున ఆరెస్సెస్, బీజేపీ ప్రతినిధులు కృష్ణ గోపాల్, రామ్‌లాల్‌లు హాజరయ్యారు. ముస్లింల తరఫున కేంద్రం మంత్రి అబ్బాస్ నఖ్వి, మాజీ కేంద్ర మంత్రి షానవాజ్ హుస్సేన్, జమాయత్ ఉలేమా ఏ హిందూ ప్రధాన కార్యదర్శి మహ్మూద్ మదాని, షియా బోధకుడు కాల్బే జవాద్‌లు హాజరయ్యారు. ఇందులో పలువురు వక్తలు మాట్లాడుతూ... తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా, ఉత్సవాలు జరపకూడదని పిలుపునిచ్చారు. గెలిచినట్లుగానీ, ఓడినట్లుగానీ భావించ కూడదని తెలిపారు. భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం కొనసాగుతోందని, అదే అందరినీ కలిపి ఉంచుతోందని అభిప్రాయపడ్డారు. 17న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, త్వరలో తీర్పు వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సోషల్ మీడియాపై పోలీసుల కన్ను అయోధ్య కేసులో తీర్పు వెలువడనుందన్న ఊహాగానాల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం సోషల్ మీడియాపై కన్నేసింది. ఫైజాబాద్ జిల్లాలో 16 వేల మంది వాలంటీర్లను పోలీసులు నియమించారు. దాదాపు అదే సంఖ్యలో మరో వాలంటీర్ల బృందాన్ని జిల్లాలోని 1,600 ప్రాంతాల్లో నియమించారు. వీరంతా తీర్పు తర్వాత సోషల్‌మీడియాపై నిఘా వేయనున్నారు. -
ఇకపై ఏపీ నుంచే హజ్ యాత్ర..
సాక్షి, న్యూఢిలీ: ఆంధ్రప్రదేశ్‌లో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు కేంద్రం శుభవార్త తెలిపింది. హజ్ యాత్రపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం.. వచ్చే ఏడాది నుంచి యాత్రికులు విజయవాడ నుంచి నేరుగా హజ్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన హజ్ రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్న.. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపై ఏపీలోని ముస్లింలు హజ్ యాత్ర కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. హజ్‌యాత్ర ఖర్చులో జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. అలాగే ఈ యాత్రకు సంబంధించిన దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్లోనే స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. -
70 ఏళ్లుగా బీజేపీపై మైనార్టీల్లో వ్యతిరేకత
న్యూఢిల్లీ: బీజేపీ పట్ల మైనార్టీల మనసుల్లో వ్యతిరేకత 70 ఏళ్లుగా నాటుకుపోయిందని, దాన్ని 70 రోజులు లేదా ఏడేళ్లలో తుడిచివేయలేమని మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. బీజేపీ 1980లో ప్రారంభమైనప్పటికీ దాని అనుబంధ సంస్థ జన సంఘ్ 1950 నుంచే కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. ఓట్ల కోసం మైనార్టీలను దోపిడీ చేయకపోవడం, వివక్ష లేకుండా అభివృద్ధి చేయడం వల్లే ప్రధాని మోదీ నాయకత్వంలో పూర్తి రక్షణలో ఉన్నట్లు మైనార్టీలు భావిస్తున్నారని శుక్రవారం పీటీఐ ఇంటర్వ్యూలో నఖ్వీ వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ రద్దు వల్ల మోదీకి మైనార్టీల్లో ప్రజాదరణ పెరిగిందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి కేంద్రం తెచ్చిన సంస్కరణ చర్యలని, అవి ప్రజాదరణ కోసం ఉద్దేశించినవి కావని పేర్కొన్నారు. -
కేంద్ర మంత్రికి ఈసీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : రాంపూర్‌లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ చేసిన మోదీ ఆర్మీ (మోదీ కీ సేన) వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఎన్నికల ప్రచారంలో భద్రతా దళాలను ఉద్దేశించి రాజకీయాలకు ముడిపెట్టే వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేసింది. ఇక అంతకుముందు ఈసీ అధికారులు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు కేంద్ర మంత్రి అంగీకరించారు. కాగా ఎన్నికల ప్రచారంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ను కూడా ఈసీ వివరణ కోరింది. ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ఆయనను ఈసీ హెచ్చరించింది. 48 గంటల పాటు ప్రచారం చేపట్టరాదని యోగి ఆదిత్యానాధ్ను సోమవారం ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
‘కాంగ్రెస్‌కు కాంట్రాక్ట్ ప్రధాని కావాలి’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రిమోట్ కంట్రోల్ ప్రధాని మాత్రమే కావాలని కేంద్ర మైనార్టీ వ్యహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం చేతిలో ఉండే రిమోట్ కంట్రోల్, కాంట్రాక్ట్ ప్రధానిని వారు కోరుకుంటున్నారని అన్నారు. కానీ దేశ ప్రజల మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ వంటి సమర్థవంతమైన నేతను మరోసారి ప్రధానిగా చూడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేశ రక్షణకు, అభివృద్ధికి మోదీయే సరైన నాయకుడిన నఖ్వీ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానిని ఆరు నెలలకోసారి మారుస్తుందని నఖ్వీ ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ పిక్నిక్కి వచ్చినట్లుగా ప్రచారానికి వస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడలేక కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు పెరుగుతోంది. -
ముస్లింల మెదళ్లలో విషాన్ని నింపారు: నఖ్వీ
సాక్షి, న్యూఢిల్లీ : ముస్లింల విశ్వాసం పొందాలంటే తమ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి ముఖ్తార్‌అబ్బాస్ నఖ్వీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన పీటీఐతో మాట్లాడుతూ... ‘గత 70 ఏళ్లుగా ముస్లింల మెదళ్లలో వారు(కాంగ్రెస్ పార్టీ) విషాన్ని నింపారు. ఇప్పుడు ముస్లిం మద్దతు కూడగట్టాలన్నా, మా పార్టీపై వారికి విశ్వాసం కలిగించాలన్నా ప్రభుత్వం ఎంతో చేయాల్సి ఉంది. అయితే గత కొంత కాలంగా బీజేపీ పట్ల వారి వైఖరి మారుతోంది. ముఖ్యంగా బీజేపీ చేపడుతోన్న మహిళా సంక్షేమ కార్యక్రమాల పట్ల ముస్లిం మహిళలు సానుకూల దృక్పథంతో ఉండటం మాకు కలిసి వచ్చే అంశం’ అంటూ వ్యాఖ్యానించారు. కేవలం ఓట్ల కోసమే కపట ప్రేమ.. కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీలన్నీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తాయి తప్ప వారి సంక్షేమం, అభివృద్ధి పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించరని నఖ్వీ ప్రతిపక్షాలను విమర్శించారు. తమ పార్టీ ఓట్ల కోసం తాపత్రయపడదని, కేవలం వారి సంక్షేమం దృష్ట్యా ఎన్నో సంక్షేమ కార్యక్రమాల అమలు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. -
రాష్ట్ర హజ్ కోటా పెంచండి..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం నుంచి ఏటా హజ్ యాత్రకు దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర కోటాను పెంచాలని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లాఖాన్ కోరారు. బుధవారం ఈ మేరకు ఢిల్లీలో ఆయన కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. అనంతరం సాయంత్రం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 2018 హజ్ యాత్రకు దాదాపు 18 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అయితే కేంద్ర హజ్ కమిటీ రాష్ట్రానికి 4 వేల కోటా మాత్రమే కేటాయించడంతో దరఖాస్తు చేసుకున్న మిగతా 14 వేల మందికి నిరాశే మిగిలిందని మంత్రికి వివరించినట్లు చెప్పారు. దేశంలో అత్యధికంగా రాష్ట్రం నుంచే దరఖాస్తులు వచ్చాయని, ఇతర రాష్ట్రాల్లో మిగిలిన కోటా ఉంటే తెలంగాణకివ్వాలని కోరామన్నారు. ఈ విషయమై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. -
హజ్ సబ్సిడీ రద్దు
న్యూఢిల్లీ: ఈ ఏడాది నుంచి హజ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వబోమని కేంద్ర మైనారిటీ శాఖమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ‘బుజ్జగింపు రాజకీయాలు కాకుండా ముస్లింలు హుందాగా బతికేలా సాధికారత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సబ్సిడీతో ముస్లింలు ఎలాంటి లబ్ధి పొందటం లేదు. గౌరవంతో కూడిన అభివృద్ధినే మేం విశ్వసిస్తాం. ఇప్పటివరకూ హజ్‌యాత్రకు కేటాయిస్తున్న మొత్తాన్ని మైనారిటీ బాలికల చదువుకు వినియోగిస్తాం’ అని మంగళవారం మీడియాకు వెల్లడించారు. సౌదీ అరేబియాలోని మక్కాకు దేశం నుంచి ఏటా 1.75 లక్షల మంది ముస్లింలు వెళ్తుంటారని నఖ్వీ తెలిపారు. గతేడాది హజ్ సబ్సిడీ కింద రూ.250 కోట్లకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. సబ్సిడీ రద్దు వల్ల హజ్ ఖర్చులు పెరిగిపోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2022 నాటికి హజ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలంటూ సుప్రీం కోర్టు 2012లో ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సబ్సిడీలో భాగం గా ప్రభుత్వరంగ విమానయాన సంస్థల్లో టికెట్ ధరలపై రాయితీ ఇస్తున్నారు. అదనపు భారమేం ఉండదు సాక్షి, హైదరాబాద్: హజ్ సబ్సిడీని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారిపై ఎలాంటి అదనపు భారం పడదని హజ్ కమిటీ ఉన్నతాధికారులు తెలిపారు. హజ్ యాత్రకు విమానయాన టికెట్లపై కేంద్ర హజ్ కమిటీ నిర్ణయించిన స్లాబ్ రేటుకు, విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న మొత్తానికి భారీ వ్యత్యాసం లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. గతేడాది హజ్ యాత్రికులకు కమిటీ స్లాబ్ రేటును రూ.65 వేలుగా నిర్ధారించగా, విమానయాన సంస్థలు రూ.62,065 మాత్రమే వసూలు చేశాయన్నారు. సాధారణంగా ఇప్పటివరకూ స్లాబ్ రేటు కన్నా ఎక్కువ మొత్తాన్ని విమానయాన సంస్థలు వసూలు చేస్తే.. ఆ మొత్తాన్ని సబ్సిడీగా కేంద్రం హజ్ కమిటీకి అందజేస్తుంది. -
అన్నీ మేడ్ ఇన్ ఇండియానే..
హైదరాబాద్: బారూద్, బందూక్, హెలికాప్టర్, జహాజ్ అన్నీ ప్రస్తుతం ‘మేడ్ ఇన్ ఇండియా’వే సైన్యంలో వాడుతున్నారని కేంద్ర మైనార్టీ వ్యవహరాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. ఇదీ ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఎన్డీటీవీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నఖ్వీ మాట్లాడుతూ... బారూద్ నుంచి అన్నీ.. ఇంతకు ముందు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని, ప్రస్తుతం విదేశాలు సైతం మన దేశానికి రావాల్సిన పరిస్థితిని తీసుకువచ్చామన్నారు. మోదీ కేంద్రం పగ్గాలు చేపట్టాక మూడున్నరేళ్లలో మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి వినూత్న ఆలోచనలకు ప్రోత్సహమిస్తున్నారన్నారు. మనదేశంలోని యువతను ప్రోత్సహించడం ద్వారా మరింతగా ఉపాధి సౌకర్యం మెరుగుపర్చేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి ఐఏఎస్‌లు 52 మంది ఈ మూడేళ్లలో ముస్లింలు ఎంపికయ్యారన్నారు. అయితే దీనిపై గత ప్రభుత్వం లాగా పబ్లిసిటీ చేసుకోలేదన్నారు. ముద్రా స్కీమ్.. ఎంతో మంది చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారికి ఎంతో ఉపయుక్తమవుతోందన్నారు. విద్యార్థులు, యువతను ఉపా«ధి పొందేవారుగా కాకుండా ఉపాధి కల్పించేవారిగా ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ ఫౌండేషన్ చైర్మన్ శివ్‌విక్రమ్ ఖేమ్కా అన్నారు. దేశ్యాప్తంగా అన్ని నగరాల్లో పర్యటించి విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చేందుకు బస్సు యాత్ర ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఉర్దూ వర్సిటీ చాన్స్‌లర్ జఫర్ సరేశ్‌వాలా, జెట్‌సెట్‌గో స్టార్టప్ వ్యవస్థాపకురాలు కనికతేక్రివాల్, ఎంటర్ప్రెన్యూర్ రవిమంతా చర్చలో పాల్గొనగా మోడరేటర్‌గా ఎన్డీటీవీ యాంకర్ ఉమ వ్యవహరించారు. -
‘ఇస్లామిక్ బ్యాంక్‌పై ఆసక్తి లేదు’
సాక్షి, హైదరాబాద్ : భారతదేశంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు ఇప్పటికే పలు బ్యాంకులు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసే అవసరం లేదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పష్టం చేశారు. ఇస్లామిక్ లేదా షరియా వ్యవస్థలో ఆర్థిక లావాదేవీలకు వడ్డీ ఉండదని ఆయన తెలిపారు. అయితే భారతదేశం లౌకిక దేశమని.. ఇక్కడ మత ప్రాతిపదికన బ్యాంకులు, ఇతర వ్యవస్థలు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఆయా వర్గాల కోసం ప్రత్యేకంగా షెడ్యూల్డ్ బ్యాంకులను ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని నక్వీ తెలిపారు. -
అనుభవమున్నా.. ఈ సారి ఆయనది తప్పే
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్ర మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. కొందరు సిన్హాను సమర్థిస్తుంటే.. మరికొందరు ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తాజాగా కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, సిన్హా వ్యాఖ్యలపై స్పందించారు. ఆర్థిక వ్యవస్థపై అనుభవమున్నప్పటికీ, యశ్వంత్ సిన్హా దేశీయ ఎకానమీని ఈసారి సరిగ్గా అంచనా వేయలేకపోయారని నఖ్వీ పేర్కొన్నారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమలు తర్వాత, నిత్యావసరాల వస్తువుల ధరలు కిందకి దిగొచ్చాయని పేర్కొన్నారు. యశ్వంత్ సిన్హాకు అనుభవముంది, కానీ ఈ సారి సరిగ్గా ఆర్థిక వ్యవస్థను అంచనావేయలేకపోయారు. కొత్త, పాత భారత్‌ల మధ్య భేదం ఉందని, ప్రస్తుతం మనదేశం సానుకూల దిశగా పయనిస్తుందని జీ మీడియా రీజనల్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఇంటర్వ్యూలోనే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కూడా నఖ్వీ విమర్శించారు. స్వేచ్ఛాయుత భారత ఆర్థిక వ్యవస్థను, ఆయన తనాఖా పెట్టారని మండిపడ్డారు. 2016 నవంబర్ నుంచి 2017 జూలై మధ్యలో డీమానిటైజేషన్, జీఎస్టీలను అమలు చేయడం సరియైనది కాదని సిన్హా చేసిన వ్యాఖ్యలను నఖ్వీ తిప్పి కొట్టారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలోనూ ప్రభుత్వాలను ఏర్పాటుచేసేందుకు బీజేపీకి మంచి రాజకీయ సత్తా ఉందని నఖ్వీ చెప్పారు. 2017 చివర్లో లేదా 2018 మొదట్లో గుజరాత్‌కు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికల కమిషన్ దీనిపై త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
మైనారిటీ బాలికలకు 40% సీట్లు
100 నవోదయ తరహా పాఠశాలల్లో రిజర్వేషన్: కేంద్ర మంత్రి నక్వీ న్యూఢిల్లీ: మైనారిటీలకు మెరుగైన విద్యనందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రతిపాదిత 100 నవోదయ తరహా పాఠశాలలు, ఐదు ఉన్నత విద్యా సంస్థల్లో మైనారిటీ బాలికలకు 40 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. మైనారిటీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ చెప్పారు. ఈ వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని, ఈ క్రమంలోనే బాలికలకు 40 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించామని తెలిపారు. బహురంగాల అభివృద్ధి కార్యక్రమం (ఎంఎస్‌డీపీ) కింద భవనాల నిర్మాణం జరుగుతుందని, సాధ్యమైనంత వరకు వచ్చే ఏడాది ఈ పాఠశాలలను ప్రారంభిస్తామని నక్వీ వెల్లడించారు. ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుకు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ ప్రభుత్వాలు ఆసక్తి చూపాయన్నారు. మైనారిటీల్లో, ముఖ్యంగా ముస్లింలలో విద్యా వెనకబాటుతనాన్ని అధిగమించేందుకు మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (ఎంఏఈఎఫ్) నియమించిన ఉన్నత స్థాయి కమిటీ మూడంచెల విధానాన్ని ప్రతిపాదించింది. కేంద్రియ/నవోదయా తరహా బోధనా విధానంతో ప్రాథమిక, సెంకడరీ, ఉన్నత స్థాయిలో 211 పాఠశాలలు, 25 కమ్యూనిటీ కాలేజీలు, ఐదు విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. ఎంపీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ భోపాల్: మధ్యప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఆదివారం భోపాల్‌లో మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇప్పుడు వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగాల్లో మన కూతుళ్లకు (యువతులకు) 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు. అయితే.. అటవీ శాఖకు మాత్రం ఈ రిజర్వేషన్ల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. 12వ తరగతిలో 75 శాతం లేదా, సీబీఎస్ఈలో 85 శాతం పొందిన విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్ విద్య ఖర్చును బీజేపీ భరిస్తుందని చౌహాన్ ప్రకటించారు. -
‘వర్షాకాలం’లో రాజకీయ వేడి
-
‘వర్షాకాలం’లో రాజకీయ వేడి
► నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ► పలు అంశాలతో విపక్షాల ఎజెండా ఖరారు ► కశ్మీర్, చైనాపై చర్చ జరగాల్సిందే: కాంగ్రెస్ న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై ప్రభుత్వం విపక్షాలతో చర్చించి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా పార్లమెంటులో పలు కీలకాంశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు 18 విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. గోరక్షణ పేరుతో హత్యలతోపాటు కశ్మీర్లో హింస, సిక్కిం సరిహద్దుల్లో ఉద్రిక్తత, మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులు, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ ప్రభావం, అవినీతి కేసుల పేరుతో విపక్షాలపై దాడులు తదితర అంశాలపై కత్తులు నూరుతున్నాయి. అయితే విపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చ జరిపేందుకు తాము సిద్ధమేనని పార్లమెంటు వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. డిమాండ్లను అంగీకరించకపోతేనే.. ‘పార్లమెంటు సమావేశాలు జరగకుండా చేయాలని ఎందుకనుకుంటాం. మేం చేసే న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోవటంతోనే సమస్య ఉత్పన్నమవుతోంది’ అని కాంగ్రెస్ రాజ్యసభాపక్షనేత గులాంనబీ ఆజాద్ వెల్లడించారు. భౌగోళిక సమగ్రత, దేశ భద్రత అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తమ మద్దతుంటుందన్నారు. అయితే కశ్మీర్, చైనా అంశాలపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ‘కశ్మీర్‌పై చర్చలకు ప్రభుత్వం అన్ని దార్లూ మూసేసింది. అందుకే లోయలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కశ్మీర్లో యువకుల వద్ద తుపాకులు తీసేస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని కేంద్రం భావిస్తున్నట్లయితే దీనికి మా మద్దతుండదు’ అని ఆజాద్ స్పష్టం చేశారు. ‘గోరక్ష’పై ఏం చేస్తున్నారు? గోరక్ష విషయంలో కేంద్రం ఏం చర్యలు చేపడుతుందో చెప్పాలని డిమాండ్ చేయనున్నట్లు సీపీఐ నేత డి.రాజా తెలిపారు. సోమవారం సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల కన్నుమూసిన సభ్యులకు (కేంద్ర మంత్రి అనిల్ దవే, కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (ఇద్దరు రాజ్యసభ సభ్యులు), గురుదాస్‌పూర్ లోక్‌సభ ఎంపీ వినోద్ ఖన్నా) నివాళులర్పించిన అనంతరం ఉభయసభలు వాయిదా పడనున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక కూడా జరగనుంది. ఈ సమావేశాలు ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. -
గోవధ నిషేధం ఓ సంస్కరణ: కేంద్రమంత్రి నక్వీ
- కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ హైదరాబాద్: గోవధ నిషేధంపై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పందించారు. గోవధను మతపరంగా కాకుండా సంస్కరణగా చూడాలని ఆయన అన్నారు. బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడూతూ..పశువుల మార్కెట్లను క్రమబద్దీరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. దీనికి అందరూ సహరించాలని కోరారు. దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉందని, కానీ కొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఫ్ పార్టీల పేరుతో కొందరు గోవధ అంశాన్ని రాజకీయంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది దేశంలో సామరస్యతను దెబ్బతీస్తుందని చెప్పారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించదన్నారు. గోవధ సెంటిమెంట్‌తో ముడిపడి విషయమని, గోవధ నేరమని తెలిపారు. మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా భారతఖ్యాతిని పెంచిందని, కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌ను ప్రపంచ దేశాల్లో ఏకాకి చేశామని వివరించారు. దేశంలో 80 నుంచి 90 శాతం మతపరమైన ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ అవసరం ఎక్కువగా ఉందని, బీజేపీకి తెలంగాణ చాలా ముఖ్యమైనదని అన్నారు. 2019 లో రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీ తో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. తాయిలాలు లేకుండానే మైనార్టీల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. యూపీలో ముస్లింల ఓటర్ల పై రవిశంకర్ వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయడం రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదని, ఇవి ఎన్నికల కోసం వేసే ఎత్తులు మాత్రమేనని స్పష్టం చేశారు. -
'వారు ఏజెంట్లుగా ఉండే ప్రమాదం.. తీసేయండి'
లక్నో: ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న కొంతమంది సీనియర్ అధికారులను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కొంతమంది సీనియర్ అధికారులను తొలగించాలని కేంద్రమంత్రి, బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో ఆయన శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి టీ వెంకటేశ్‌ను కలిశారు. యూపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, డీజీపీని తొలగిస్తే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని అందరికీ హామీ ఇచ్చినట్లవుతుందని అన్నారు. గత ఐదేళ్లుగా ఈ ఇద్దరు అధికారులు, ఇంకొంతమంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కింద పనిచేస్తున్నారని, వీరుంటే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే వెంటనే వారిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే అధికార పార్టీకి ఏజెంట్లుగా పనిచేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నలుగురు సీనియర్ అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బందిగా వ్యవహరిస్తున్న వారిని అనుమానిస్తూ ఆయన వినతిపత్రం ఇచ్చారు. -
‘హజ్ ఆన్లైన్ దరఖాస్తులకు మంచి స్పందన’
ముంబై: హజ్ యాత్ర దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్ చేయడాన్ని ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతించారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. ఈ ఏడాది యాత్రకు సబ్సిడీ కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. శనివారం ఇక్కడ జరిగిన ఆల్ ఇండియా హజ్ ఉమ్రా టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2017 హజ్ యాత్రకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ జనవరి 2న ప్రారంభమైందని, చివరి తేదీ జనవరి 24 అని తెలిపారు. పూర్తి పారదర్శకత, యాత్రికుల సౌకర్యార్థమే ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ ఏడు మరో 34, 500 పైగా మంది యాత్రికులు హజ్‌కు వెళ్తారని, చాలా ఏళ్ల తరువాత భారత హజ్ యాత్రికుల సంఖ్యలో ఇదే అతిపెద్ద పెరుగుదల అని వెల్లడించారు. -
హజ్‌కు కేంద్రం రాయితీ కొనసాగించాలి
కేంద్ర మంత్రి నఖ్వీకి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ లేఖ సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్రకు సబ్సిడీని యథావిధిగా కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతేడాది కేంద్రం నుంచి రూ.690 కోట్ల రాయితీ ఇవ్వగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.వెయ్యి కోట్లకు పెంచాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఆదివారం ఆయన లేఖ రాశారు. హజ్‌ను సందర్శించడం ముస్లింల జీవిత ఆశయమని, పేద ముస్లింలకు హజ్‌యాత్ర సులభతరం కానందునే ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారి కలను సాకారం చేస్తుందని తెలిపారు. అయితే హజ్‌యాత్ర రాయితీ నిధులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసినట్లు తెలిసిందని, కమిటీ నివేదికతో సంబంధం లేకుండా నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హజ్ యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని లేఖలో ఆయన వివరించారు. -
‘వక్ఫ్’ ఫిర్యాదులపై విచారణ కమిటీ
న్యూఢిల్లీ: వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన ఫిర్యాదుల పరిశీలన నిమిత్తం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో కేంద్రం ఏక సభ్య కమిషన్‌ను నియమించినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఇక్కడ జరిగిన ఆలిండియా వక్ఫ్ కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. వక్ఫ్ ఆస్తుల వ్యవహారాలపై రాష్ట్రాలు కూడా ముగ్గురు సభ్యులతో కూడిన ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. మాఫియా చెర నుంచి వక్ఫ్ భూములకు విముక్తి కల్పించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించిందని తెలిపారు. వక్ఫ్ ఆస్తులను, భూములను ముస్లింల సామాజిక, ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగించాలని కల్పించాలని సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 4,49,314 రిజిస్టర్డ్, అన్‌రిజిస్టర్డ్ ఆస్తులు ఉన్నాయని, వాటి వార్షిక ఆదాయం రూ.163 కోట్లు, స్థిరాస్తుల విలువ 1.2 లక్షల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ వక్ఫ్ ఆస్తుల ద్వారా ఏడాదికి 12 వేల కోట్ల ఆదాయం రాబట్టవచ్చని, వాటిని ముస్లింల అభివృద్ధికి ఖర్చు చేస్తే వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు సంభవించే అవకాముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలు మైనారిటీల పాఠశాలలు, కాలేజీలు, నైపుణ్య కేంద్రాలు, ఆస్పత్రుల నిర్మాణాలు చేపడితే కేంద్రం సహకరిస్తుందని మంత్రి వెల్లడించారు. -
దేశానికే తెలంగాణ రోల్ మోడల్
-
ఉగ్రవాద కర్మాగారం గా పాకిస్థాన్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రపంచానికి ఉగ్రవాదులను ఎగుమతి చేసే కర్మాగారంగా మారిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. ఢిల్లీలోని ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన సోమవారం మాట్లాడుతూ .. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సుస్థిరతలకు విఘాతం కలుగుతోందని అన్నారు. ఆ దేశ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కాలుష్యం ప్రపంచ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని పేర్కొన్నారు. భారతదేశం ఎప్పుడూ పొరుగు దేశానికి స్నేహహస్తాన్ని అందిస్తుందని అన్నారు. కానీ పాక్ మాత్రం భారత వ్యతిరేక విధానాలను తమ విదేశాంగవిధానంలో భాగంగా చేసుకుందని ఇందుకు ఆ దేశం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆదివారం వేకువజామున నలుగురు పాక్ ముష్కరులు జమ్ములోని యూరీ సెక్టార్ లోని ఆర్మీ బేస్ క్యాంపుపై పై దాడికి దిగిన ఘటనలో తాజాగా ఒక సైనికుడు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య మొత్తం 18 కి చేరుకుంది. గాయపడ్డ 20 మంది సైనికులు చికిత్స పొందుతున్నారు. -
'ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ప్రవేశపెట్టిన పథకాల వెనుక మోదీ ప్రభుత్వం ఉద్దేశం ఏంటో ప్రజలకు పూర్తిస్థాయిలో అర్థమయ్యేలా చేసేందుకు ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి, బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తర్ అబ్బాస్ నఖ్వీ మీడియాకు వెల్లడించారు. మంగళవారం న్యూఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల పనితీరుపై ప్రజల్లో అవగాహన కల్పించే అంశంపై చర్చించినట్టు నఖ్వీ చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన 2016-17 కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసిస్తూ.. ప్రజలకు ప్రభుత్వ పథకాల ఉద్దేశం గురించి తెలియజేయడం ముఖ్యమైన విషయంగా పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వివరణాత్మకంగా తెలియజేసేందుకు అవసరమైతే ప్రజల్లోకి వెళ్లైన సరే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. -
'ఒంటరిగా పోటీ చేస్తాం.. మాదే అధికారం'
లక్నో: 2017లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో పొత్తుల గురించి ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి బీజేపీ వైఖరిని స్పష్టం చేశారు. డీడీసీఏ వివాదంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నఖ్వీ చెప్పారు. ఢిల్లీ ఆప్ ప్రభుత్వం నిరాధారమైన ఆరోపణలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సంకుచిత స్వభావంతో దేశాభావృద్ధిని కోరుకోవడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ 'అవినీతికి తల్లి' వంటి పార్టీ అని కేంద్ర మంత్రి అన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటన గురించి మీడియా ప్రశ్నకు సమాధానంగా కొత్త ఏడాది వేడుకలను ఎవరైనా ప్రపంచంలో ఎక్కడైనా చేసుకోవచ్చని అన్నారు. విదేశీ పర్యటన రాహుల్‌కు మంచి బుద్ధి కలిగించాలని నఖ్వీ చెప్పారు. -
కాంగ్రెస్ - బీజేపీ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్
న్యూఢిల్లీ: హెరాల్డ్ కేసు నేపథ్యంలో కేంద్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శల యుద్ధం శనివారం తారాస్థాయికి చేరింది. మోదీ కుట్రలో స్వామి ఇరుసు మాత్రమే... ‘‘సుబ్రమణ్యంస్వామికి ‘జడ్’ కేటగిరీ భద్రతను, కేబినెట్ మంత్రి నివాసాన్ని శుక్రవారమే ఎందుకు ఇచ్చింది? ఇది మోదీసారథ్యంలో నడుస్తున్న రాజకీయ ప్రతీకారం.. ఈ కుట్రలో స్వామి ఒక ఇరుసు మాత్రమే.’’ - రణ్‌దీప్ సూర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి ప్రజలు తగిన జవాబు చెప్తారు... ‘‘బీజేపీ-ఆర్ఎస్ఎస్లకు దేశ ప్రజలు గతంలో చెప్పినట్లు తగిన సమాధానం చెప్తారు.’’ - దిగిజ్వయ్సింగ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వారిది సిగ్గుచేటయిన డ్రామా... ‘‘సోనియా, రాహుల్‌ల మాటలు చూస్తుంటే.. వారు అవినీతి కోసం సిగ్గుచేటయిన రీతిలో రోడ్డుపై డ్రామా చేస్తూ పోరాడుతున్నారు. ’’ - ముక్తార్ అబ్బాస్ నక్వీ, కేంద్రమంత్రి -
ఈ సమావేశాల్లో జీఎస్టీ లేనట్టే!
అన్సారీ అఖిలపక్ష భేటీ.. మిగతా బిల్లులకు విపక్షాల ఓకే న్యూఢిల్లీ: రాజ్యసభ నిర్వహణలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ శుక్రవారం అఖిల పక్ష భేటీ నిర్వహించారు. అయితే, ఆ భేటీలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)పై ఎలాంటి ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు కానీ, ముఖ్యమైన ఇతర బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు అంగీకరించాయి. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామన్నాయి. శీతాకాల సమావేశాలు ఈ నెల 23తో ముగుస్తున్న నేపథ్యంలో.. ఆ లోపు ఎస్సీ, ఎస్టీ(అత్యాచార నిరోధక) సవరణ బిల్లు, అప్రోప్రియేషన్ బిల్లులు, హైజాకింగ్ వ్యతిరేక బిల్లు, ఆటమిక్ ఎనర్జీ సవరణ బిల్లు, వాణిజ్య కోర్టుల ఆర్డినెన్స్ బిల్లు, మధ్యవర్తిత్వ సవరణ బిల్లు.. తదితర బిల్లుల ఆమోదం పొందేందుకు సహకరిస్తామని విపక్షాలు హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ అఖిల పక్ష భేటీలో కొత్తగా చర్చించిందేమీ లేదని, బీఏసీ సమావేశంలో చర్చించిన అంశాలనే ఇక్కడా ప్రస్తావించారని రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. జీఎస్టీపై భేటీలో చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏకాభిప్రాయం వ్యక్తమైన బిల్లుల గురించి చర్చించామన్నారు. సుహృద్భావ వాతావరణంలో అఖిలపక్ష భేటీ జరిగిందని పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. ఇన్నాళ్లు సభ సరిగ్గా సాగనందుకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఇక మిగిలిన రోజులు ఎక్కువ సమయంపాటు సభను జరిపేందుకు అంతా అంగీకరించారని తెలిపారు. బాల కార్మిక సవరణ బిల్లు, విజిల్ బ్లోయర్స్ పరిరక్షణ సవరణ బిల్లు, జువనైల్ జస్టిస్ బిల్లులపై రాజ్యసభలో చర్చించనున్నారు. పెరుగుతున్న ధరలు, వ్యవసాయంపై వరదలు, కరువు ప్రభావం, అసహనం, అరుణాచల్ ప్రదేశ్ పరిణామాలపై చర్చించాలని అఖిలపక్ష భేటీలో నిర్ణయించారు. పార్లమెంటు సమాచారం ► లోటు వర్షపాతం వల్లే దేశంలో వ్యవసాయ సంక్షోభం నెలకొన్నదని.. అయినా కూడా వ్యవసాయ ఉత్పత్తి రెండు శాతం పెరిగిందని వ్యవసాయశాఖ సహాయమంత్రి జయంత్‌సిన్హా లోక్‌సభలో పేర్కొన్నారు. ► స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదంటూ కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ ప్రతిపాదించిన ప్రయివేటు సభ్యుడి బిల్లును ప్రవేశపెట్టకముందే లోక్‌సభ 71 - 24 ఓట్ల తేడాతో ఓడించింది. ► రక్షణ రంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వు చేసిన పోస్టుల్లో 6,600 కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ► కశ్మీర్ మ్యాప్‌ను తప్పుగా ప్రచిరించారన్న ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ తదితర అమెరికా సంస్థలపై చర్యలు చేపట్టాలని బీజేపీ సభ్యుడు తరుణ్‌విజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ► ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో టీబీ రోగులున్న దేశంగా భారత్‌ను డబ్లూహెచ్‌వో తాజా నివేదిక పేర్కొంది. 2014లో 22 లక్షల టీబీ కేసులను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా లోక్‌సభకు తెలిపారు. అయితే గత 15 ఏళ్లుగా టీబీ కేసుల సంఖ్య, ఆ వ్యాధి కారణంగా చోటుచేసుకుంటున్న మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టాయని వివరించారు. -
'వివాదాలొద్దని వెంకయ్య చెప్పారు'
న్యూఢిల్లీ: వివాదాలకు దూరంగా ఉండాలని వెంకయ్య నాయుడు తమకు ఉద్బోధించారని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఈ ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు ప్రయోగించే భాష పట్ల నియంత్రణ కలిగివుండాలని, వివాదస్పద వ్యాఖ్యలు చేయొద్దని సమావేశంలో వెంకయ్య విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. బీజేపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే, ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి ఎజెండాపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని పేర్కొన్నట్టు తెలిపారు. ఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, మత అసహనంపై రాజకీయ చర్చల గురించి సమావేశంలో చర్చించినట్టు వెల్లడించారు. లోక్ సభలో మత అసహనంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. -
'అభిమానులను అవమానించేలా హీరో కామెంట్స్'
న్యూఢిల్లీ: మత అసహనంపై ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆమిర్ ఖాన్ దేశం విడిచి వెళ్లిపోవాలని తాము కోరుకోవడం లేదని, ఇక్కడ ఆయన క్షేమంగా ఉన్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు ఆయన అభిమానులను అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రేరితంగా ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. కాగా తమ ప్రభుత్వ హాయంలో మతఘర్షణలు తగ్గాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. గుడ్డిగా ప్రకటనలు చేయడం సమంజసం కాదని అన్నారు. ప్రజలను ఆమిర్ ఖాన్ భయాందోళనకు గురి చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి నళిని కోహ్లి ఆరోపించారు. సోమవారం ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా ఎక్స్‌లెన్స్ ఇన్‌జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ... మత అసహనంపై తాను ఆందోళనకు గురయ్యానని ఆమిర్ ఖాన్ అన్నారు. 'ఇండియా వదిలి వేరే దేశానికి వెళ్దామా?' అని తన భార్య కిరణ్ రావ్ అడిగిందని ఆమిర్ వెల్లడించారు. -
'మతిస్థిమితం కోల్పోయిన అబ్బాస్'
న్యూఢిల్లీ: తమ పార్టీ, సోనియా గాంధీపై విమర్శలు చేసిన కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. నఖ్వీ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసం ఆయన విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ ఆదివారం ధ్వజమెత్తారు. శనివారం కాన్పూర్ లో మాట్లాడుతూ సోనియా గాంధీపై నఖ్వీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ లో ఒక మతానికి చెందిన తీవ్రవాది చనిపోతే ఆ రాత్రంతా సోనియా గాంధీ నిద్రపోలేదని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చెప్పిన విషయాన్ని నఖ్వీ గుర్తు చేశారు. -
మహాకూటమిపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: బిహార్ ప్రజలను మతప్రాతిపదికన విడగొట్టేందుకు మహా కూటమి ప్రయత్నిస్తోందని ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి నేతృత్వంలోని బీజేపీ నాయకులు శుక్రవారం ఈసీని కలిశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ నాయకులు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఈసీకీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ దివాళాకోరుతనంతో కొంత మంది నాయకులు హద్దులు దాటారని ఈసీని కలిసిన తర్వాత నఖ్వీ విమర్శించారు. -
కాంగ్రెస్ ది 'హిట్ అండ్ రన్' పాలసీ: బీజేపీ
న్యూఢిల్లీ: రాజ్యసభ కార్యకలాపాలను పదే పదే అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై అధికార బీజేపీ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పార్టీ 'హిట్ అండ్ రన్' విధానం అవలంభిస్తోందని ఆరోపించింది. హస్తం చేసిన ఆరోపణలపై సభలో ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా అడ్డుకుంటోందని దుయ్యబట్టింది. 'రాజ్యసభలో కాంగ్రెస్ అడిగిన దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలనుకుంటుంది. అంతలోనే కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకుంటారు. తర్వాత బయటికి వెళ్లిపోతారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆటంక రాజకీయాలు చేయడం ఇదే తొలిసారి. ఇలా జరగడం దేశానికి మంచిది కాదు' అని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సుష్మ స్వరాజ్, వసుంధర రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. -
ఆటంకవాద రాజకీయాలపై తీర్మానం: నఖ్వీ
న్యూఢిల్లీ: సుష్మ స్వరాజ్, వసుంధర రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ వారికి అండగా ఉంటుందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న అభివృద్ధి నిరోధక, ఆటంకవాద, వ్యతిరేక రాజకీయాలను నిరసిస్తూ బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఓ తీర్మానం ఆమోదించిందని తెలిపారు. సుష్మ, రాజె, చౌహాన్ రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. ఉభయ సభల్లోనూ సభా కార్యకలాపాలను స్తంభింపజేస్తున్నారు. -
కాస్త హోం వర్కు చేసుకుని రండి బాబూ!
కాంగ్రెస్ ఎంపీలు సభకు వచ్చేముందు తగినంత హోం వర్కు చేసుకుని రావట్లేదంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. రాజ్యసభలో విపక్ష ఉపనేత ఆనంద్ శర్మ ఇచ్చిన నోటీసును ఉద్దేశించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇచ్చిన నోటీసులో ఎవరి రాజీనామాకు డిమాండ్ చయలేదని, పైగా.. సభలో మాత్రం మంత్రులు రాజీనామా చేయాలంటూ కేకలు పెడుతున్నారని అన్నారు. వాళ్లు హోంవర్కు చేయకుండా వచ్చి, తమ ఉచ్చులో తామే బిగుసుకుంటున్నారన్నారు. పార్లమెంటు సమయాన్ని వృథా చేస్తున్నారని, దేశ ప్రజలు వాళ్లను క్షమించే ప్రసక్తి లేదని మంత్రి చెప్పారు. వాళ్లు తగినంత హోం వర్కు చేసుకుని వచ్చి, సభను సజావుగా నడవనివ్వాలని కోరారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, వసుంధరా రాజెలతో పాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ సభ్యులు గట్టిగా పట్టుబట్టడంతో రాజ్యసభ వాయిదాల పర్వంతో నడుస్తున్న విషయం తెలిసిందే. -
రాజీనామాలు అస్సల్లేవ్
న్యూఢిల్లీ: లలిత్ గేట్ వ్యవహారం, వ్యాపం కుంభకోణానికి సంబంధించి ఎవరి రాజీనామాలు ఉండబోవని మరోసారి కేంద్ర ప్రభుత్వం విపక్షాలకు స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా ఆధార రహితమైనవి అయినందున కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్గానీ, బీజేపీ ముఖ్యమంత్రులుగానీ రాజీనామాలు చేయబోరని పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. ప్రతి పక్షాలు చేస్తున్న దుష్ప్రచారానికి సరైన సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వివరణ ఇచ్చి వారి ఆరోపణలు తప్పని రుజువుచేయాలని నిర్ణయించామని తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేవలం సభా వ్యవహారాలను భంగపరిచే ఆలోచన తప్ప ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఒక అంశంపై చర్చించాలన్న ఆలోచన, ఉద్దేశం లేదని ఆయన ఆరోపించారు. అందుకే తాము ఎంత చెబుతున్నా వినకుండా అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు భయపడాల్సిన అవసరం లేదని, మనం చేస్తున్న మంచిపనులు చూసి గర్వపడండంటూ మోదీ తమకు మరోసారి సమావేశంలో గుర్తు చేశారని తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా విపక్షాలను విమర్శించారు. చర్చకు తాము సిద్ధమని చెప్తున్నా కావాలనే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని ఆరోపించారు. -
నేను బీఫ్ తింటా, ఎవరైనా ఆపగలరా?
న్యూఢిల్లీ : ఎన్డీయే సర్కార్‌లో సహచర మంత్రుల మధ్య బీఫ్ వ్యవహారం ముదురుతోంది. బీఫ్ తినకపోతే బ్రతకలేనివారు దేశం వదిలిపెట్టి పాకిస్తాన్ వలస వెళ్లాలన్న కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖా మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. తాను బీఫ్ తింటానని, తనను ఎవరైనా ఆపగలరా అని ఆయన ప్రశ్నించారు. తన సహచరుడి వ్యాఖ్యలు 'రుచి, పచి లేని'వని కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. 'నేను గొడ్డు మాంసం తింటాను. అరుణాచల్ ప్రదేశ్‌లోనే ఉంటా. నాతో ఎవరైనా బీఫ్ తినడం మాన్పించగలరా? అని కిరణ్ రిజిజు ప్రశ్నించారు. భారత్ దేశంలో అందరి మనోభావాలు గుర్తించాలని, వారి వారి పద్ధతులు, సంప్రదాయాలను సమానంగా గౌరవించాల్సి ఉందన్నారు. బీఫ్ తినవద్దని చెప్పడానికి ఆయన ఎవరూ అంటూ నక్వీపై కిరణ్ రిజిజు మండిపడ్డారు. ఒకవేళ బీఫ్ తినకుండా నిషేధించాలనుకుంటే.. మహారాష్ట్రలో హిందువుల మెజార్టీ ఎక్కువగా ఉన్నందున హిందు మతవిశ్వాసం ప్రకారం అక్కడని చట్టాన్ని అమలు చేసుకోండని కిరణ్ రిజిజు సూచించారు. ఈశాన్య రాష్ట్రాలు అధిక శాతం ప్రజలు బీఫ్ తింటారని, దానివల్ల తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. ప్రతి పౌరుడి మనోభావాలను గుర్తించాలని కిరణ్ రిజిజు అన్నారు. బీఫ్ తినాలనుకుంటే పాక్,లేదా అరబ్ దేశాలు వెళ్లాలని నక్వీ వ్యాఖ్యలు చేయటం మంచి పరిణామం కాదన్నారు. అయితే ఆయనకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ ...ప్రజల యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. కాగా గోమాంసం తినకపోతే చచ్చిపోతారనకుంటే.. పాకిస్తాన్, లేదా అరబ్ దేశాలకు వెళ్లాలని నక్వీ సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. గోవధను నిషేధించడం మీద కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై ఆయన పైవిధంగా స్పందించారు. ఇక గోవధను మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. ఇక మీదట రాష్ట్రంలో ఎక్కడైనా ఆవు మాంసాన్ని విక్రయించిన లేదా కలిగి ఉన్నా వాళ్లకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 50 వేల రూపాయల జరిమానా విధించనున్నారు. -
'బీఫ్ తినకపోతే చచ్చిపోతారా.. పాక్ వెళ్లండి'
గోవధను నిషేధించడం మీద కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. గోమాంసం తినకపోతే చచ్చిపోతారనకుంటే.. పాకిస్థాన్ వెళ్లాలని సలహా ఇచ్చారు. దానివల్ల లాభం గానీ, నష్టం గానీ లేవని, అది కేవలం విశ్వాసాలకు సంబంధించిన విషయమని ఆయన అన్నారు. హిందువులకు సున్నితమైన అంశమని ఆయన ఆజ్‌తక్ టీవీ ఛానల్ నిర్వహించిన 'మంథన్' సదస్సులో చెప్పారు. గోమాంసం తినకపోతే చచ్చిపోయేవాళ్లు పాకిస్థాన్‌కు గానీ, అరబ్బు దేశాలకు గానీ వెళ్లాలని లేదా ప్రపంచంలో మరే ప్రాంతంలోనైనా అది అందుబాటులో ఉంటే అక్కడకు పోవాలని సూచించారు. కొంతమంది ముస్లింలు కూడా గోవధకు వ్యతిరేకమేనని ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. గోవా, జమ్ము కాశ్మీర్, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఈ తరహా మాంసమే తింటారని, కేంద్రం దేశవ్యాప్తంగా గోవధను నిషేధించగలదా అంటూ మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను నఖ్వీ ఖండించారు. -
కొత్తగా ముస్తాబవుతున్నరాజ్యసభ
ఎప్పుడో.. 88 ఏళ్ల నాటి పురాతనమైన పార్లమెంటు భవనంలోని రాజ్యసభ సమావేశ హాలుకు ఇపుడు కొత్త హంగులు, సొబగులు అమరుతున్నాయి. రాజ్యసభ భవనంలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టిన తమ ప్రభుత్వం చారిత్రక కట్టడ నిర్మాణ సౌందర్యం చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. రాజ్యసభకు హంగులద్దే కార్యక్రమం దాదాపు పూర్తయిందని ఆయన తెలిపారు. భవనం డోమ్‌కు కొత్త అందాలు అద్దుతున్నామన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ అధ్యక్షుడు, హమీద్ అన్సారీ, ఉపాధ్యక్షుడు కురియన్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవనంలో రెడ్ కార్పెట్స్‌ను పూర్తిగా మార్చామని తెలిపారు. వాటిని ఆఖరిసారి ఎవరు ఎపుడు మార్చారో తెలియదు కానీ... కార్పెట్స్ సహా, కుర్చీలు కూడా కొత్తవి ఏర్పాటు చేశామని రాజ్యసభలో ప్రకటించారు. ప్రతిపక్ష నేతలు కూడా ఈ మార్పును గమనించలేకపోయారని నక్వీ తెలిపారు. దీనికి స్పందించిన కురియన్ సభ భవన సహజత్వం కోల్పోకుండా మార్పులు చాలా బాగా జరిగాయని ప్రశంసించారు. కాగా 2012 మేలో సభలో దుర్వాసన రాడంతో సభ్యులు గ్యాస్ దాడి అని, వంట గ్యాస్ లీకయ్యిందని ఆందోళనకు గురయ్యారు. తర్వాత రెండు రోజులు పాటు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ తీర్చిదిద్దే పనులు శ్రీకారం చుట్టింది ఎన్డీయే ప్రభుత్వం. -
'కార్పొరేట్ గూఢచర్యం'పై చర్చిద్దాం
కార్పొరేట్ గూఢచర్యం కేసుకు సంబంధించిన విషయంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సమాజ్‌వాది పార్టీకి చెందిన నరేశ్ అగర్వాల్ ఈ విషయంపై చర్చను లేవనెత్తారు. ముఖ్యమైన శాఖల(పెట్రోలియం, రక్షణ, విదేశీ)కు చెందిన విలువైన రహస్య పత్రాలు లీకయినప్పటికీ అందుకు కారణమైన ప్రధానమైన వ్యక్తులను వదిలేసి చిన్నచితకా, జూనియర్స్‌ను మాత్రమే అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ కార్యదర్శి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జోక్యం చేసుకుని ఈ విషయంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పెట్రోలియంశాఖతోపాటు రక్షణశాఖకు చెందిన పలు విలువైన పత్రాలు లీకైన విషయంపై కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. -
కస్టడీకి కేంద్రమంత్రి.. బెయిల్ మంజూరు
-
జ్యుడీషియల్ కస్టడీకి కేంద్రమంత్రి నఖ్వీ.. బెయిల్ మంజూరు
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ ప్రాంతంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 2009లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు నఖ్వీపై ఆరోపణలున్నాయి. ఆ నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకుని, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో రాంపూర్ కోర్టు నఖ్వీకి ఏడాది జైలుశిక్ష విధించింది. అయితే వెంటనే కేంద్ర మంత్రి నఖ్వీకి బెయిల్ కూడా మంజూరుచేసింది. -
ముస్లిం నివాస ప్రాంతాల్లో సాంకేతిక శిక్షణ సంస్థలు
కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సాక్షి, హైదరాబాద్: దేశంలోని ముస్లిం నివాస ప్రాంతాల్లో పాలిటెక్నిక్, ఐటీఐ లాంటి సాంకేతిక శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ముక్తార్‌అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. శుక్రవారం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో 17 ఫౌండేషన్ డేలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సంస్థల్లో సాంకేతిక శిక్షణ పొందిన ముస్లిం యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉర్దూ దేశ సంస్కృతి అనీ, దీన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మదర్సాల్లో ఆధ్యాత్మిక బోధనతోపాటు ఉర్దూ పాఠశాలల్లో ఆంగ్లం, హిందీ సబ్జెక్ట్‌ల్లో కూడా విద్యనందించాలని ఆయన కోరారు. మైనారిటీల సాధికారత, అభివృద్ధికి కేంద్రం కృషి దేశంలోని మైనారిటీల సాధికారిత, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మైనారిటీలు విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు వెళ్లేందుకు తాము కృషి చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని పర్యాటక భవన్లో శుక్రవారం మైనారిటీ సంక్షేమంపై డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో 50శాతానికి పైగా మైనారిటీలు దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారని చెప్పారు. మైనారిటీలు ఎదిగేందుకు కేంద్రప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల రక్షణకు చర్యలు చేపడుతామన్నారు. ఏ మతం చాంపియన్ అనే చర్చ అనవసరం పుట్టుకతో అందరూ ముస్లింలేనని ఇటీవల ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నఖ్వీ నిరాకరించారు. ఏ మతం చాంపియన్ అనే అంశం జోలికి తాను వెళ్లనని, ఎవరూ మాట్లాడకూడదన్నారు. ఘర్ వాపసీ, లవ్ జిహాదీలకు కేంద్రం వ్యతిరేకమని చెప్పారు. టైస్టులకు సాయపడేలా పాకిస్తాన్ తీసుకునే చర్యలు గర్హనీయమన్నారు. టైస్టు లక్వీకి బెయిల్ ఇవ్వడాన్ని తప్పు పట్టారు. తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అడిగిన ప్రశ్నకు అది రాష్ట్రాల అంశమని నఖ్వీ దాటవేశారు. -
మరోసారి కేంద్రమంత్రిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
హిందూ సైద్దాంతిక విధానాలు, ఆశయాలు, లక్ష్యాలున్న బీజేపీలో షియా మతస్తుడైన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జాతీయ ఉపాధ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుఢి హోదాలో, అధికార ప్రతినిధిగా పార్టీకి సేవలందిస్తున్నారు. జననం: 1957 అక్టోబర్ 15 తేదిన ఉత్తరప్రదేశ్ లో అలహాబాద్ లోని షియా ముస్లింల కుటుంబంలో జన్మించారు. ఆయనకు భార్య సీమా నఖ్వీ, ఓ కుమారుడు ఉన్నారు. విద్యాభ్యాసం: అలహాబాద్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు. నఖ్వీ జీవితంలో కీలక ఘట్టాలు: 1975-77 సంవత్సరాల మధ్య అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినపుడు జైలు జీవితాన్ని అనుభవించారు. 1980లో జనతపార్టీ అభ్యర్థిగా అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేశారు. 1989లో ఆయోధ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటి. 1991, 1993 లో మావ్ అసెంబ్లీకి ఎన్నిక 1998లో రాంపూర్ నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నిక 1998లో వాజ్ పేయి ప్రభుత్వ హాయంలో సమాచార, ప్రసార శాఖామంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలందించారు. 2010లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక ఇతర బాధ్యతలు: ఆర్ధిక కమిటి సభ్యుడిగా.. వాణిజ్య కమిటి సభ్యుడిగా, వక్ఫ్ బోర్డు జాయింట్ కమిటి సభ్యుడిగా ఐటీ కమిటి మెంబర్ గా రచయితగా 1991లో సైయా, 1998లో దాంగా అనే పుస్తకాల్ని రచించారు. -
భూటాన్ బయలుదేరిన ప్రణబ్
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం భూటాన్ బయలుదేరి వెళ్లారు. పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రణబ్‌కు వీడ్కోలు పలికారు. రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా, బీజేపీ సీనియర్ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీతోపాటు నలుగురు ఎంపీలు ప్రణబ్ వెంట భూటాన్ పయనమైనవారిలో ఉన్నారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యెల్ వాంగ్‌చుక్ ఆహ్వానంపై ప్రణబ్ ఆ దేశం వెళ్లారు. దాదాపు 26 ఏళ్లలో తొలిసారిగా ప్రణబ్ భూటన్లో పర్యటిస్తున్నారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ మొట్టమొదటిగా భూటన్లో పర్యటించిన సంగతి తెలిసిందే. -
నేతల 'ప్రేమ యుద్ధం'
పొలిటికల్ లీడర్స్ ప్రేమ యుద్ధం చేస్తున్నారు. పరస్పరం ప్రేమ ఎక్కువైపోయి ప్రేమ యుద్ధం చేస్తున్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే. నేతాశ్రీ అందరూ విసురుకుంటున్నది ప్రేమాస్త్రాలు కాదు 'లవ్ జిహాద్'పై ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఉత్తరప్రదేశ్ లో పుట్టిన ప్రేమ యుద్ధం ఇప్పుడు దేశమంతటా పాకింది. అన్ని పార్టీల నాయకులు 'లవ్ వార్' లోకి దూకారు. సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వమే 'లవ్ జిహాద్'ను ప్రోత్సహిస్తోందని కమలనాథులు కయ్యిమనడంతో జగడం మొదలయింది. ప్రేమ పేరుతో హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారని యోగి ఆదిత్యనాథ్ లాంటి కాషాయ నేతలు ఆరోపించడంతో వివాదం రేగింది. ఇక అక్కడి నుంచి మీరంటే మీరంటూ ఏలుబడిదారులు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా సమాజ్‌వాది పార్టీ వివాదస్పద నాయకుడు అజంఖాన్ ఈ గోదాలోకి దూకారు. లవ్ జిహాద్ కు అర్థం చెప్పాలంటే కాషాయ నేతలను ప్రశ్నించారు. బీజేపీ పార్టీలో ఉన్న చాలా మంది మైనారిటీ నాయకులు హిందూ మహిళలను పెళ్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీజేపీ అగ్రనేతలు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, షాహనాజ్ హు్స్సేన్ సతీమణులు హిందూ మతానికి చెందిన వారని తెలిపారు. లవ్ జిహాద్ అర్థం ఏమిటో నఖ్వీ, హుస్సేన్ చెబితే బాగుంటుందన్నారు. లవ్, జిహాద్- ఈ రెండు పదాలు పవిత్రమైనవని చెప్పారు. రెండు వేర్వేరు మతాలకు చెందిన వారు పెళ్లి చేసుకుని కలిసి జీవిస్తే తప్పేంలేదని ఉద్ఘాటించారు. అయితే షాహనాజ్ హుస్సేన్ భార్య రేణు, నఖ్వీ సతీమణి సీమలకు రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేదు. వీరిద్దరూ గృహిణులు. ప్రేమ యుద్ధం ఇప్పుడూ పొలిటికల్ ఫ్యామిలీలకు పాకింది. ఇంకా ఎంతదాకా పోతుందో? -
చవాన్ విషయంలో జోక్యం చేసుకోం: సుప్రీం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు ఎన్నికల సంఘం(ఈసీ) ఆయనకు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన వ్యహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 15 రోజుల్లో ఈ వ్యవహారం తేల్చాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. చట్టప్రకారమే ఈ విషయంలో హైకోర్టు ముందుకెళుతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. బీజేపీ నాయకులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కిరిట్ సోమయ్యలతో పాటు మరో స్వతంత్ర సభ్యుడు చవాన్ వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. -
అశోక్ చవాన్ కు ఊరట
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు ఊరట లభించింది. ఎన్నికల సంఘం(ఈసీ) ఆయనకు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. బీజేపీ నాయకులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కిరిట్ సోమయ్యలతో పాటు మరో స్వతంత్ర సభ్యుడికి కోర్టు నోటీసులు జారీ చేసింది. చవాన్ వ్యతిరేకంగా ఎన్నికల సంఘానికి వీరు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలకు అనుగుణంగా తన ఎన్నికల ప్రచార వ్యయం వివరాలను ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొంటూ ఎన్నికల సంఘం జూలై 13న చవాన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. జవాబిచ్చేందుకు 20 రోజుల గడువిచ్చింది. -
ప్రతిదానికి మోడీని నిందిస్తే ఎలా?
గువాహటి: అస్సాంలోని బోడో ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతుండగానే రాజకీయ నాయకులు పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. బీజేపీ నడుపుతున్న విద్వేష రాజకీయాల ఫలితమే బోడో ప్రాంతంలో జరిగిన హింసాకాండ అని కాంగ్రెస్ నాయకలు మీమ్ అఫ్జాల్ వ్యాఖ్యానించారు. కేంద్రం, అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ గుర్తు చేశారు. ప్రతిదానికి అనవసరంగా నరేంద్ర మోడీని నిందించడం సరికాదని అన్నారు. అసోంలో జరిగిన హింసాకాండ దురదృష్టకరమని, ఖండించదగినదని చెప్పారు. రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడానికి ఇది సమయం కాదన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ అన్నారు. పరస్పరం నిందించుకోవడం మానేసి బాధితులకు భరోసా కల్పించాలని ఆయన సూచించారు. కోక్రాఝర్, బక్సా మారణహోమంపై అస్సాం సీఐడీ విభాగం దర్యాప్తు చేపట్టింది. కోక్రాఝర్, బక్సా జిల్లాల్లో తీవ్రవాదులు మైనారిటీ వర్గాల ఇళ్లలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 32 మంది మృతి చెందారు. -
కాంగ్రెస్ ఓటమి ఖరారు
* దేశవ్యాప్తంగా ఇంకా ఎన్నికలు ముగియకముందే ఆ పార్టీ దీన్ని గుర్తించింది: బీజేపీ నేత నఖ్వీ * మూడో కూటమికి మద్దతు వ్యాఖ్యలు ఇందులో భాగమే * ఫలితం తెలిసిపోవడంతో మోడీపై ప్రేలాపనలు * ఎన్డీఏ 350కి పైగా సీట్లు సాధిస్తుంది సాక్షి, హైదరాబాద్: ఇంకా పోలింగ్ ముగియకున్నా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమి ఖరారైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. ఈ విషయం ఆ పార్టీ కూడా గుర్తించిందని, అందుకే దాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీ నేతలు బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై అభ్యంతరకర భాషలో విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తికాకుండానే మూడో కూటమికి మద్దతు గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారంటే ఆ పార్టీ ఓడిపోతోందనే విషయాన్ని వారు ప్రజలకు చెప్పకనే చెబుతున్నారని నఖ్వీ అన్నారు. ఈ చారిత్రాత్మక ఎన్నికల్లో ‘జీడీపీ’ ప్రధాన భూమికను పోషిస్తోందని చెబుతూ... జి అంటే గుడ్‌గవర్నెన్స్, డి అంటే డెవలప్మెంట్, పి అంటే ప్రాస్పెరిటీగా అభివర్ణించారు. యూపీఏ పదేళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే పది పనులు కూడా సాగని తరుణంలో దేశం బాగా వెనుకబడిందని జనం గుర్తించారని ఆయన చెప్పారు. దీంతో మోడీ ప్రధాని అయితేనే దేశ పురోగతి సాధ్యమనే విషయాన్ని కులమతాలకతీతంగా ప్రజలు గుర్తించారని కూడా నఖ్వీ తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్‌ను దివాళాకోరు పార్టీ అని ఆయన అభివర్ణించారు. మతిచలించి మాట్లాడుతున్న సోనియా, రాహుల్, ప్రియాంక సహా ఆ పార్టీ సీనియర్ నేతల కోసం మంచి వైద్యుల బృందాన్ని సిద్ధం చేసుకుంటే బాగుంటుందని నఖ్వీ ఎద్దేవా చేశారు. మోడీ కోసం ముందుకు వస్తున్న ప్రజలను కిరాయి మనుషులుగా పేర్కొనడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సాధారణ ప్రజలను అవమానపరుస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే ఆ పార్టీని ఓడించి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారని నక్వీ తెలిపారు. నఖ్వీ ఇంకా ఏమన్నారంటే.... * ఎన్నికలు పూర్తయిన 350 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమి స్పష్టమయింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్డీఏ 350పైగా సీట్లతో ఘనవిజయం సాధిస్తుంది. * ఎన్నికలప్పుడే మైనార్టీల జపంచేసే పార్టీలకు బుద్ధి చెప్పడానికి ముస్లింలు పెద్దసంఖ్యలో మోడీకి అనుకూలంగా ఓటేస్తున్నారు. * మోడీని ఎవరెక్కువ తిడతారో అనే ఓ ఫ్యాషన్ పరేడ్ పోటీ జరుగుతోంది. రాహుల్, ప్రియాంక, ములాయం, కేసీఆర్ తదితరులు అందులో పాల్గొంటున్నారు. వీరంతా రాజకీయంగా, నైతికంగా పతనమవుతున్నారు. * హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం పార్టీకి రాజ్యాంగంపై నమ్మకం లేదు. నిత్యం దాన్ని అవమానిస్తోంది. * ఇలాంటి రాజకీయ పార్టీలతోనే దేశం తీవ్రంగా నష్టపోతోంది, బీజేపీది అభివృద్ధితో కూడిన సెక్యులర్ విధానం. * పదేళ్లుగా ఎన్నో కుంభకోణాలకు 10 జన్‌పథ్ (సోనియా నివాసం) కేంద్రబిందువుగా మారింది. * డిప్యుటేషన్ ప్రధానిగా మన్మోహన్ ఉంటే, సూపర్ ప్రధానిగా సోనియా వ్యవహరించి దేశాన్ని నాశనం చేశారు. * కాంగ్రెస్ హయాంలోనే దేశంలో ఎక్కువ మతకలహాలు జరిగాయి. కమ్యూనల్షీట్ తెరిస్తే అది కాంగ్రెస్ పేరిటే ఉండాలి. -
నఖ్వీ నివాసం ఎదుట సాబీర్ భార్య హైడ్రామా
బీజేపీ నేత ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ నివాసం ముందు జేడీ(యూ) బహిషృత నేత సాబిర్ ఆలీ సతీమణి యాస్మిన్ హైడ్రామా సృష్టించారు. టెర్రిరిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణలు చేసిన నఖ్వీ క్షమాపణలు చెప్పాలంటూ యాస్మీన్ ధర్నా చేపట్టారు. న్యాయం జరిగేంత వరకు నఖ్వీ నివాసం ముందే కూర్చుంటాను. చేసిన ఆరోపణల్ని నఖ్వీ రుజువు చేయాలి లేదా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. సాబీర్ ఆలీ నివాసంలోనే భత్కల్ ను అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే భత్కల్ ఎక్కడ అరెస్ట్ చేసిందనే విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల సాబీర్ అలీ బీజేపీలో చేరడంపై ఆపార్టీకే చెందిన నఖ్వీ అభ్యంతరం చెప్పారు. భత్కల్ స్నేహితుడు సాబీర్ బీజేపీలో చేరారు. త్వరలోనే దావుద్ ను చేర్చకుంటారా? అంటూ ట్విటర్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా సాబీర్ కు టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపించారు. స్వంత పార్టీ నుంచే సాబీర్ ను చేర్చుకోవడంపై నిరసనలు వ్యక్తం కావడంతో ఇచ్చిన సభ్యత్వాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలపై నఖ్వీపై సాబీర్ ఆలీ పరువు నష్టం దావా కేసు నమోదు చేశారు. -
బిజెపిలో ముస్లిం నేత చేరిక వాయిదా
బిజెపిలో జనతాదళ్ యునైటెడ్ ఎంపీ సాబిర్ అలీ చేరిక వివాదం రోజుకో ట్విస్టు, గంటకో షాకుగా తయారైంది. తన పై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గుతేలిన తరువాతే తాను పార్టీలో చేరతానని, అంతవరకూ తన సభ్యత్వాన్ని పెండింగ్ లో పెట్టమని సాబిర్ అలీ బిజెపిని కోరారు. బిజెపి ముస్లిం నేత ముఖ్తార్ అబ్బాస్ నక్వీ సాబిర్ ను ఇండియన్ ముజాహిదీన్ సానుభూతిపరుడని, ఉగ్రవాది భత్కల్ కి ఆశ్రయం ఇచ్చాడని ఆరోపించారు. ఆ తరువాత బిజెపి నేతలు ఒక్కొక్కరుగా సాబిర్ చేరికపై గళం విప్పారు. అయోధ్య ఉద్యమ నేత వినయ్ కటియార్ కూడా సాబిర్ చేరికను తప్పుపట్టారు. సాబిర్ మొదటి నుంచీ నరేంద్ర మోడీని గట్టిగా వ్యతిరేకిస్తున్న ముస్లిం నేతలలో ఒకరు. ఆయన ఉన్నట్టుండి మోడీని పొగడటంతో ఆయన్ని జెడీయూ పార్టీనుంచి బహిష్కరించింది. అయితే ఇప్పుడు ఆయన తన చేరికను వాయిదా వేసుకున్నారు. (బీజేపీ దావూద్‌నూ చేర్చుకుంటుందా?) అటు హిందూ అతివాది ప్రమోద్ ముతాలిక్ చేరిక, ఇటు ముస్లిం అతివాది సాబిర్ చేరిక విషయంలో భారీ ఎత్తున విమర్శలు రావడంతో బిజెపి ఇరకాటంలో పడింది. రెండు చేరికలూ వాయిదాపడ్డాయి. -
సాబీర్ ఆలీ తర్వాత దావూద్ ను చేర్చుకుంటారా?: నఖ్వీ
న్యూఢిల్లీ: బీజేపీలో మొజాహిద్దీన్ టెర్రిరిస్ట్ గ్రూప్ కు చెందిన యాసిన్ భత్కల్ స్నేహితుడు సాబీర్ ఆలీ చేరిక అగ్గి రాజేస్తోంది. బీజేపీలో సాబీర్ ఆలీ చేరికపై మెజార్టీ పార్టీ నేతలు వ్యతిరేకించడం చర్చనీయాంశమైంది. టెర్రిరిస్ట్ భత్కల్ స్నేహితుడు బీజేపీలో చేరాడు. త్వరలో దావుద్ ను కూడా చేర్చుకుంటారేమో అని పార్టీ ఉపాధ్యక్షుడు ముఖ్తర్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. అంతేకాకుండా పార్టీ చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని నఖ్వీ నిలదీయడం అగ్ర నాయకత్వానికి మింగుడు పడటం లేదు. సాబీర్ ఆలీని పార్టీలోకి ఆహ్వానించడంపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మరో నేత బల్బీర్ పంజ్ సూచించారు. పార్టీ నిర్ణయం లక్షలాది మంది కార్యకర్తల్ని షాక్ గురి చేసిందన్నారు. సాబీర్ ఆలీ లాంటి వ్యక్తులు పార్టీలో చేరడం వలన కార్యకర్తల మనోభావాలు దెబ్బ తింటాయని మరో నేత రామేశ్వర్ చౌరాసియా అన్నారు. అయితే సాబీర్ పై పెరుగుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాలంటే అందర్ని కలుపుకుపోవాలని ఆయన సూచించారు. కీలక ఎన్నికల సమయంలో సాబీర్ ఆలీ చేరికపై ఇతర పార్టీలు పెద్దగా స్పందించకపోయినా.. బీజేపీ నేతలే వివాదస్పదం చేయడం చర్చనీయాంశమవుతోంది. -
సబీర్ చేరికపై నక్వీ ఫైర్
బీజేపీ దావూద్‌నూ చేర్చుకుంటుందని ఎద్దేవా న్యూఢిల్లీ: శ్రీరామ్‌సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ను చేర్చుకుని గంటల్లోనే బయటకు పంపిన ఉదంతాన్ని మరవకముందే బీజేపీలో అలాంటి మరో వివాదం రాజుకుంది. జేడీయూ బహిష్కృత నేత సబీర్ అలీని కమలదళంలో చేర్చుకోవడంపై పార్టీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ ఆగ్రహోదగ్రులయ్యారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్‌కు అలీ స్నేహితుడని, ఇక పార్టీలో చేరబోయే తదుపరి వ్యక్తి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీమ్ కావొచ్చని స్వపక్షాన్ని ఎగతాళి చేశారు. అలీని చేర్చుకోవడం తప్పని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని తప్పు దిద్దుకోవాలని డిమాండ్ చేశారు. అలీ శుక్రవారం అట్టహాసంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న గంటల్లోనే నక్వీ పార్టీపై నిప్పులు చెరిగారు. ‘ఉగ్రవాది భత్కల్ మిత్రుడు బీజేపీలో చేరారు. త్వరలో దావూద్‌నూ చేర్చుకుంటారు’ అని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అలీ చేరిక తనకు బాధ కలిగించిందని, ఈ విషయాన్ని పార్టీకి చెప్పానని తర్వాత విలేకర్లతో అన్నారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న బీజేపీ, ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తిని చేర్చుకోవడాన్ని ఎలా సమర్థిస్తుందని నిలదీశారు. ముంబైలోని అలీ ఇంట్లోనే భత్కల్ అరెస్టయ్యాడని, సంగీత వ్యాపారదిగ్గజం గుల్షన్ కుమార్ హత్య కేసులో అలీ పేరు ఉందని చెప్పారు. ‘పార్టీ ఒక హిందుత్వ నేతను (ముతాలిక్) గంటల్లోనే బయటకు పంపినప్పుడు ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తిని ఎలా సహించగలం?’ అని అన్నారు. అలీ చేరిక గురించి పార్టీ చీఫ్ రాజ్‌నాథ్‌సింగ్‌కు తెలియదని చెప్పారు. కాగా, పార్టీ బీహార్ కమిటీ సిఫార్సుపైనే అలీని చేర్చుకున్నామని, అతని పూర్వాపరాలు విచారించి తదుపరి చర్య తీసుకుంటామని బీజేపీ ప్రతినిధి సుధాంశు త్రివేదీ తెలిపారు. విమర్శల నేపథ్యంలో అలీని చేర్చుకోవాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అలీ చేరికను ఆరెస్సెస్ కూడా వ్యతిరేకించింది. రాజ్‌నాథ్‌కు నిరసన తెలిపింది. బీజేపీ కొత్తవారిని చేర్చుకోవడంపై పార్టీ సీనియర్ నేత బహిరంగంగా విమర్శకు దిగడం గత కొన్ని రోజుల్లో ఇది రెండోసారి. బీఎస్సార్ కాంగ్రెస్ నేత బి.శ్రీరాములును చేర్చుకోవడాన్ని సుష్మా స్వరాజ్ వ్యతిరేకించడం తెలిసిందే. -
‘లోక్‌సభ’పై అసెంబ్లీ ప్రభావం: రషీద్ అల్వీ
న్యూఢిల్లీ: నవంబర్-డిసెంబర్ నెలల్లో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ సాధారణంగా స్థానిక సమస్యలపై ఆధారపడి ఉంటుందని, అయితే, ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలకు దగ్గర్లో ఉన్నాయని ఆయన అన్నారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో నవంబర్ 11 నుంచి డిసెంబర్ 4 మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఢిల్లీ, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనలో ఉండగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు బీజేపీ పాలనలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్, బీజేపీల నడుమనే ప్రధానంగా పోటీ ఉంటుంది. అయితే, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కొత్తగా ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక శక్తిగా పుంజుకుంది. మరోవైపు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కీలకమైనవేనని బీజేపీ కూడా అంగీకరించింది. అయితే, కేంద్రంలోని యూపీఏ సర్కారు అవినీతి, దుష్పరిపాలన కూడా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని బీజేపీ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి ముఖ్య ప్రచారాంశం కాగలదని సీపీఐ నేత డి.రాజా అన్నారు.