'వివాదాలొద్దని వెంకయ్య చెప్పారు'
న్యూఢిల్లీ: వివాదాలకు దూరంగా ఉండాలని వెంకయ్య నాయుడు తమకు ఉద్బోధించారని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఈ ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు ప్రయోగించే భాష పట్ల నియంత్రణ కలిగివుండాలని, వివాదస్పద వ్యాఖ్యలు చేయొద్దని సమావేశంలో వెంకయ్య విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. బీజేపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే, ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి ఎజెండాపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని పేర్కొన్నట్టు తెలిపారు.
ఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, మత అసహనంపై రాజకీయ చర్చల గురించి సమావేశంలో చర్చించినట్టు వెల్లడించారు. లోక్ సభలో మత అసహనంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.