
ఢిల్లీ : రంజాన్ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పేర్కొన్నారు. నఖ్వీ గురువారం అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. రంజాన్ మాస సమయంలో ముస్లిం సోదరులంతా ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేయాలని కోరారు. ఏడు లక్షల మసీదులు, ధార్మిక సంస్థల నేతలతో కలిసి పని చేయాలని వక్ఫ్ బోర్డులను ఆదేశించారు.
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా భారత్ సహా ప్రపంచమంతా కరోనా బారినుంచి విముక్తి పొందేలా ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. దయచేసి కరోనా బాధితుల కోసం పోరాటం చేస్తున్న హెల్త్ వర్కర్స్, డాక్టర్లు, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దన్నారు. నిజాయితీగా వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించేలా వక్ఫ్ బోర్డులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని నఖ్వీ తెలిపారు. (కరోనా నియంత్రణకు రెండు వ్యూహాలు)
Comments
Please login to add a commentAdd a comment