ముక్తార్ అబ్బాస్ నఖ్వీ(ఫైల్)
న్యూఢిల్లీ: తమ పార్టీ, సోనియా గాంధీపై విమర్శలు చేసిన కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. నఖ్వీ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసం ఆయన విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ ఆదివారం ధ్వజమెత్తారు.
శనివారం కాన్పూర్ లో మాట్లాడుతూ సోనియా గాంధీపై నఖ్వీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ లో ఒక మతానికి చెందిన తీవ్రవాది చనిపోతే ఆ రాత్రంతా సోనియా గాంధీ నిద్రపోలేదని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చెప్పిన విషయాన్ని నఖ్వీ గుర్తు చేశారు.