Batla House encounter
-
‘ఉగ్రవాదుల మృతిపై సోనియా గాంధీ కన్నీరు పెట్టుకున్నారు’
పట్నా: 2008లో జరిగిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల మరణంపై కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బిహార్‌లోని మధుబని ర్యాలీలో పాల్గొన్న నడ్డా కాంగ్రెస్‌పై మండిపడ్డారు.‘బాట్లా ఎన్కౌంటర్ సమయంలో ఉగ్రవాదులు మరణిస్తే.. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ కన్నీరు పెట్టుకున్నారని ఆ పార్టీ నేతలు అన్నారు. ఆమె ఉగ్రవాదుల కోసం ఏడ్చారు. ఉగ్రవాదులతో ఏం సంబంధం ఉంది?. ఉగ్రవాదులపై సానుభూతి చూపాల్సిన కారణం ఏంటి? ఉగ్రవాదులతో ఉన్న లింక్ ఏంటి?. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి దేశాన్ని బలహీనపరిచేందుకు దేశ వ్యతిరేకులకు మద్దతగా నిలుస్తుంది. దేశాన్ని బలహీనపరిచే వారిపట్ట కాంగ్రెస్ పార్టీ సానుభూతి ప్రదర్శిస్తుంది. ఇండియా కూటమి ఒక అహంకారపూరితమై కూటమి. అటువంటి కూటమికి మీరు (ప్రజలు) మద్దతు పలుకుతారా?’ అని నడ్డా అన్నారు.2008లో బాట్లా హౌస్ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఢిల్లీ పోలీసు ఇన్స్పెక్టర్ మోహన్ శర్మా, ఇద్దరు ఉగ్రవాదలు మరణించారు. 2012 ఎన్నికల సమావేశంలో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యల గుర్తు చేస్తూ జేపీ నడ్డా.. సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు.‘బాట్లా ఎన్కౌంటర్ జరిగిన సమయంలో నేను మంత్రిని కాదు. అయితే ఆ ఎన్కౌంటర్ విషయంలో సానియా గాంధీ కన్నీరు పెట్టుకున్నారు’ అని సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. అదే సమయంలో మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలను ఖండించారు. ‘సోనియా గాంధీ కన్నీరుపెటుకోలేదు. సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు ఆయన సొంతంగా అనుకున్నవి మాత్రమే’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఈ విషయంపై జేపీ నడ్డా వ్యాఖ్యలు చేయటంతో మళ్లీ తెరపైకి వచ్చింది. -
బాట్లాహౌస్ కేసు: అరిజ్‌ఖాన్‌కు ఉరిశిక్ష
న్యూఢిల్లీ: 2008 నాటి బాట్లాహౌస్ ఎన్కౌంటర్ కేసులో అరిజ్ ఖాన్‌కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు ఇన్స్పెక్టర్ మోహన్‌చంద్ శర్మను చంపినందుకు అతడికి ఈ శిక్షను ఖరారు చేసింది. అరిజ్ చేసిన నేరం గరిష్ట శిక్ష విధించేందుకు వీలు కల్పించే అత్యంత అరుదైన కేటగిరీలోకి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. అతడిని మరణించే వరకూ ఉరికి వేలాడదీయాలని అదనపు సెషన్స్ జడ్జి సందీప్ యాదవ్ తన తీర్పులో పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో అరిజ్ ఖాన్‌కు మొత్తం రూ.11 లక్షల జరిమానా విధించారు. రూ.10 లక్షలను తక్షణమే మోహన్‌చంద్ శర్మ కుటుంబానికి అందజేయాలని ఆదేశించింది. న్యాయాన్ని కాపాడే అధికారిని చంపేశారు బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఢిల్లీ పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.టి.అన్సారీ వాదనలు వినిపించారు. అరిజ్ ఖాన్‌కు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నాయని చెప్పారు. న్యాయాన్ని కాపాడే ఒక అధికారిని చంపిన అరిజ్ ఖాన్‌కు మరణ శిక్ష విధించాలని కోరారు. ఇన్స్పెక్టర్ మోహన్‌చంద్ శర్మ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. అరిజ్ ఖాన్‌తోపాటు మరికొందరు ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే మారణాయుధాలతో విచ్చలవిడిగా కాల్పులు జరిపారని గుర్తుచేశారు. అరిజ్ ఖాన్ తరపున అడ్వొకేట్ ఎం.ఎస్.ఖాన్ వాదనలు వినిపించారు. అరిజ్‌కు ఉరిశిక్ష విధించాలన్న వాదనను వ్యతిరేకించారు. అతడు ముందస్తు ప్రణాళిక ప్రకారం కాల్పులు జరపలేదన్నారు. ఎం.ఎస్.ఖాన్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో ట్రయల్ కోర్టు 2013 జూలైలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది షాజాద్ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఏమిటీ కేసు? ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులు బాట్లా హౌస్‌లో దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు వారిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. పోలీసులపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇన్స్పెక్టర్ మోహన్‌చంద్ శర్మ అమరులయ్యారు. ►2008 సెప్టెంబర్ 13: ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు. 39 మంది మృతి, 159 మందికి గాయాలు. ►2008 సెప్టెంబర్ 19: దక్షిణ ఢిల్లీలోని జామియా నగర్లో ఉన్న బాట్లా హౌస్‌లో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు. ►2009 జూలై 3: అరిజ్ ఖాన్, షాజాద్ అహ్మద్‌ను నిందితులుగా ప్రకటించిన న్యాయస్థానం. ► 2010 ఫిబ్రవరి 2: యూపీలోని లక్నోలో షాజాద్ అహ్మద్ అరెస్టు. ►2010 అక్టోబర్ 1: ఎన్కౌంటర్ కేసు విచారణ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ. ►2013 జూలై 30: షాజాద్ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు. ►2018 ఫిబ్రవరి 14: అరిజ్ ఖాన్ అరెస్టు. ►2021 మార్చి 8: హత్య, ఇతర నేరాల్లో అరిజ్ ఖాన్ దోషిగా గుర్తింపు. ►2021 మార్చి 15: అరిజ్‌కు మరణ శిక్ష -
సోనియా నివాసం వద్ద బీజేపీ నిరసన
న్యూఢిల్లీ : బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌పై బిజెపి సోమవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసం ముందు, ఎఐసిసి కార్యాలయం ఎదుట భారీ ప్రదర్శన చేపట్టింది. వందలాది బిజెపి కార్యకర్తలు సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ఢిల్లీలో 2008లో జరిగిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్ లో తప్పించుకున్న ఉగ్రవాది మొహమ్మద్ సాజిద్ అలియాస్ బడా సాజిత్ ఇటీవల ఇస్లామిక్ స్టేట్ విడుదల చేసిన వీడియోలో కనిపించాడు. ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం ఐఎస్ఐఎస్ విడుదల చేసిన 22 నిముషాల వీడియోలో కనిపించిన ఇద్దరిలో ఒకరు సాజిద్. అయితే ఎన్‌కౌంటర్‌కు కొద్ది ముందు అక్కడి నుండి తాను పారిపోయానంటూ అతడు ఆ వీడియోలో చెప్పడంతో మరోసారి బాట్లా ఎన్ కౌంటర్ తెర మీదకు వచ్చింది. ఆ ఎన్కౌంటర్ నిజమని నాటి హోంమంత్రి చిదంబరం స్పష్టత ఇస్తే, మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ భిన్న వైఖరిని వ్యక్తం చేశారు. దమ్ముంటే బీజేపీ తాజాగా విచారణ జరిపి అసలు నిజాలను వెలికి తీయాలని, లేదంటే జాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
'మతిస్థిమితం కోల్పోయిన అబ్బాస్'
న్యూఢిల్లీ: తమ పార్టీ, సోనియా గాంధీపై విమర్శలు చేసిన కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. నఖ్వీ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసం ఆయన విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ ఆదివారం ధ్వజమెత్తారు. శనివారం కాన్పూర్ లో మాట్లాడుతూ సోనియా గాంధీపై నఖ్వీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ లో ఒక మతానికి చెందిన తీవ్రవాది చనిపోతే ఆ రాత్రంతా సోనియా గాంధీ నిద్రపోలేదని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చెప్పిన విషయాన్ని నఖ్వీ గుర్తు చేశారు.