Ajoy Kumar
-
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్!
రాంచి : ఇప్పటికే నాయకత్వ లేమి, ఆర్టికల్ 370 రద్దు విషయంలో నాయకుల వ్యాఖ్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తోటి నాయకుల అవినీతిని భరించలేకపోతున్నానంటూ జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. స్వప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడుతున్నారంటూ మండిపడ్డారు. నేరస్తుల కంటే నీచంగా ప్రవర్తిస్తున్న పార్టీ సభ్యులతో వేగలేనని.. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా రాహుల్ గాంధీ సహా పలువరు సీనియర్ నాయకులకు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం అజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ‘ నేను అవినీతిని అస్సలు సహించను. కాబట్టి నా రాజీనామాను ఆమోదించండి. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను. గతంలో అధికార పార్టీగా, ప్రతిపక్షంగా ప్రజల మన్ననలు అందుకున్నాం. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. కేవలం అధికారం కోసం కొంతమంది కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు టికెట్లను అమ్ముకుంటున్నారు. ఎన్నికల పేరు చెప్పి బాగా సొమ్ము చేసుకుంటున్నారు. యువకుడిగా ఉన్న సమయంలోనే ప్రతిష్టాత్మక పతకాలు అందుకున్న పోలీసు అధికారిగా నేను వీటిని సహించలేను. నా ఉద్యోగ జీవితంలో చూసిన ఎంతో మంది దిగజారిన, కరడుగట్టిన నేరస్తుల కంటే వీరు హీనంగా ఉన్నారు. వారి విధానాలు మార్చుకోమని ఎంతగానో చెప్పిచూసినా లాభం లేకపోయింది.ఇక బాధ్యతల నుంచి తప్పుకోవడమే సరైన నిర్ణయం అనిపించింది. అందుకే రాజీనామా చేస్తున్నా అని అజయ్ కుమార్ సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో పొత్తుల విషయంలో, సమర్థులకు టికెట్లు ఇవ్వడంలో నిజాయితీగా వ్యవహరించాలనుకుంటే వారంతా మోకాలు అడ్డారు’ అని ఆరోపించారు. అయితే పార్టీలో కొంతమంది నిజాయితీగానే ఉన్నారని, వారి పట్ల తనకు గౌరవభావం ఉంటుందన్నారు. కాగా అజయ్ కుమార్ గతంలో పోలీసు అధికారిగా విధులు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్‌సభ ఎంపీగా పనిచేశారు. -
నోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు అనేది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఏఐసీసీ అధికార ప్రతినిధి అజోయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇది పేటిఎం వంటి చెల్లింపు సంస్థల స్కామ్ గా ఆయన అభివర్ణించారు. అవినీతి, నకిలీ నోట్ల నిర్మూలన, టెర్రర్ ఫైనాన్సింగ్‌లకు అడ్డుకట్ట వంటి లక్ష్యాలు పెద్దనోట్ల రద్దు వల్ల సాధ్యం కాలేదని తెలిపారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రధాని మోదీ క్యాష్ లెస్ సొసైటీ అంటూ కొత్తడ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. సర్కస్‌లో రింగు మాస్టర్లా మోదీ వ్యవహరిస్తున్నారన్నారు. క్యాష్ లెస్ విధానంతో పేటిఎం వంటి చెల్లింపు సంస్థలకు వేలకోట్లు దోచిపెట్టాలని మోదీ చూస్తున్నారని అజోయ్ కుమార్ నిప్పులు చెరిగారు. పెద్దనోట్ల రద్దుకు ముందు, తర్వాత బీజేపీ నేతలు పెద్ద మొత్తంలో బ్యాంకులో డిపాజిట్లు చేసి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ఆరోపించారు.అమిత్ షా డైరెక్టర్‌గా ఉన్న బ్యాంకులో రూ.500కోట్లు డిపాజిట్ అయిన అంశం పై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పలువురు బీజేపీ నేతలు, ఆ పార్టీ శాఖలు చేసిన భూ లావాదేవీలు, డిపాజిట్లు చూస్తుంటే మనీ లాండరింగ్ స్కామ్‌ను తలపిస్తోందన్నారు.సహారా, ఆదిత్య బిర్లా, సుధామ్షు సంస్థల నుంచి మోదీకి ముడుపులు ముట్టాయన్న రాహుల్ గాంధీ ఆరోపణలపై జోక్‌లు వేయడం కాకుండా సమాధానం చెప్పాలని అజోయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆర్థికవేత్తలంతా మోదీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రంగాలకు నష్టం కలిగించేలా జరుగుతున్న మోదీ పాలనా తీరు ప్రజల్లో ఎండగట్టి మోదీని వెంటాడుతామన్నారు. -
'మతిస్థిమితం కోల్పోయిన అబ్బాస్'
న్యూఢిల్లీ: తమ పార్టీ, సోనియా గాంధీపై విమర్శలు చేసిన కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. నఖ్వీ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసం ఆయన విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ ఆదివారం ధ్వజమెత్తారు. శనివారం కాన్పూర్ లో మాట్లాడుతూ సోనియా గాంధీపై నఖ్వీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ లో ఒక మతానికి చెందిన తీవ్రవాది చనిపోతే ఆ రాత్రంతా సోనియా గాంధీ నిద్రపోలేదని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చెప్పిన విషయాన్ని నఖ్వీ గుర్తు చేశారు.