
సీనియర్ నేతలు, కేంద్ర మంత్రి, మాజీ మంత్రులకు బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. తాజాగా బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడదల చేసిన విషయం తెలిసిందే. 18 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్‌కు అవకాశం కల్పించారు. ఇక, జూన్ 10న మొత్తం 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఇదిలా ఉండగా.. బీజేపీ కొంత మంది సీనియర్లుకు షాక్ ఇచ్చింది. జార్ఖండ్ ప్రతినిధిగా రాజ్యసభలో ఉన్న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. వీరితో పాటు ఓపీ మాథుర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, వినయ్ సహస్త్రబుద్ధే వంటి సీనియర్లకు రాజ్యసభ సీటు ఇవ్వలేదు. ఇక, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోసం గోరఖ్‌పూర్ సీటును వదులుకున్న రాధా మోహన్ అగర్వాల్‌ను రాజ్యసభకు ఎంపికయ్యారు.
బీజేపీ అభ్యర్థులు వీరే:
నిర్మల సీతారామన్, జగ్గేశ్- కర్ణాటక
పీయూష్, అనిల్ సుఖ్‌దేవ్-మహారాష్ట్ర
సతీష్ చంద్ర, శంభు శరణ్-బిహార్
కృష్ణలాల్-హర్యానా
కవితా పటిదార్-మధ్య ప్రదేశ్
గణశ్యామ్-రాజస్థాన్
లక్ష్మికాంత్ వాజ్‌పేయి, రాధామోహన్, సురేంద్రసింగ్, బాబురామ్, దర్శణ సింగ్, సింగీత యాదవ్, లక్ష్మణ్- ఉత్తరప్రదేశ్
కల్పన సైని- ఉత్తరాఖండ్.
ఇది కూడా చదవండి: యూపీ నుంచి నామినేషన్ వేయనున్న బీజేపీ నేత
Comments
Please login to add a commentAdd a comment