
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రిమోట్ కంట్రోల్ ప్రధాని మాత్రమే కావాలని కేంద్ర మైనార్టీ వ్యహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం చేతిలో ఉండే రిమోట్ కంట్రోల్, కాంట్రాక్ట్ ప్రధానిని వారు కోరుకుంటున్నారని అన్నారు. కానీ దేశ ప్రజల మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ వంటి సమర్థవంతమైన నేతను మరోసారి ప్రధానిగా చూడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేశ రక్షణకు, అభివృద్ధికి మోదీయే సరైన నాయకుడిన నఖ్వీ అభివర్ణించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానిని ఆరు నెలలకోసారి మారుస్తుందని నఖ్వీ ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ పిక్నిక్‌కి వచ్చినట్లుగా ప్రచారానికి వస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడలేక కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment