
భోపాల్ : ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు పడరాని పాట్లు పడుతుంటారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సెక్యూరిటీ సిబ్బందికి చెమటలు పట్టించారు. రత్లాంలో సోమవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక ప్రజలకు అభివాదం చేసేందుకు బారికేడ్లను ఎక్కడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఉడెన్ బారికేడ్‌పైకి ఎక్కిన ప్రియాంక అక్కడ గుమికూడిన వారితో కరచాలనం చేయడంతో భద్రతా సిబ్బంది, కాంగ్రెస్ నేతలు సైతం బారికేడ్‌లను దూకి ఆమెకు భద్రతగా నిలిచారు. ప్రియాంక గాంధీ వాద్రా సహా కాంగ్రెస చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీలకు ఎస్పీజీ భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment