మాటలు చెప్పడం కాదు.. ప్రధాని మోదీపై రాహుల్‌, ప్రియాంక ఆగ్రహం | rahul slams modi on assault of two Army officers | Sakshi
Sakshi News home page

మాటలు చెప్పడం కాదు.. ప్రధాని మోదీపై రాహుల్‌, ప్రియాంక ఆగ్రహం

Published Thu, Sep 12 2024 4:49 PM | Last Updated on Thu, Sep 12 2024 6:36 PM

rahul slams modi on assault of two Army officers

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో ట్రైనీ ఆర్మీ అధికారులపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో పాటు అధికార బీజేపీని విమర్శించారు.

ఈ భయంకరమైన సంఘటన మొత్తం సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయి. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న నేరాల పట్ల బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుందని రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. నేరస్థులు వరుస దారుణాలతో ప్రభుత్వంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆ ఫలితమే ఈ దారుణాలు అని వ్యాఖ్యానించారు. 

 ట్రైనీ ఆర్మీ అధికారులపై జరిగిన దారుణం నా హృదయాన్ని ద్రవించి వేస్తుంది. మహిళల భద్రత గురించి ప్రధాని మోదీ ప్రసంగాలు చేస్తారు. మహిళలు మాత్రం రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నిరీక్షణ ఎప్పటికి ముగుస్తుంది? అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలో ప్రతిరోజూ 86 మంది మహిళలపై నిత్యం ఎక్కడో చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్రైనీ ఆర్మీ అధికారిపై దారుణం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. స్నేహితురాళ్లతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై అర్థరాత్రి ఎనిమిది మంది దుండగులు తుపాకులు, కత్తులతో దాడి చేశారు. అనంతరం వారిని బంధించి.. బాధితుల్లోని ఇద్దరిని రూ.10లక్షల తీసుకుని రావాలంటూ బెదిరించారు. దీంతో ఆ ఇద్దరు స్నేహితులు జరిగిన దారుణాన్ని ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

ఇదీ చదవండి : గణపతి పూజపై రాజకీయ దుమారం

ఘటన స్థలానికి చేరుకుని బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఓ ట్రైనీ ఆర్మీ అధికారిపై దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్‌ చేయగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement