
హైదరాబాద్: బారూద్, బందూక్, హెలికాప్టర్, జహాజ్ అన్నీ ప్రస్తుతం ‘మేడ్ ఇన్ ఇండియా’వే సైన్యంలో వాడుతున్నారని కేంద్ర మైనార్టీ వ్యవహరాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. ఇదీ ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఎన్‌డీటీవీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నఖ్వీ మాట్లాడుతూ... బారూద్ నుంచి అన్నీ.. ఇంతకు ముందు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని, ప్రస్తుతం విదేశాలు సైతం మన దేశానికి రావాల్సిన పరిస్థితిని తీసుకువచ్చామన్నారు. మోదీ కేంద్రం పగ్గాలు చేపట్టాక మూడున్నరేళ్లలో మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి వినూత్న ఆలోచనలకు ప్రోత్సహమిస్తున్నారన్నారు.
మనదేశంలోని యువతను ప్రోత్సహించడం ద్వారా మరింతగా ఉపాధి సౌకర్యం మెరుగుపర్చేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి ఐఏఎస్‌లు 52 మంది ఈ మూడేళ్లలో ముస్లింలు ఎంపికయ్యారన్నారు. అయితే దీనిపై గత ప్రభుత్వం లాగా పబ్లిసిటీ చేసుకోలేదన్నారు. ముద్రా స్కీమ్.. ఎంతో మంది చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారికి ఎంతో ఉపయుక్తమవుతోందన్నారు. విద్యార్థులు, యువతను ఉపా«ధి పొందేవారుగా కాకుండా ఉపాధి కల్పించేవారిగా ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్‌షిప్ ఫౌండేషన్ చైర్మన్ శివ్‌విక్రమ్ ఖేమ్కా అన్నారు. దేశ్యాప్తంగా అన్ని నగరాల్లో పర్యటించి విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చేందుకు బస్సు యాత్ర ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఉర్దూ వర్సిటీ చాన్స్‌లర్ జఫర్ సరేశ్‌వాలా, జెట్‌సెట్‌గో స్టార్టప్ వ్యవస్థాపకురాలు కనికతేక్రివాల్, ఎంటర్‌ప్రెన్యూర్ రవిమంతా చర్చలో పాల్గొనగా మోడరేటర్‌గా ఎన్‌డీటీవీ యాంకర్ ఉమ వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment