సాక్షి, హైదరాబాద్ : భారతదేశంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు ఇప్పటికే పలు బ్యాంకులు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసే అవసరం లేదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పష్టం చేశారు. ఇస్లామిక్ లేదా షరియా వ్యవస్థలో ఆర్థిక లావాదేవీలకు వడ్డీ ఉండదని ఆయన తెలిపారు.
అయితే భారతదేశం లౌకిక దేశమని.. ఇక్కడ మత ప్రాతిపదికన బ్యాంకులు, ఇతర వ్యవస్థలు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఆయా వర్గాల కోసం ప్రత్యేకంగా షెడ్యూల్డ్ బ్యాంకులను ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని నక్వీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment