నఖ్వీ నివాసం ఎదుట సాబీర్ భార్య హైడ్రామా
నఖ్వీ నివాసం ఎదుట సాబీర్ భార్య హైడ్రామా
Published Mon, Mar 31 2014 4:20 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
బీజేపీ నేత ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ నివాసం ముందు జేడీ(యూ) బహిషృత నేత సాబిర్ ఆలీ సతీమణి యాస్మిన్ హైడ్రామా సృష్టించారు. టెర్రిరిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణలు చేసిన నఖ్వీ క్షమాపణలు చెప్పాలంటూ యాస్మీన్ ధర్నా చేపట్టారు. న్యాయం జరిగేంత వరకు నఖ్వీ నివాసం ముందే కూర్చుంటాను. చేసిన ఆరోపణల్ని నఖ్వీ రుజువు చేయాలి లేదా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
సాబీర్ ఆలీ నివాసంలోనే భత్కల్ ను అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే భత్కల్ ఎక్కడ అరెస్ట్ చేసిందనే విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల సాబీర్ అలీ బీజేపీలో చేరడంపై ఆపార్టీకే చెందిన నఖ్వీ అభ్యంతరం చెప్పారు. భత్కల్ స్నేహితుడు సాబీర్ బీజేపీలో చేరారు. త్వరలోనే దావుద్ ను చేర్చకుంటారా? అంటూ ట్విటర్ లో పోస్ట్ చేశారు.
అంతేకాకుండా సాబీర్ కు టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపించారు. స్వంత పార్టీ నుంచే సాబీర్ ను చేర్చుకోవడంపై నిరసనలు వ్యక్తం కావడంతో ఇచ్చిన సభ్యత్వాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలపై నఖ్వీపై సాబీర్ ఆలీ పరువు నష్టం దావా కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement