Yasmin
-
Yasmeen:అసలు పెళ్లి అవుతుందా అని హేళన.. దేశంలోనే తొలి యాసిడ్ సర్వైర్ నర్స్
Acid Attack Survivor Yasmeen Mansoori: ఎవరో మూర్ఖంగా చేసిన పనికి ముఖం కాలిపోయింది, కళ్లు తెరవలేని పరిస్థితి. అయినా జీవితం మీద ఆశలు వదులుకోలేదు. ఇరవై సర్జరీలు చేయించుకున్నా, ముఖం పూర్వస్థితికి రాలేదు. ఏ మాత్రం నిరాశపడకుండా కష్టపడి చదివి ఏకంగా ఎయిమ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్ అయ్యింది యాస్మిన్ మన్సూరి. చిన్నపాటి కష్టాలను సాకులుగా చూపుతూ లక్ష్యం లేకుండా, నిర్లక్ష్యంగా బతుకుతోన్న ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది యాస్మిన్. అది 2004.. ఉత్తర్ ప్రదేశ్‌లో షామిలీ జిల్లాలో ఉంటోన్న యాస్మిన్ వాళ్ల కుటుంబం జీవనం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. అప్పుడు యాస్మిన్‌కు పదహారేళ్లు. ఒకరోజు వారిమీద కిట్టని వాళ్లెవరో యాసిడ్ పోశారు. ఈ దుర్ఘటనలో యాస్మిన్ చర్మం మూడు పొరల లోతు వరకు కాలిపోయింది. కళ్లు తెరిచే పరిస్థితి లేదు. తనతోపాటు ఉన్న చెల్లి శరీరం కూడా కాలింది. మంచి వైద్యం తీసుకునేందుకు యూపీ నుంచి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు వారిని. కొన్నాళ్లు కుటుంబం మొత్తం అక్కడే ఉంటూ మెరుగైన వైద్యం చేయించుకున్నారు. చికిత్స తర్వాత ఇంటికి వచ్చాక కూడా ఆసుపత్రికి వెళ్లక తప్పని పరిస్థితి వారిది. దీంతో రెండు వారాలకొకసారి ఢిల్లీ వెళ్లడం యాస్మిన్ జీవితంలో ఒక భాగమైంది. చికిత్సలో వాడే మందులు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూపించడంతో చాలా ఇబ్బందులకు గురైంది. ఈ అక్క చెల్లెళ్లను చూసిన వాళ్లు ‘‘ఈ పిల్లలను ఎవరు పెళ్లి చేసుకుంటారు, వీరికి అసలు పెళ్లి అవుతుందా?’’ అని గుసగుసలాడుకునేవారు. ఒకపక్క శారీరక బాధ, మరోపక్క గుండెల్లో గుచ్చుకునే మాటలు మానసికంగా బలహీన పరిచేవి. కొన్నాళ్లకు ఇలా కాదు. అయ్యిందేదో అయ్యింది. దానిని మార్చలేము కాబట్టి అలాగే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది యాస్మిన్. సేవలు నచ్చి... సఫ్దర్ జంగ్ తర్వాత చికిత్స కోసం ఎయిమ్స్‌కు వెళ్లింది యాస్మిన్. అక్కడ కొంతమంది నర్సులు రోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు నచ్చడంతో తను కూడా నర్స్ అయ్యి సేవలందించాలనుకుంది. అనుకున్న వెంటనే దూరవిద్య ద్వారా ఇంటర్మీడియట్ చదువుతూనే, మరోపక్క కంప్యూటర్ కోర్సు చేసింది. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో బిఏలో చేరింది. ఒకపక్క బిఏ చేస్తూనే ‘జామియా హమ్దార్ద్ యూనివర్సిటీ’లో నర్సింగ్‌లో చేరింది. అయితే ఆర్ట్స్ సబ్జెక్ట్ చదవడం వల్ల నర్సింగ్ బాగా కష్టంగా అనిపించేది తనకు. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయినప్పటికీ నిరాశ పడకుండా తరువాతి ప్రయత్నంలో పాస్ అయ్యింది. ఉత్తమ ఉద్యోగిగా నర్సింగ్ అయిపోయిన వెంటనే 2014లో హకీమ్ అబ్దుల్ అహ్మద్ సెంటెనరీ ఆసుపత్రిలో ఉద్యోగం దొరికింది. ఇక్కడ రెండేళ్లు పనిచేసాక, మరో ఆసుపత్రిలో చేరింది. ఇక్కడ యాస్మిన్ సేవలకు గుర్తింపుగా ‘బెస్ట్ ఎంప్లాయీ అవార్డు’ వచ్చింది. ఒకపక్క ప్రైవేటు హాస్పిటల్స్‌లో చేస్తూనే మరోపక్క ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేది. ఇదే సమయంలో ఎయిమ్స్‌లో నర్సులు కావాలన్న ప్రకటన చూసి అప్లై చేసింది,. అర్హతలన్నీ ఉన్నప్పటికీ డిజెబిలిటీ నిబంధనలకు ఆమె సరిపోదని తిరస్కరించారు. దీంతో యాసిడ్ సర్వైవర్‌ను కూడా డిజెబిలిటీ విభాగంలో చేర్చాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసింది. ధర్మాసనం 2016లో డిజెబిలిటీ చట్టంలో కొన్ని సవరణలు చేసి యాసిడ్ సర్వైర్స్‌ను కూడా ఈ చట్టపరిధిలోకి చేర్చింది. దీంతో రెండేళ్ల తరువాత ఎయిమ్స్‌లో ఉద్యోగాన్ని పొంది, ‘‘దేశంలోనే తొలి యాసిడ్ సర్వైర్ నర్స్’’ గా రికార్డు సృష్టించింది. ఇక్కడ రోగులకు మంచి సేవలందించడంతో ‘ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ పర్సన్’ విభాగంలో ‘బెస్ట్ ఎంప్లాయీ’ అవార్డును అందుకుంది. ‘‘ప్రస్తుతం దేశంలో ఎంతోమంది అమ్మాయిలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు. అమ్మాయిల జీవితంలో పెళ్లి అతిముఖ్యమైన అంశంగా చూస్తారు. అది సరికాదు. పెళ్లికి ముందు మనకెన్నో కలలు ఉంటాయి. వాటిని నిజం చేసుకుని ఆ తర్వాతే, జీవితంలో ముందుకు సాగాలి’’ అని యువతకు చెబుతోంది. -
స్వచ్ఛమైన మనసు
తాగుబోతు తండ్రి ఇల్లొదిలి వెళ్లిపోయాడు.. తల్లి సంపాదన ఏ మూలకూ చాలలేదు.. సునామీ సర్వస్వమూ కోల్పోయేలా చేసింది...బతుకుబాటలో ఊరు విడిచింది...ఊరుకాని ఊరిలో ఇబ్బందులు ఎదుర్కొంది.. ఆకలి దప్పులతో అలమటించింది..చివరకు జీవితంలో నిలదొక్కుకుంది..వందలాది అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారింది. సినిమాను తలపించే ఈ సంఘటలన్నీ యాస్మిని జీవితంలో చోటుచేసుకున్నవే.అందుకే ఈరోజు కథనం ఆమె గురించే..సాక్షి, స్టూడెంట్ ఎడిషన్. దేశానికి తూర్పున, బంగాళాఖాతం మధ్యలో ఉంటాయి అండమాన్ నికోబార్ దీవులు. వీటి రాజధాని పోర్ట్బ్లెయిర్లో నివసించే దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయే యాస్మిని. 2003 వరకూ ఆమె జీవితం మామూలుగానే సాగిపోయింది. అయితే ఆ మరుసటి ఏడాది నుంచే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మద్యానికి బానిసైన తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. ఓ ప్రభుత్వ స్కూల్లో తక్కువ వేతనానికి పనిచేసే తల్లి కుటుంబాన్ని పోషించడానికి అష్టకష్టాలూ పడేది. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు 2004లో వచ్చిన సునామీలో యాస్మిని కుటుంబం సర్వస్వమూ కోల్పోయింది. ఇల్లు ధ్వంసమైంది. సామగ్రి కొట్టుకుపోయింది. దీంతో రోజుల తరబడి రోడ్ల మీదే గడిపారు. అప్పుడు యామిని పదోతరగతి చదువుతోంది. చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగం.. ఈ పరిస్థితుల్లో కుటుంబ భారాన్ని మోసేందుకు తల్లికి సాయంగా కష్టపడాలని నిర్ణయించుకుంది యాస్మిని. వెంటనే చిన్నపాటి జీతానికి పార్ట్ టైం ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తూనే ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది.సునామీలో ధ్వంసమైన ఇంటికి మరమ్మతులు చేయించింది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, తమ్ముళ్లను బాగా చదివించాలని నిర్ణయించుకొని మంచి ఉద్యోగం, సంపాదన కోసం ముంబైకి చేరింది. అయితే,అక్కడ అంత సులభంగా ఉద్యోగం దొరకలేదు. అష్టకష్టాలూ పడి ఓ ప్రభుత్వ కార్యాలయంలో రూ.6,500కు కాంట్రాక్టు పద్ధతిలో చిన్న ఉద్యోగం సంపాదించింది. వచ్చే ఆదాయంలోనే ఇంటి ఖర్చులకు పంపేది. ఒక్కోసారి తినడానికీ డబ్బులు సరిపోక పస్తులు ఉండేది. ఆ సమయంలోనే తిండి లేని తనలాంటి వాళ్లను, అనాథలను ఎంతోమందిని చూసింది. ఆలయాలు, ట్రాఫిక్ సిగ్నళ్లు, వీధుల్లో అనేకమంది నిరాశ్రయులు దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపు ఎండబెట్టుకుంటున్నారని గుర్తించింది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో తనలాంటి వారి కడుపు నింపేందుకు నడుం బిగించింది. అనాథల ఆకలి తీరుస్తూ.. అనుకున్నదే తడవుగా ఆచరణలోకి దిగింది. మొదట తన పుట్టినరోజును, పండగలను అనాథల సమక్షంలో జరుపుకోవడం ప్రారంభించింది. దీనికోసం మురికివాడలు, రైల్వే స్టేషన్లు, అనాథాశ్రమాలకు వెళ్లేది. అక్కడిపిల్లలకు, వృద్ధులకు కావల్సిన తినుబండారాలు, దుస్తులు తీసుకెళ్లి పంచేది. కొందరిని అనాథాశ్రమాల్లో చేర్పించింది. ఇదే సమయంలో ఆమెకు ఓ పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతంతోపాటుఅదనంగా కమీషనూ రావడం మొదలైంది. ఈ క్రమంలోనే ఫేస్బుక్లో కనిపించిన చిన్ననాటి స్నేహితునితో ప్రేమలో పడి, వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత దంపతులు చెన్నైకి వెళ్లి వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారంవృద్ధి చెందడంతో మంచి ఇంటితోపాటు కారు కొనుగోలు చేశారు. ఈ కార్లోనే రోజూ అనాథలు, నిరాశ్రయులకు కావల్సిన ఆహార పదార్థాలు, బట్టలు, చెప్పులు, చాక్లెట్లు, మందులు కొని పంచడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రోజూ నగరంలో కనీసం 30 కి.మీ ప్రయాణిస్తూ వీటిని అందజేస్తున్నారు. అనాథలు, నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నారు. యాస్మిన్ అంటే అరబిక్‌లో మల్లెపువ్వు అని అర్థం. ఇంగ్లిష్‌లోని జాస్మిన్ పదానికి ఇదే మూలం. మల్లెపువ్వు తెల్లదనం స్వచ్ఛతకు ప్రతీక. అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారిన యాస్మిన్ మనసు కూడా స్వచ్ఛమైనదే. -
తల్లి గర్భంలోనే శిశువు మృతి
వైద్యులే నిర్లక్ష్యమంటూ బంధుమిత్రుల ఆరోపణ ఎంజీఎం : తల్లి గర్భంలోనే శిశువు మృతి చెందిందని వైద్యులు పేర్కొనడంతో బంధుమిత్రులు ఒక్కసారిగా కోపోద్రిక్తులై ఆందోళన చేసిన సంఘటన మంగళవారం సీకేఎం ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకా రం.. నగరంలోని రంగ శాయిపేటకు చెందిన ఇంతియాజ్ఆలీ భార్య యాస్మీన్ ప్రసవం సీకేఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అస్మీన్ రెండు రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకురాగా ఆపరేషన్ చేసి ప్రసవం నిర్వహించాలని కోరారు. అయితే సదరు గర్బిణీకి రక్తం తక్కువగా ఉందని రక్తం అందుబాటులోకి ఉంచాలని వైద్యులు తెలిపారని, అంతే కాకుండా అపరేసన్ కాకుండా నా ర్మల్ డెలివరీ చేస్తామని ఆలస్యం చేశారని బంధువులు ఆరోపించారు. అయితే వైద్యుల సలహా మేరకు రక్తాన్ని ైబందుమిత్రులు అందుబాటులో ఉంచారు. ఈ క్రమం లో ఉదయం స్కానింగ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు గర్బంలో శిశువు మృతిచెందినట్లుగా గుర్తించి విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆగ్రహించిన కు టుంబ సభ్యులు, బంధుమిత్రులు వైద్యుల నిర్లక్ష్యమే వల్లే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విష యం తెలుసుకున్న ఇంతేజార్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ఆరా తీశారు. సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా సదరు గర్బిణీ రక్తం తక్కువగా ఉందని పేర్కొన్నారు. అయితే ప్రసవానికి ఆమెకు ఇంకా మూడు వారాల సమయం ఉందని, శివువు మృతి చెందినట్లుగా గుర్తించినట్లు తెలిపారు. -
నఖ్వీ నివాసం ఎదుట సాబీర్ భార్య హైడ్రామా
బీజేపీ నేత ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ నివాసం ముందు జేడీ(యూ) బహిషృత నేత సాబిర్ ఆలీ సతీమణి యాస్మిన్ హైడ్రామా సృష్టించారు. టెర్రిరిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణలు చేసిన నఖ్వీ క్షమాపణలు చెప్పాలంటూ యాస్మీన్ ధర్నా చేపట్టారు. న్యాయం జరిగేంత వరకు నఖ్వీ నివాసం ముందే కూర్చుంటాను. చేసిన ఆరోపణల్ని నఖ్వీ రుజువు చేయాలి లేదా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. సాబీర్ ఆలీ నివాసంలోనే భత్కల్ ను అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే భత్కల్ ఎక్కడ అరెస్ట్ చేసిందనే విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల సాబీర్ అలీ బీజేపీలో చేరడంపై ఆపార్టీకే చెందిన నఖ్వీ అభ్యంతరం చెప్పారు. భత్కల్ స్నేహితుడు సాబీర్ బీజేపీలో చేరారు. త్వరలోనే దావుద్ ను చేర్చకుంటారా? అంటూ ట్విటర్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా సాబీర్ కు టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపించారు. స్వంత పార్టీ నుంచే సాబీర్ ను చేర్చుకోవడంపై నిరసనలు వ్యక్తం కావడంతో ఇచ్చిన సభ్యత్వాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలపై నఖ్వీపై సాబీర్ ఆలీ పరువు నష్టం దావా కేసు నమోదు చేశారు. -
విషాదం
చీడికాడ/గోపాలపట్నం ,న్యూస్‌లైన్: వివాహవేడుకల్లో వారంతా ఆనందగా గడిపారు. సమీపంలోని జలాశయానికి విహారయాత్రకు వెళ్లిన వారిపై విధి కన్నెర్ర చేసింది. బోటులో షికారు చేయకముందే ఇద్దరిని అందని తీరాలకు చేర్చింది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా పెళ్లి సందడిలో మునిగి తేలిన వారంతా అంతలోనే కన్నీరుమున్నీరయ్యారు. విశాఖ గోపాలపట్నం శివారు కొత్తపాలెం నాగేంద్రకాలనీకి చెందిన ముస్లింలు చీడికాడ మండలం శిరిజాంలో వివాహానికి శుక్రవారం హాజరయ్యారు. అక్కడ మధ్యాహ్నం భోజనాలు చేశాక కోనాం జలాశయాన్ని చూడ్డానికి వెళ్లారు. అందులో బోటు షికారుకు ఆసక్తి చూపారు. ఒడ్డున ఉన్న ఒక మత్స్యకారుడి బోటులోకి ఎనిమిదిమంది మహిళలు ఎక్కి కూర్చున్నారు. అంతా ఒకే వైపునకు వెళ్లడంతో సుమారు 30 అడుగుల లోతున నీటిలోకి ఒరిగిపోయింది. మహిళలంతా జలాశయంలో పడిపోయారు. వారిలో ముగ్గురిని బోటు డ్రైవర్ రంసాల దేముడు, మరో ముగ్గురిని వారితో వచ్చిన యువకులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. షేక్ యాస్మిన్ (15), షేక్ ముంతాజ్ బేగం(30)లు గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు వలలతో గాలించగా సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో యాస్మిన్ మృతదేహం బయటపడింది. మరో అరగంట తరవాత ముంతాజ్‌బేగం మృతదేహం దొరికింది. ఏకైక కుమార్తె యాస్మిన్ కళ్లముందే చనిపోవడంతో తండ్రి పీర్సాహెబ్ను ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. బోటు షికారుకి తీసుకొచ్చిన భార్య ముంతాజ్‌బేగం నీటిలో మునిగిపోవడం కళ్లారా చూసిన భర్త మస్తాన్ వేదన వర్ణనాతీతం. ఇక అమ్మ లేదని ఇద్దరు పిల్లలకు ఎలా చెప్పేదంటూ అతడు విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. బంధువులు, స్థానికులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. విషయం తెలుసుకున్న కోనాం వైఎస్సార్ సీపీ నాయకులు జి.సత్యనారాయణరాజు, రెడ్డి సన్యాసినాయుడులు జలాశయం వద్దకు చేరుకొని బాధితులను ఓదార్చారు. ఈ సమాచారంతో గోపాలపట్నం నాగేంద్రకాలనీలో విషాదం అలుముకుంది. చీడికాడ ట్రైనీ ఎస్ఐ ప్రభాకరరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి ఆస్పత్రికి తరలిస్తామన్నారు. తరచూ ప్రమాదాలు జిల్లాలో విహార యాత్రకు కోనాం జలాశయం ప్రాంతానికి మంచి గుర్తింపు. కానీ తరచూ నాటుపడవల ప్రమాదాలతో విషాదం చోటుచేసుకుంటోంది. 1996లో ఇదే జలాశయంలో బోటు బోల్తాపడి 21మంది గిరిజనులు చనిపోయారు. గత ఎనిమిదేళ్లలో పలు ప్రమాదాల్లో మరో 15మంది వరకు మృత్యువాతపడ్డారు.