తల్లి గర్భంలోనే శిశువు మృతి
వైద్యులే నిర్లక్ష్యమంటూ బంధుమిత్రుల ఆరోపణ
ఎంజీఎం : తల్లి గర్భంలోనే శిశువు మృతి చెందిందని వైద్యులు పేర్కొనడంతో బంధుమిత్రులు ఒక్కసారిగా కోపోద్రిక్తులై ఆందోళన చేసిన సంఘటన మంగళవారం సీకేఎం ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకా రం.. నగరంలోని రంగ శాయిపేటకు చెందిన ఇంతియాజ్‌ఆలీ భార్య యాస్మీన్ ప్రసవం సీకేఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అస్మీన్ రెండు రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకురాగా ఆపరేషన్ చేసి ప్రసవం నిర్వహించాలని కోరారు. అయితే సదరు గర్బిణీకి రక్తం తక్కువగా ఉందని రక్తం అందుబాటులోకి ఉంచాలని వైద్యులు తెలిపారని, అంతే కాకుండా అపరేసన్ కాకుండా నా ర్మల్ డెలివరీ చేస్తామని ఆలస్యం చేశారని బంధువులు ఆరోపించారు.
అయితే వైద్యుల సలహా మేరకు రక్తాన్ని ైబందుమిత్రులు అందుబాటులో ఉంచారు. ఈ క్రమం లో ఉదయం స్కానింగ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు గర్బంలో శిశువు మృతిచెందినట్లుగా గుర్తించి విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆగ్రహించిన కు టుంబ సభ్యులు, బంధుమిత్రులు వైద్యుల నిర్లక్ష్యమే వల్లే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విష యం తెలుసుకున్న ఇంతేజార్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ఆరా తీశారు. సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా సదరు గర్బిణీ రక్తం తక్కువగా ఉందని పేర్కొన్నారు. అయితే ప్రసవానికి ఆమెకు ఇంకా మూడు వారాల సమయం ఉందని, శివువు మృతి చెందినట్లుగా గుర్తించినట్లు తెలిపారు.