Sabir Ali
-
మళ్లీ గ్రామజ్యోతి పధకం ఎందుకు : కోమటిరెడ్డి
-
నఖ్వీ నివాసం ఎదుట సాబీర్ భార్య హైడ్రామా
బీజేపీ నేత ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ నివాసం ముందు జేడీ(యూ) బహిషృత నేత సాబిర్ ఆలీ సతీమణి యాస్మిన్ హైడ్రామా సృష్టించారు. టెర్రిరిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణలు చేసిన నఖ్వీ క్షమాపణలు చెప్పాలంటూ యాస్మీన్ ధర్నా చేపట్టారు. న్యాయం జరిగేంత వరకు నఖ్వీ నివాసం ముందే కూర్చుంటాను. చేసిన ఆరోపణల్ని నఖ్వీ రుజువు చేయాలి లేదా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. సాబీర్ ఆలీ నివాసంలోనే భత్కల్ ను అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే భత్కల్ ఎక్కడ అరెస్ట్ చేసిందనే విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల సాబీర్ అలీ బీజేపీలో చేరడంపై ఆపార్టీకే చెందిన నఖ్వీ అభ్యంతరం చెప్పారు. భత్కల్ స్నేహితుడు సాబీర్ బీజేపీలో చేరారు. త్వరలోనే దావుద్ ను చేర్చకుంటారా? అంటూ ట్విటర్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా సాబీర్ కు టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపించారు. స్వంత పార్టీ నుంచే సాబీర్ ను చేర్చుకోవడంపై నిరసనలు వ్యక్తం కావడంతో ఇచ్చిన సభ్యత్వాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలపై నఖ్వీపై సాబీర్ ఆలీ పరువు నష్టం దావా కేసు నమోదు చేశారు. -
సబీర్‌కు బీజేపీ రాంరాం
పార్టీలో చేర్చుకున్న 24 గంటల్లోపే సభ్యత్వం రద్దు పార్టీలో, ఆర్ఎస్ఎస్ నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కారణం న్యూఢిల్లీ: ఇటీవల శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ను చేర్చుకుని గంటల్లోనే బయటకు పంపిన బీజేపీ.. మరోసారి నాలిక్కరుచుకుంది. వివాదాస్పద జేడీయూ నాయకుడు సబీర్ అలీని పార్టీలో ఇలా చేర్చుకుని 24 గంటలు తిరిగేలోపే తూచ్ అంటూ శనివారం ఆయన సభ్యత్వం రద్దు చేసింది. సబీర్ అలీ చేరికపై అటు పార్టీలో అంతర్గతంగా, ఇటు ఆర్ఎస్ఎస్ నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వేరే దారిలేక ఆయన్ను సాగనంపింది. ఒకే వారంలో ఇలాంటి రెండు ఘటనలు.. పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లో పడేశాయి. ఉగ్రవాది యాసిన్ భత్కల్‌కు స్నేహితుడైన సబీర్ అలీని పార్టీలో చేర్చుకుంటున్నారంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ శుక్రవారం విమర్శించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుపోతే దావూద్ ఇబ్రహీంను కూడా పార్టీలో చేర్చుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. తాజా పరిణామం నేపథ్యంలో నఖ్వీ.. ట్విట్టర్లో అలీపై చేసిన ట్వీట్‌ను ఉపసంహరించుకున్నారు. కోరింది జరిగిందని, ఇక ఈ అంశం ముగిసిందని పేర్కొన్నారు. పార్టీ నేతలు విమర్శిస్తున్నారనే.. బీజేపీ నాయకుడు రవి శంకర్ ప్రసాద్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. సబీర్ అలీ చేరికపై ఆర్ఎస్ఎస్తోపాటు పార్టీ సభ్యులు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ నిర్ణయించినట్లు చెప్పారు. నఖ్వీ లాంటి పార్టీ నేతలు కొందరు బహిరంగంగా చేసిన కామెంట్లను పరిశీలించాక రాజ్‌నాథ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. -
నిరసనకు తలవొగ్గిన బీజేపీ, సాబీర్ సభ్యత్వం రద్దు!
న్యూఢిల్లీ: సొంత పార్టీ నుంచే ఊహించని విధంగా వచ్చిన నిరసనకు బీజేపీ అధిష్టానం తలవొంచింది. వివాదస్పద నేత సాబీర్ ఆలీ సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొజాహిద్దిన్ టెర్రరిస్ట్ గ్రూప్ కు చెందిన యాసిన్ భత్కల్ స్నేహితుడైన సాబీర్ ఆలీకి బీజేపీ సభ్యత్వం ఇచ్చింది. అయితే ఇతర పార్టీల నేతల నుంచి కాకుండా సొంత పార్టీ నేతలే బీజేపీ నిర్ణయాన్ని తప్పుపట్టడం తెలిసిందే. సాబీర్ ను పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ త్వరలో దావుద్ ను కూడా చేర్చుకుంటారేమో అని పార్టీ ఉపాధ్యక్షుడు ముఖ్తర్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. సాబీర్ ఆలీని పార్టీలోకి ఆహ్వానించడంపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మరో నేత బల్బీర్ పంజ్ సూచించారు. సాబీర్ ఆలీ లాంటి వ్యక్తులు పార్టీలో చేరడం వలన కార్యకర్తల మనోభావాలు దెబ్బ తింటాయని మరో నేత రామేశ్వర్ చౌరాసియా అనడంతో సాబీర్ ఆలీ సభ్యత్వాన్ని వెనక్కి తీసుకున్నారు. జనతా దళ్ యునైటెడ్ పార్టీ నుంచి బహిష్కృతుడైన సాబీర్ ఆలీ ఇటీవల బీజేపీలో చేరారు. -
సాబీర్ ఆలీ తర్వాత దావూద్ ను చేర్చుకుంటారా?: నఖ్వీ
న్యూఢిల్లీ: బీజేపీలో మొజాహిద్దీన్ టెర్రిరిస్ట్ గ్రూప్ కు చెందిన యాసిన్ భత్కల్ స్నేహితుడు సాబీర్ ఆలీ చేరిక అగ్గి రాజేస్తోంది. బీజేపీలో సాబీర్ ఆలీ చేరికపై మెజార్టీ పార్టీ నేతలు వ్యతిరేకించడం చర్చనీయాంశమైంది. టెర్రిరిస్ట్ భత్కల్ స్నేహితుడు బీజేపీలో చేరాడు. త్వరలో దావుద్ ను కూడా చేర్చుకుంటారేమో అని పార్టీ ఉపాధ్యక్షుడు ముఖ్తర్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. అంతేకాకుండా పార్టీ చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని నఖ్వీ నిలదీయడం అగ్ర నాయకత్వానికి మింగుడు పడటం లేదు. సాబీర్ ఆలీని పార్టీలోకి ఆహ్వానించడంపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మరో నేత బల్బీర్ పంజ్ సూచించారు. పార్టీ నిర్ణయం లక్షలాది మంది కార్యకర్తల్ని షాక్ గురి చేసిందన్నారు. సాబీర్ ఆలీ లాంటి వ్యక్తులు పార్టీలో చేరడం వలన కార్యకర్తల మనోభావాలు దెబ్బ తింటాయని మరో నేత రామేశ్వర్ చౌరాసియా అన్నారు. అయితే సాబీర్ పై పెరుగుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాలంటే అందర్ని కలుపుకుపోవాలని ఆయన సూచించారు. కీలక ఎన్నికల సమయంలో సాబీర్ ఆలీ చేరికపై ఇతర పార్టీలు పెద్దగా స్పందించకపోయినా.. బీజేపీ నేతలే వివాదస్పదం చేయడం చర్చనీయాంశమవుతోంది.