నిరసనకు తలవొగ్గిన బీజేపీ, సాబీర్ సభ్యత్వం రద్దు! | Sabir Ali out of BJP | Sakshi
Sakshi News home page

నిరసనకు తలవొగ్గిన బీజేపీ, సాబీర్ సభ్యత్వం రద్దు!

Published Sat, Mar 29 2014 4:24 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Sabir Ali out of BJP

న్యూఢిల్లీ: సొంత పార్టీ నుంచే ఊహించని విధంగా వచ్చిన నిరసనకు బీజేపీ అధిష్టానం తలవొంచింది. వివాదస్పద నేత సాబీర్ ఆలీ సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.  మొజాహిద్దిన్ టెర్రరిస్ట్ గ్రూప్ కు చెందిన యాసిన్ భత్కల్ స్నేహితుడైన సాబీర్ ఆలీకి బీజేపీ సభ్యత్వం ఇచ్చింది. అయితే ఇతర పార్టీల నేతల నుంచి కాకుండా సొంత పార్టీ నేతలే బీజేపీ నిర్ణయాన్ని తప్పుపట్టడం తెలిసిందే. 
 
సాబీర్ ను పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ త్వరలో దావుద్ ను కూడా చేర్చుకుంటారేమో అని పార్టీ ఉపాధ్యక్షుడు ముఖ్తర్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. సాబీర్ ఆలీని పార్టీలోకి ఆహ్వానించడంపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మరో నేత బల్బీర్ పంజ్ సూచించారు. సాబీర్ ఆలీ లాంటి వ్యక్తులు పార్టీలో చేరడం వలన కార్యకర్తల మనోభావాలు దెబ్బ తింటాయని మరో నేత రామేశ్వర్ చౌరాసియా అనడంతో సాబీర్ ఆలీ సభ్యత్వాన్ని వెనక్కి తీసుకున్నారు. జనతా దళ్ యునైటెడ్ పార్టీ నుంచి బహిష్కృతుడైన సాబీర్ ఆలీ ఇటీవల బీజేపీలో చేరారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement